కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జేఎస్ ఖేహార్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేఎస్ ఖేహార్ నియమితులయ్యారు. జనవరి 4, 2017న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఖేహార్ 44వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన జనవరి 4 నుంచి ఆగస్ట్ 4, 2017 వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుత సీజేఐ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి జేఎస్ ఖేహార్ పేరును ప్రతిపాదించారు.