నేడు భారతీయ సైనిక దళాల పతాక దినోత్సవం సందర్భంగా...
🍀సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి మరియు శత్రువుల బారి నుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తుచేసుకుం టూ వారు మరియు వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈనాటి ప్రత్యేకత.
🍀మన భారత సైన్యం, వైమానిక దళం మరియు నావికా దళం దేశసరిహద్దులను కాపాడటమే కాకుండా దేశంలోని అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్తితులను చక్కదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ...
*🍀దేశ ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందువరసలో ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు.*
🍀 *విభిన్న రాష్ట్రాలలో వచ్చిన వరదలు, భూకంపాలలో వేలమంది ప్రజలు కొండలు, గుట్టల్లో చిక్కుకున్నపుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండ వారిని కాపాడి సురక్షిత స్థలాలకు చేర్చిన సంగతి మనకి విదితమే.*
🍀 *ఇంతే కాకుండా పలుచోట్ల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టుచూ వేలమంది ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు.*
🍀సైనిక సంక్షేమశాఖ అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సంక్షేమము కొరకు ప్రత్యేకముగా స్థాపించబడినది. ఈ శాఖ రాష్ట్రములో హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము తరుపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమముగా చేర్చుట కొరకు ఈ శాఖ ప్రత్యేకముగా కృషిచేస్తుంది.
*🌷ఈ సందర్భంగా మన ఆర్మీ గురించి కొన్నివిశేషాలు!🌷*
🍀 *హిట్లర్‌కు ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం.*
ఒక సందర్భంలో ఆయన మన ‘గూర్ఖా’ దళం సహాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట. గూర్ఖా సైనికులు తన దగ్గర ఉంటే మొత్తం ఐరోపా ఖండాన్నే తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవచ్చని ఆయన తలపోశారట! జర్మనీ సైనికులకు దీటైన శక్తి ప్రపంచంలో గూర్ఖా దళం ఒక్కటే అని హిట్లర్ అన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సైనిక దళం భారత్‌కే ఉంది.
🍀 *ఖండాంతర క్షిపణి అగ్ని-5 ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడం ద్వారా భారత్… యు.ఎస్. ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది.*
🍀 *ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలోని యుద్ధక్షేత్రం భారత్ నియంత్రణలో ఉంది. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో మన సైనికులు గస్తీ కాస్తున్నారు.*
🍀 *అతిపెద్ద వలంటీర్ ఆర్మీ.. ప్రపంచంలో ఒక్క భారత్‌కే ఉంది.* నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన వారిని వలంటీర్ ఆర్మీ అంటారు.
🍀ఇంత ఘనతభారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో ... *1949 నుండి ఏటా డిసెంబర్ 7న మనం ‘ఫ్లాగ్ డే’ జరుపుకుంటున్నాం.*త్రివిధ దళాల సైనికుల గౌరవార్థం నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి.
🍀 *ఇలాంటి వీర సైనికుల సంక్షేమం చూడటం మనవంతు భాద్యత వారికి మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడం మన ప్రజల కర్తవ్యం. ఇందుకోసంగాను “సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధిని” ప్రభుత్వము ఏర్పాటు చేసినారు.* ఈ నిధికి గౌరవనీయ గవర్నర్ గారు చైర్మన్ గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ గా, సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ వారు సెక్రటరీ గా ఇంకా అనేకమంది సైనిక అధికార్లు, ప్రభుత్వఅధికార్లు మెంబర్లు గా వ్యవహరిస్తారు. ఈ నిధి నుండి మాజీ సైనికులకు మరియు వితంతువులకు మరియు వారిపై ఆధారపడిన వారికి ఆర్ధిక సహాయం అందిస్తారు.
🍀ఇందుకోసం సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబరు మాసంలో జరుపుకొని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ప్రజల వద్దనుండి సేకరిస్తాము. ఇందుకోసంగాను స్టిక్కర్ ఫ్లాగ్ మరియు కార్ ఫ్లాగ్ లను ప్రజలకు అందచేసి వారినుండి విరాళాలను సేకరిస్తుంది మరియు కొన్ని హుండీ డబ్బాలను వివిధ విద్యాలయాలకు, కార్యాలయాలకు పంపి వాటి ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తాము. కావున ప్రజలందరూ ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా స్వచ్ఛంద౦గా పెద్దమొత్తాలలో విరాళాలు సాయుధ దళాల పతాక నిధికి అందచేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.ఇది మన కర్తవ్యం!జై జవాన్!!