Type Here to Get Search Results !

Vinays Info

Submarines Day | జలాంతర్గాముల దినోత్సవం

నేడు జలాంతర్గాముల దినోత్సవం సందర్భంగా...
🔻 *ప్రపంచంలోని మొత్తం అణ్వస్త్రాల్లో దాదాపు సగం.. అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గా ము (S.S.B.N)ల్లోనే ఉన్నాయి.*
*రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన నౌకాదళాల్లో జలాంత ర్గామి సిబ్బంది సంఖ్య 1.6 శాత మే. అయితే 55 శాతం మేర శత్రు యుద్ధనౌకలను జలాంతర్గా ములే నాశనం చేశాయి. వీటి సామర్థ్యానికిఇదిమచ్చుతునక.*

🔻 *భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపచేస్తూ.. దేశ తొలి స్వదేశీ నిర్మిత అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ (శత్రు నాశని) నౌకా దళంలో చేరింది.* ఈ జలాంత ర్గామి ప్రవేశంతో భారత్‌కు నేల, నింగి, జల మార్గాల గుండా అణ్వస్త్ర దాడి చేయగలిగిన సామర్థ్యం ఒనగూరింది.
*అణు జలాంతర్గామిని నిర్మించి, నిర్వహించే సామర్థ్యం కలిగిన ఐదు దేశాల సరసన భారత్‌ చేరింది.*

🔻 *శక్తిమంతమైన ఆయుధం .*
జలాంతర్గాములు గోప్యంగా సాగరాల్లో సంచరిస్తూ శత్రువుల గుండెల్లో నిద్రపోతుంటాయి. భారీ యుద్ధనౌకలను కూడా ఇవి ధ్వంసం చేయగలవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500కుపైగా జలాంతర్గాములు సాగర గర్భాల్లో గస్తీ తిరుగుతున్నాయి. సంప్రదాయ జలాంతర్గాములు డీజిల్‌-ఎలక్ట్రిక్‌ ఇంధనంతో పనిచేస్తాయి. బ్యాటరీలను రీఛార్జి చేసుకోవడానికి ఇవి సముద్ర ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాములు మాత్రం నెలల తరబడి నీటి అడుగునే ఉండగలవు. వీటికి ఒక్కసారి ఇంధనం నింపితే దాదాపు పదేళ్ల వరకూ పనిచేస్తాయి. ఒక్క నిమిషంలోనే నీటి కిందకు వెళ్లిపోగలవు. అందువల్ల అణ్వస్త్రదాడికి ఇవి చాలా అనుకూలమైనవి.

🔻 *నేల నుంచి ప్రయోగించేందు కు అగ్ని బాలిస్టిక్‌ క్షిపణులు భారత్‌ వద్ద ఉన్నాయి. వాయు మార్గంలో అణు దాడి చేయడా నికి మిరాజ్‌-2000 వంటి యుద్ధవిమానాలు ఉన్నాయి.* ప్రస్తుతం భారత్‌ వద్ద రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్‌ఎస్‌ చక్ర అనే అణు జలాంతర్గామి మాత్రమే ఉంది. ఇందులో అణ్వస్త్రాలను మోహరించలేదు. దీంతో నీటి నుంచి అణు దాడి చేసే సామర్థ్యం మనదేశానికి ఇప్పటివరకూ లేదు. అరిహంత్‌ రాకతో ఆ కొరత తీరింది. అయితే జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్‌ క్షిపణుల (ఎస్‌ఎల్‌బీఎం)ను అరిహంత్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానించడానికి ఇంకొంత సమయం పడుతుంది.

🔻 *రెండు రకాలు..* 
〰〰〰〰〰〰
*అణు జలాంతర్గాముల్లో రెండు రకాలు న్నాయి. ఒకటి దీర్ఘశ్రేణి అణువార్‌హెడ్లను మోసుకెళ్లగ లిగే *S.S.B.Nలు,*సాధారణ దాడులకుఉపయోగించే *S.S.Nలు* ఉంటాయి. ఎస్‌ఎస్‌ఎన్‌లతో పోలిస్తే ఎస్‌ఎస్‌బీఎన్‌లు గోప్యంగా, పరిమాణంపరంగా పెద్దగా ఉంటాయి. శత్రు దేశం అణుదాడికి దిగితే.. ప్రతిదాడి చేయడానికి ఎస్‌ఎస్‌బీఎన్‌లు అనువైనవి. అరిహంత్‌ కూడా భీకరమైన ఎస్‌ఎస్‌బీఎన్‌ తరగతి జలాంతర్గామే.

🔻 *కారణమిదీ..*
1971 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా నౌకాదళం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత విజ్ఞప్తి మేరకు రష్యాకు చెందిన అణు జలాంతర్గాములు వ్లాదివోస్తోక్‌ నౌకా స్థావరం నుంచి వచ్చి.. అమెరికా నౌకాదళాన్ని అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అద్భుత సామర్థ్యాన్ని పరిశీలించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. దేశీయంగా అణు జలాంతర్గాముల నిర్మాణానికి ఆదేశించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 1974లో దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది.
*నీటిలో నిప్పు కణిక!*
భారత నౌకాదళంలోకి ‘అరిహంత్‌’
ఇనుమడించిన దేశ రక్షణ సామర్థ్యం*

🔻 *విశాఖలో నిర్మాణం..*
అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెహికిల్‌ (ఏటీవీ) పేరుతో అణు జలాంతర్గామి నిర్మాణాన్ని భారత్‌ చేపట్టింది. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రంలో అత్యంత గోప్యంగా, ప్రధాన మంత్రి కార్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు సాగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పర్యవేక్షణలో ఈ జలాంతర్గామి నిర్మాణం జరిగింది. నౌకాదళంతోపాటు ఎల్‌అండ్‌ టీ, టాటా పవర్‌ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి.

🔻1974లో ప్రాజెక్టు ప్రారంభం. 
🔻1984లో డిజైన్‌కు ఆమోదం. 
🔻1998లో అరిహంత్‌ నిర్మాణం ప్రారంభం. 
🔻2009లో జలప్రవేశం. 
🔻2013లో ఈ జలాంతర్గామిలోని అణు రియాక్టర్‌ పనిచేయడం ప్రారంభించింది. 
🔻 2014 డిసెంబర్‌లో అరిహంత్‌ సముద్ర పరీక్షలకు బయలుదేరింది. 
🔻2016లో నౌకాదళంలో చేరిక.*
🔻పది మీటర్ల వెడల్పు కలిగిన ఈ జలాంతర్గామిలో పట్టేలా అణు రియాక్టర్‌ను రూపొందించారు. రష్యా సహకారంతో బాబా అణుపరిశోధన సంస్థ దీన్ని తయారుచేసింది. 
🔻అణుజలాంతర్గాముల కోసం విశాఖపట్నాని కి చేరువలోని రాంబిల్లిలో ‘ఐఎన్‌ఎస్‌ వర్ష’ పేరుతో కొత్త స్థావరాన్ని నౌకాదళం నిర్మిస్తోంది. గోప్యత కోసం ఇందులో నేలమాళిగ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. 
🔻 * జలాంతర్గాములతో రహస్యంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి నౌకాదళం.. తమిళనాడులోని ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ స్థావరంలో కొత్తగా వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రసార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.*

*పరీక్షలన్నీ విజయవంతం..*
సముద్ర పరీక్షల్లో భాగంగా అరిహంత్‌ నుంచి ఏడుసార్లు ‘కె’ శ్రేణి క్షిపణులను ప్రయోగించారు. డైవింగ్‌ పరీక్షలు సాఫీగా సాగాయి. పరీక్షల్లో రష్యాకు చెందిన ఎప్రాన్‌ అనే జలాంతర్గామి సహాయక నౌక దీనికి తోడుగా వచ్చింది.

🔻మరో మూడు.. 
అరిహంత్‌తోపాటు మరో మూడు జలాంతర్గాములను నిర్మించడానికి భారత్‌ కసరత్తు చేస్తోంది. రెండో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిధమన్‌ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 2018లో ఇది నౌకాదళానికి అందుతుందని అంచనా.

🔻 *అరిహంత్‌ వివరాలివీ..*
బరువు: 6వేల టన్నులు 
శక్తి: 83 మెగావాట్ల ప్రెజరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్‌ 
నీటిలోపల వేగం: 24 నాట్లు 
వ్యయం: 290 కోట్ల డాలర్లు (ఈ ప్రాజెక్టు కింద కొన్ని నిర్మాణ కేంద్రాల ఏర్పాటు వ్యయం కూడా ఇందులో ఉంది.)

🔻 *ఆయుధ సామర్థ్యం*
నాలుగు కె-4 జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్‌ క్షిపణులు (పరిధి: 3500 కిలోమీటర్లు) లేదా పన్నెండు కె-5 క్షిపణులు (పరిధి: 700 కిలోమీటర్లు) 
🔻అరిహంత్‌లోని క్షిపణి ప్రయోగ గొట్టాలను.. నిర్భయ్‌, బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణులను కూడా మోసుకెళ్లేలా రూపొందించారు.  
🔻పలురకాల టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను కూడా మోసుకెళుతుంద

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section