అమృత్ (AMRUT)
అధిక జనాభాతో సతమవుతున్న పట్టణాల రూపురేఖలను మార్చేందుకు అమృత్ పథకాన్ని 2015, జూన్ 25న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో 500 అమృత్ పట్టణాలకు రూ. 50 వేల కోట్లు వెచ్చించనుంది. అమృత్ అంటే పట్టణాల్లో మౌలికవసతుల కల్పనకు సంబంధించింది. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌పార్మేషన్. 2007లో ప్రారంభించిన జేఎన్‌ఎన్‌ఎంయూఆర్‌ఎం పథకంలో మార్పులు చేసి అమృత్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం రూ. 50 వేల కోట్లు కేటాయిస్తారు. ఈ పథకంపై 2015, జూన్ 25న ఢిల్లీలో కేంద్రం ఒక సదస్సు నిర్వహించింది.