Type Here to Get Search Results !

Vinays Info

ఐసోటోపులు (Isotopes)

ఐసోటోపులు (Isotopes)

మూలకాల కృత్రిమ పరివర్తన

⭕ఒక స్థిర మూలకాన్ని ప్రయోగశాలలో భారయుతమైన కణాలతో ఢీ కొట్టించి మరొక స్థిర మూలకంగా మార్చడాన్ని మూలకాల కృత్రిమ పరివర్తనం అంటారు. దీనిని రూథర్‌ఫర్డ్ కనుగొన్నారు. 
    
      ఐసోటోపులు

🔮ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్య ఉంటే ఒకే మూలక పరమాణువులను ఐసోటోపులు అంటారు.

*👉🏼ఐసోటోపులను ఆస్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.*

ఉదా: హైడ్రోజన్ ఐసోటోపులు
1H1 - ప్రోటియం
1H2 - డ్యుటీరియం
1H3 - ట్రిటియం

⭕హైడ్రోజన్ రేడియోధార్మిక ఐసోటోపు - ట్రిటియం (1H3) రేడియో ఐసోటోపుల ఉపయోగాలు రేడియోధార్మికత కలిగిన ఐసోటోపులను రేడియో ఐసోటోపులు అంటారు.

    
       *వైద్యరంగం*

⛔రేడియోధార్మిక సోడియం (11Na24)ను ఉపయోగించి మానవ శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాన్ని గుర్తించవచ్చు.

⛔రేడియో ధార్మిక కోబాల్ట్ (27co60)తో క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చు.

⛔రేడియో అయోడిన్ (53I13)ను ఉపయోగించి థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు.

   
      *పారిశ్రామిక రంగం* 

⛔రేడియో ఐసోటోపులతో యంత్ర భాగాల పనితీరు, అరుగుదలను తెలుసుకోవచ్చు.

⛔రేడియో కోబాల్ట్ (27co60) ఐసోటోపుతో పోతపోసిన పదార్థాల్లోని లోపాలను తెలుసుకోవచ్చు.

⛔కొన్ని పదార్థాలపై నుంచి స్థావర విద్యుత్‌ను తొలగించడానికి కూడా రేడియం ఐసోటోపులను ఉపయోగిస్తారు.

   *వ్యవసాయ రంగం*

⛔విత్తనాల్లో అవసరమైన పరివర్తనలను రేడియో ఐసోటోపుల వికిరణాలతో నియంత్రించవచ్చు / ఆపుచేయవచ్చు.

⛔రేడియో పాస్ఫరస్‌తో ఒక నేలలో ఉపయోగించాల్సిన ఉత్తమ ఎరువులను, దానిలో ఉన్న పాస్పరస్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు.

⛔తృణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పుల వంటి పదార్థాలను r - వికిరణాలకు గురిచేసి, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయవచ్చు.

     *వాతావరణ రంగం*

⭕ఋతుపవన మార్గాలు, వాటి మార్గాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, రేడియోధార్మిక వాయువులను పంపించి శోధిస్తారు.

     *కార్బన్ డేటింగ*్ 

⛔కృత్రిమ రేడియోధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సును తెలుసుకునే పద్ధతిని కార్బన్ డేటింగ్ అంటారు. ఈ పద్ధతికి లిబ్బి అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.

⛔జీవరాశుల్లో 6C14 / 6C12 నిష్పత్తి ఒక స్థిరాంకంగా ఉంటుంది. జీవరాశుల మరణానంతరం ఈ నిష్పత్తి తగ్గుతుంది. దీనిఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section