నేడు..అంతర్జాతీయ విమానయాన దినోత్సవం
(ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే)
మరి ఈరోజు Dec 07 - International Civil Aviation day గురించి అలోచించి,మనకు కలగే ప్రయోజనల గురించి తెలుసుకుందాం.
🔻అంతర్జాతీయ ఆర్ధిక ప్రగతిలో వైమానిక విభాగానికి కీలక పాత్ర ఉన్ననది . ప్రపంచ వ్యాప్తముగాగల ప్రజల నడుమ స్నేహము , అవగాహన పెరగడానికి , ఆర్ధిక , సామాజికముగా ఎదిగేందుకు ప్రత్యక్షముగా , పరోక్షముగా ఈ విభాగము దోహదపడుతుంది .
🔻 ప్రపంచవ్యాప్తముగా గల జబాభాకు ఆర్ధిక , సామాజిక , సాంస్కృతిక ప్రయోజనాలను అందజేస్తుసంది .
🔻ఏడాదికేడాది వైమానిక రవాణాకు ప్రాధాన్యము పెరుగుతూవస్తోంది . అవకాశాలు విస్తృతం అవుతున్నాయి .
🔻ప్రపంచీకరణలో వైమానిక రంగానికే తొలి ప్రధాన్యము . లక్షలాది మంది ప్రయాణికులు ఈ రంగాన్నిఉపయోగించుకుంటున్నారు. కార్గోవిమానాలు , ప్యాసింజర్ విమానాలు సముద్రాలు దాటుతూ ఖండాంతర సరిహద్దుల్ని చెరిపే స్తున్నాయి . ఖండాల నడుమ ఆర్ధిక పురోగతికి వైమానిక శాఖ తన వంతు కృషిని అందిస్తున్నది .
🔻ప్రపంచ మార్కెట్ లో వ్యాపారానికి ముఖ్యముగ ద్వీప కల్పాల నడుమగల చిన్న దేశాలకు ఇతోధికంగా సాయపడుతున్నారు . 🔻ప్రపంచములో అతి పెద్ద పరిశ్రమ అయిన ట్ర్రావెల్ మరియు టూరిజం లో ఇది అంతర్భాగము . సామాజిక ప్రయోజనాల కల్పన మరో ముఖ్యమైన , విలువైన పని . అలాగే లక్షలాదిమందికి విమానాలు , విమానాశ్రయాలు , ఏరోస్పేస్ కంపెనీల్లో ప్రత్యక్షము గా , పరోక్షం గా ఉద్యోగాలు కల్పిస్తుంది .
🔻ఇంతటి మహోన్నత పాత్రగల వైమానిక విభాగాన్ని గుర్తిస్తూ ప్రతియేటా డిసెంబర్ 07 న "ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే " ని నిర్వహిస్తున్నారు . ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 1994 లో ఈ రోజును ఆరంభించినది . ఈ సంస్థ 1994 డిసెంబర్ 07 వ తేదీన ఏర్పాటైనది . సంస్థ 50 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు గుర్తుగా " ఎ 29-1 అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏవియేషన్ డే ను ప్రకటిించారు . కెనడియన్ ప్రభుత్వ సహకారముతో ఐసిఎఒ (ICAO) చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించారు.