*కమిటీలు - కసరత్తులు*
*నిగర్వేకర్ కమిటీ*: సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో చేయాల్సిన మార్పులను సూచించడానికి ఈ కమిటీని 2011లో ఏర్పాటుచేశారు. 2013లో ఈ కమిటీ నివేదికను అందజేసింది.
-
*జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ*: నిర్భయ అత్యాచార ఘటనానంతరం అత్యాచార నిరోధక చట్టానికి మరిన్ని సిఫారసులను సూచించే ఉద్దేశంతో కేంద్రం వర్మ నేతృత్వంలో కమిటీని నియమించింది.
*రంగనాథన్ కమిటీ*: మత, భాషా సంబంధ మైనారిటీలపై మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
*దీపక్ పరేఖ్ కమిటీ*: దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా మౌలిక రంగంలోకి భారీగా ఆకర్షించేందుకు విద్యుత్, రైల్వే టికెట్ చార్జీలను పెంచాలని, మరిన్ని సంస్కరణలను చేపట్టాలని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సిఫారసు చేసింది.
*విజయ్ కేల్కర్ కమిటీ*: సహజ వాయువు, చమురును డొమస్టిక్ ఉత్పత్తులను పెంచడానికి కేంద్రప్రభుత్వం విజయ్ కేల్కర్ కమిటీని నియమించింది.
*ఎంబీఎన్ రావు కమిటీ*: ఇండియలో తొలిసారిగా ప్రభుత్వరంగంలో మహిళాబ్యాంకును ఏర్పాటు చేయడానికి ఎంబీఎన్ రావు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
*జీఎస్టీ సాధికారిక కమిటీ*: దీనికి సుశీల్ కుమార్ మోదీ నాయకత్వం వహిస్తారు.
*-సీ రంగరాజన్ కమిటీ*: దారిద్య్రరేఖ నిర్ధారణకు ఇటీవల నియమించిన కమిటీ ఇది.
*-సీవీ ఆనంద్ బోస్ కమిటీ:* పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణకు నియమించిన కమిటీ.
*-షుంగ్లూ కమిటీ*: కామన్వెల్త్ గేమ్స్ ఆర్థిక వసతులపై నియమించిన కమిటీ.
*-జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ*: 2జీ స్కాంపై విచారణకు కేంద్రప్రభుత్వం ద్వారా నియమించిన ఏకసభ్య కమిటీ.
*-పీసీ చాకో కమిటీ*: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని పీసీ చాకో సారథ్యంలో ఏర్పాటు చేశారు.
*-జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిషన్*: ఆర్థికరంగ చట్టాలు, నియమనిబంధనల మార్పులకు ఉద్దేశించి నియమించిన కమిటీ ఇది.
*-రంగరాజన్ కమిటీ*: జాతీయ ఆహార భద్రతపై అధ్యయనానికి నియమించిన కమిటీ.
*-చరణ్‌దాస్ మెహతా కమిటీ:* పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపుదల కోసం ఏర్పాటు చేసిన కమిటీ.
*-రాఘవన్ కమిటీ*: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్‌ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.
*-యశ్‌పాల్ కమిటీ*: ఉన్నత విద్యలో (హైస్కూల్) సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ తన నివేదికను 2009లో ప్రభుత్వానికి సమర్పించింది.
*-లిబర్హాన్ కమిషన్:* బాబ్రీ మసీదు విధ్వంసం తదనంతరం జరిగిన ఘటనలపై విచారణకు 1992లో ఈ కమిషన్‌ను నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 2009, జూన్ 30న సమర్పించింది. 17 ఏండ్లు పట్టిన ఈ కమిషన్ కార్యకలాపాలకు రూ. 8 కోట్లు ఖర్చయింది.
*-శ్రీకృష్ణ కమిటీ*: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులతో సంప్రదింపులు జరపడానికి కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో మరో నలుగురు ప్రొఫెసర్ రణబీర్‌సింగ్ (న్యాయ నిపుణుడు), వినోద్ కుమార్ దుగ్గల్ (హోంశాఖ మాజీ కార్యదర్శి), ప్రొఫెసర్ రవీందర్ కౌర్ (సామాజికవేత్త), అబుసలే షరీఫ్ (ఆర్థికవేత్త)లను సభ్యులుగా నియమించింది.
*-కిరీట్ పారిఖ్ కమిటీ:* పెట్రో ధరల విధానంపై వేసిన కమిటీ.
*-సురేష్ టెండూల్కర్ కమిటీ*: దేశంలో పేదరికాన్ని అంచనావేసేందుకు ఏర్పాటు చేశారు.
*-సుందరం కమిటీ*: ఎగుమతి, పరపతి నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-సోథాని కమిటీ*: ప్రవాస భారతీయుల పెట్టుబడులు, ఫారెక్స్ మార్కెట్లపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-గోస్వామి కమిటీ*: కార్పొరేటివ్ పునర్‌వ్యవస్థీకరణ, పరిశ్రమల రుగ్మతలపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-నరసింహన్ కమిటీ*: ఆర్థిక వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ, పనితీరులపై సమీక్ష.
*-ఖన్నా కమిటీ*: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరుపై మానిటరింగ్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ.
*-నాదకర్ణి కమిటీ*: ప్రభుత్వరంగ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాలపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-జానకీరామన్ కమిటీ*: బ్యాంకులు, ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష కోసం నియమించిన కమిటీ.
*-నాయక్ కమిటీ*: చిన్నతరహా పరిశ్రమల రంగానికి రుణాల గురించి ఏర్పాటు చేసిన కమిటీ.
*-నరసింహన్ కమిటీ-2:* బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేశారు.
*-వర్మ కమిటీ*: బలహీనమైన ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేశారు.
*-ఆర్వీ గుప్తా కమిటీ:* వ్యవసాయ రుణాలపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-జేజే ఇరానీ కమిటీ*: కంపెనీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-ఎస్‌ఎస్ తారాపోర్ కమిటీ:* క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కోసం నియమించిన కమిటీ.
*మెహతా కమిటీ*: సమగ్ర గ్రామీణాభిద్ధి పథకంపై ఏర్పాటు చేశారు.
*-మల్హోత్రా కమిటీ*: బీమారంగ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ.
*-రాకేష్ మోహన్ కమిటీ*: మౌలిక సదుపాయాల కల్పనపై ఏర్పాటు చేశారు.
*-వైహెచ్ మాలెగావ్ కమిటీ*: యూటీఐ పునర్‌వ్యవస్థీకరణపై ఏర్పాటు చేశారు.
*-కేసీ పంత్ కమిటీ:* ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను పటిష్టపర్చేందుకు ఏర్పాటు చేశారు.
*-ప్రకాశమణి త్రిపాఠి కమిటీ*: యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ.
*-కేసీ గీతాకృష్ణన్ కమిటీ*: వ్యయసంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ.
*-దీపక్ పరేఖ్ కమిటీ*: యూఎస్-64 స్కీంపై 1998లో ఏర్పాటు చేసిన కమిటీ.
*-మాలెగావ్ కమిటీ*: సూక్ష్మరుణ సంస్థల అధ్యయనానికి ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ.
*-శ్యామ్ పిట్రోడా కమిటీ*: రైల్వేల నవీనీకరణ ప్రణాళిక కోసం ఏర్పర్చిన కమిటీ.
*-సీ రంగరాజన్ కమిషన్ (నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్)*: ప్రస్తుత గణాంక వ్యవస్థలోని లోపాలను గుర్తించి, సూచనలు చేయడం కోసం.
*-పీడీ షెనాయ్ కమిటీ*: జాతీయ జెండాకు సంబంధించి నిబంధనల కోసం ఏర్పర్చిన కమిటీ.
*-జేఎం గిర్‌గ్లానీ కమిటీ:* ఏపీలో ఉద్యోగ నియామకాల్లో ఆరుసూత్రాల పథకానికి సంబంధించిన జీవో 610పై నియమించిన కమిటీ.
*పీఎన్ భగవతీ కమిటీ*: టేకోవర్లపై సెబీ నియమించిన కమిటీ.
*-నరేశ్‌చంద్ర కమిటీ:* కార్పొరేట్ గవర్నెన్స్‌పై నియమించిన కమిటీ.
*-ఎంకే ముఖర్జీ కమిషన్*: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యం, మరణంపై నియమించిన కమిషన్.
*-రవీంద్రవర్మ కమిషన్:* రెండో లేబర్ కమిషన్.
*-కేల్కర్ కమిటీ*: పన్నుల సంస్కరణలపై సిఫారసుల కోసం నియమించిన కమిటీ.
*-ఎన్‌కే సింగ్ కమిటీ*: ఎఫ్‌డీఐలపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ.
*-చలపతిరావు కమిటీ:* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణపై నియమించిన కమిటీ.
*-వరదరాజన్ కమిటీ*: తాజ్‌మహల్ పరిసరాల్లో కాలుష్య తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.