Type Here to Get Search Results !

Vinays Info

PSLV - C36

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌకను విజయవంతంగా నింగిలోకి పంపించింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు నుంచి నిరంతరాయంగా కొనసాగిన కౌంట్‌డౌన్‌ పూర్తికాగానే రిసోర్స్‌శాట్‌-2ఎ అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ36 రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. రాకెట్‌ నుంచి విడిపోయిన ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో చేరడంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు.

రిసోర్స్‌ శాట్‌-2ఎ ఉపగ్రహం బరువు 1,235 కిలోలు. ఇది ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా వ్యవసాయ రంగానికి ఎంతో మేలు కలగనుంది. జలవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయ, రక్షణ రంగాలకు దీనితో ప్రయోజనం చేకూరనుంది. రిసోర్స్‌శాట్‌-2 ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో రిసోర్స్‌శాట్‌-2ఎ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section