కవి పరిచయాలు-నేపథ్యాలు
1. *అభినందన*
నేపథ్యం: దేశం బాగోగులు కోరుతూ శ్రమించే కర్మవీరులు అయిన (రైతులు, సైనికులు) శ్రమ గొప్పదనాన్ని తెలియజేయడమే.
* ఇది గేయ ప్రక్రియకు చెందినది.
* చదవడానికి, పాడటానికి వీలైనది/లయబద్దంగా చదవదగినది. 'స్వర్ణభారతి' గేయ సంకలనంలోనిది
కవి: శేషం లక్ష్మీనారాయణాచార్య 15.04.1947 - 17.05.1998
* భాషోపాధ్యాయుడు
* ప్రదేశం- కరీంనగర్ జిల్లా నంగునూరు
* తల్లిదండ్రులు- కనకమ్మ, నరసింహస్వామి
* పద్య, గేయ, వచన, రచనలు (టి.వి. రేడియోల్లో ప్రసార మైనవి)
ప్రత్యేకత: దక్షిణ భారత హిందీ ప్రచార సభ పత్రిక 'స్రవంతిలో విమర్శ వ్యాసాలు ప్రచురించారు'
* జైజవాన్-జైకిసాన్- లాల్ బహాదుర్ శాస్త్రి
* ఈ పాఠంలో వర్ణమాల పరిచయం
2. *స్నేహబంధం*
నేపథ్యం: మంచి వారితో స్నేహం మంచిది. విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశం 'కథ' ప్రక్రియకు చెందినది.
కథ లక్షణాలు: 1. వక్త్ర, అపరవక్త్ర ఛందస్సు ఉండదు
2. ఉచ్ఛ్వాస విభజన ఉండదు
* విష్ణుశర్మ 'పంచతంత్రం' ఆధారంగా చిన్నయసూరి తెలుగులో అనువదించిన 'మిత్రలాభం'కు వచన రచన.
పాత్రలు: కాకి- లఘుపతనం (వాయసం-కాకి)
ఎలుక-హిరణ్యం
తాబేలు-మంధరకం
జింక-చిత్రాంగద- (మానవ భాష మాట్లాడింది) (ఎంత జాగ్రత్తగా ఉన్నా అపాయం తప్పదు మిత్రమా)
3. *వర్షం*
- డా|| పల్లా దుర్గయ్య (1914-1983)
నేపథ్యం: వర్షాకాలం గొప్పదనాన్ని తెలియజేయడం
ప్రక్రియ: 'పద్య ప్రక్రియ'- ఛందోబద్దమైన రచనకు పద్యం అని పేరు
* ప్రస్తుత పద్యం 'పాలవెల్లి' అనే 'ఖండకావ్యం' నుండి తీసుకున్నది.
* 'పారిజాతాపహరణం'పై పరిశోధన చేశారు.
* జన్మస్థలం- వరంగల్ జిల్లా మదికొండ
* తల్లిదండ్రులు- నర్సమ్మ, పాపయ్య శాస్త్రి
* రచనలు- పాలవెల్లి, గంగిరెద్దు
* తెలుగు, సంస్కృతం, ఆంగ్లంలో పాండిత్యం ఉంది.
ప్రత్యేకత- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి ఎం.ఏ. పట్టా అందుకున్నాడు.
4. *లేఖ*
నేపథ్యం: లేఖారచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయడమే.
* లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు మొదలగు రకాలు.
* పాఠంలో రామప్పగుడి, గద్వాల, వరంగల్‌కోటలు, చార్‌మినార్, సాలర్‌జంగ్ మ్యూజియంల గూర్చి విషయాలున్నవి.
5. *శతక సుధ*
నేపథ్యం: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం
* ఈ పాఠం 'శత్రుప్రక్రియ'కు చెందినది
శతక లక్షణాలు
1. పాద నియమం 2. చందో నియమం
3. సంఖ్యా నియమం 4. మకుట నియమం
5. ముక్తకాలు
- ఈ పాఠంలో ...
1. బద్దెన- సుమతి శతకం
* కంద పద్యాల రచన
* 13వ శతాబ్దానికి చెందినవాడు
* 'నీతిశాస్త్ర ముక్తావళి' అనే గ్రంథ రచన చేశాడు.
* 6, 7, 8 తరగతుల్లో ఇతని పద్యాలు ఉన్నాయి.
2. దూర్జటి- 1. శ్రీకాళహస్తీశ్వర శతకం
* 16వ శతాబ్దం- శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి, అష్టదిగ్గజాల్లో ఒకడు (దూర్జటి- పొడవైన వెంట్రుకలు కలవాడు (శివుడు))
* 'శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము' అనే ప్రబంధాన్ని రాసాడు.
'అతులిత మాధురిమహిమ నీ పల్కులకేలగల్గెనో' అని రాయలు ఇతన్ని ప్రస్తుతించినారు.
* ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని తెనాలి 'హా! తెలిసెన్ భువనైక మోహనోద్దత సుకుమార వారవనితా ఘనతా పహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ' అని పలికాడు.
* ఈయన రెండు పుస్తకాలని 'దైవాంకితం' చేశారు.
3. పక్కి వెంకట నరసింహకవి- కుమార శతకం
* 17వ శతాబ్దానికి చెందినకవి
* చిన్న చిన్న పదాలతో నేటి సమాజానికి అవసరమైన నీతులు సులభరీతిలో చెప్పడం.
4. ఏనుగు లక్ష్మణ కవి - సుభాషిత రత్నావళి
* సంస్కృతంలో భర్తృహరి రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులోకి అనువదించాడు.
* పెద్దాపురం సంస్థానం పెద్దాడ గ్రామవాసి.
* 18వ శతాబ్దానికి చెందిన కవి
* రచనలు-1. రామేశ్వర మహత్మ్యము
2. గంగా మహత్మ్యము
3. విశ్వామిత్ర చరిత్ర మొదలైనవి
5. ప్రభుతనయ శతకం- కౌకుంట్ల నారాయణరావు
* 18వ శతాబ్దానికి చెందిన కవి. 1883-1953 మధ్య కాలం వాడు.
* రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల నివాసి
* తనయా! అనే మకుటంతో శతకం రచించాడు.
6. గాంధీ తాత శతకం- శిరశినగల్ కృష్ణమాచార్యులు
* నిజామాబాద్ జిల్లా- మోర్తాడ్‌లో జన్మించారు
* కోరుట్లలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
* రచనలు- 1. కళాశాల అభ్యుదయం
2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం
* రత్నమాల- (ఖండకావ్యం)
* బిరుదులు- 1. అభినవ కాళిదాసు
2. నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని
* 13.08.1905-15.4.1992 మధ్యకాలం వాడు
7. బాల నృసింహ శతకం-సూరోజు బాలనరసింహాచారి
* స్వస్థలం- నల్లగొండ జిల్లా-చిన్న కాపర్తి (చిట్యాల మండలం)
* బిరుదు- సహజకవి
* కాలం- 1946-2014
* రచనలు- 1. కవితాకేతనం
2. భగవద్గీత కందామృతం
3. బాలనరసింహశతకం
4. మహేశ్వర శతకం
5. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
8. డా|| టి.వి. నారాయణ- భవ్యచరిత శతకం
* స్వస్థలం- హైదరాబాద్
* జననం- 26.07.1925
* ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు
* జిల్లా విద్యాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలు
* రచనలు: 1. జీవన వేదం 2. ఆర్షపుత్ర శతకం
3. భవ్యచరిత శతకం 4. ఆత్మదర్శనం (కవితా సంపుటి)
5.అమరవాక్సుధా స్రవంతి- (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి)
6. పోతన బాల్యం
కవి: వానమామలై వరదాచార్యులు
నేపథ్యం: తిప్పన, పోతన ఇద్దరు అన్నదమ్ములు వారి మధ్య ప్రేమ, బాల్యమెట్ల గడిచింది. పిల్లల అభిరుచులు, ఆసక్తులను తెలపడమే పాఠ్యాంశ ఉద్దేశం
ప్రక్రియ: పద్యకావ్యం- కావ్యం అనగా వర్ణనలతో కూడినది. 'పోతన చరిత్రము' ప్రథమ శ్వాసం లోనిది.
రచయిత: వానమామలై వరదాచార్యులు (16.08.1912- 30.10.1984)
స్వస్థలం: వరంగల్ జిల్లా మడికొండ
నివాసం: ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్
బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి
రచనలు: 1. పోతన చరిత్రము, 2. మణిమాల, 3. సూక్తి వైజయంతి, 4. జయధ్వజం, 5. వ్యాసవాణి, 6. కూలిపోయే కొమ్మ, 7. రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి), 8. దాగుడు మూతలు, 9. మాతృప్రేమ
పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
* సంపూర్ణానంద విశ్వవిద్యాలయం వారణాసి వారి 'విద్యావాచస్పతి' 1968లో తీసుకున్నారు.
* ఉర్దూ, మరాఠి, సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం.
7. *ఉడుత సాయం* - గోనబుద్ధారెడ్డి
నేపథ్యం: రావణునిపై యుద్ధానికి వెళ్లేటపుడు సముద్రంపై వారధి నిర్మించండని వానరసైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణక్రమంలో దిట్ట. ఉడుత ఆ సమయంలో ఏ విధంగా సహాయం చేసిందో చెప్పడం. 'ద్విపద' ఛందస్సును పిల్లలకు పరిచయం చేయడం.
* ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం.
* 'రంగనాథ రామాయణం'లోని యుద్ధకాండలోనిది.
కవి: గోనబుద్ధారెడ్డి (13వ శతాబ్దం)
* తెలుగులో తొలి రామాయణం 'రంగనాథరామాయణం'. దీన్ని యుద్ధకాండవరకు రచించాడు.
* మిగిలిన భాగాన్ని అతని కుమారులు కాచభూపతి, విఠల నాథుడు పూర్తిచేశారు. తెలంగాణలో తొలి జంట కవులు.
* కాకతీయుల సామంతుడు. వర్ధమానపురాన్ని పాలిం చాడు. (ఇది ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా- నంది వడ్డెమాన్)
8. *చెరువు*
నేపథ్యం: చెరువులను రక్షించుకొంటూనే తెలుగుభాషలోని జాతీయాలు సామెతల గురించి తెలియజేయడం.
* ఇది 'స్వగతం' అంటే ఎవరికివారు స్వతహాగా వారికి సంబంధించిన విషయం: ఉత్తమ పురుషులలో ఉంటుంది.
జాతీయం: ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని 'జాతీయం' అని అంటారు.
* దీన్ని పలుకుబడి, నానుడి అనే పేర్లతో పిలుస్తాం.
ఉదా: చెవిని ఇల్లుగట్టినట్లు, గుండె చెరువైంది, కళ్లలోవత్తులే సుకును, గొడ్డలిపెట్టు, కాలికిబలపంకట్టి, కన్నెర్రజేయు, మొసలికన్నీరు, కొట్టినపిండి
సామెత: సామ్యత నుండి వచ్చినది- ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెతవుతుంది.
ఉదా: కుండబద్దలుకొట్టినట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఉర్కబోయి బోర్లపడ్డట్టు
9. *చీమల బారు*
- పొట్లపల్లి రామారావు
నేపథ్యం: మన చుట్టు ఉన్న ప్రాణులను చూసి, క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం నేర్చుకోవాలి.
ప్రక్రియ: 'గేయకవిత' గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవిత గేయకవిత.
ప్రస్తుత పాఠ్యభాగం, ఆత్మవేదన, కవితాసంపుటిలోనిది
రచయిత: పొట్లపల్లి రామారావు (1917-2001)
నివాసం: తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, వరంగల్ జిల్లా
రచనలు:ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలగు కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం (ఖండికలు)
ప్రసిద్ధ రచన: 'జైలు' కథల సంపుటి.
10. *బాలనాగమ్మ*
* జానపద సాహసకథ- తెలంగాణలో బహుళ ప్రజాదరణ పొందిన కథ బాలనాగమ్మ కథ. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులను కాపాడే వృత్తాంతం ఇది.
పాత్రలు:
* బాలనాగమ్మ తల్లి-లక్ష్మీదేవమ్మ
* బాలనాగమ్మ తండ్రి- నవాంభోజరాజు
* బాలనాగమ్మ భర్త- కార్యవద్ధిరాజు
* బాలనాగమ్మ కొడుకు- బాలవద్ధిరాజు
* మాణిక్యాలదేవి- లక్ష్మీదేవమ్మ (సవతి) మారు మనువు చేసుకుంది. మరుగుమందుతో లోబర్చుకుంటుంది.
* నాగళ్లపూడి రాజ్యంలో -మాయల ఫకీర్ ఉంటాడు.
11. *పల్లెటూరి పిల్లగాడా*!
- సుద్దాల హనుమంతు (1910-1982)
* బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే పాఠ్యభాగ నేపథ్యం.
* 'పాట' ప్రక్రియకు చెందినది. చరణం, పల్లవితో లయా త్మకంగా పాడుకోవటానికి వీలైంది. సుద్దాల హను మంతు 'శతజయంతి' సందర్భంగా ప్రచురించిన 'పల్లెటూరి పిల్లగాడా' పాటల సంకలనంలోనిది.
* స్వస్థలం: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం, పాలడుగు గ్రామం.
* తల్లిదండ్రులు- లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు.
* ప్రత్యేకతలు: హేతువాది, చైతన్యగీతాలు, బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టలదొర, యక్షగానం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాడు.