సర్ జగదీష్ చంద్రబోస్ "వర్ధంతి సందర్భంగా..
🔸వైర్లెస్ టెలిగ్రాఫ్ ను కనుగొన్నది ఎవరు అంటే మన సమాధానం “మార్కోని”అని వస్తుంది. *అయితే మార్కొని కంటె ముందు వైర్లెస్ టెలిగ్రాఫ్ గురించి విస్తృత పరిశొధనలు చేసి ప్రపంచాని కి ప్రయోగ పూర్వకంగా నిరూపించి నది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్. అయితే ఆయన వైర్లెస్ ప్రయోగాలను పేటెంట్ రిజిస్టర్ చేయకపోవటం వల్ల ఆయనుకుఆకీర్తిదక్కలేదు .*
వైజ్ఞానిక పరిసోధనలను సొమ్ము చెసుకోవటం ఇస్టం లేక అందుకు ఆయన నిరాకరించారు.
🔸 *ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకో దగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త.*
🔸 *ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రం లో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహు నిగా పేర్కొంటారు.*
🔸రేడియో సిగ్నల్స్ ను గుర్తించడా నికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే
🔸 *ఇతడు భారతదేశం నుండి 1904 సం"లో అమెరికా దేశపు పేటెంట్ హక్కు లు పొందిన మొట్ట మొదటి వ్యక్తి.*
*మొక్కలలొప్రాణముందని,వాటికికూడాసంతొషం,దుఖం,బాధతెలుసునని ప్రపంచాని కి తెలియ జెశాడు.*
🔸జగదిష్ చంద్రబోస్ 1958 నవంబర్ 30వ తేదిన మైమెన్ సింగ్ ( ప్రస్తుత బంగ్లదేష్ ) లొ జన్మించారు.ఆయన చిన్నత నం ఫరీద్ పూర్ లొ గడిచింది. అక్కద రైతు పిల్లలతొ, బెస్తవారి పిల్లలతొ కలిసి తిరగటం వల్ల ప్రకృతి మీద ఆయన అపార అభిమానం పెంచుకొన్నారు. తొమ్మిదవ యేటకలకత్తాచేరుకున్నా రు. అక్కడ మొదటి హేర్ స్కూల్ లొను ఆ తర్వత సెయింట్ గ్జెవియ ర్ స్కూల్లొ చదివారు. ఆ స్కుల్లొ ఫాదర్ లపొంట్ భౌతిక శాస్త్రాన్ని ప్రయోగ పూర్వకంగా బోధించటం వల్ల దాని మీద మక్కువ పెంచుకు న్నారు. అయితే వృక్ష శాస్తం మీదఅంతే అభిమానం పెంచుకు న్నారు. వివిధ రకాల మొక్కలను పెరికి వాటి వేరు వేరువ్యవస్థను పరిశీలించేవారు. వివిధ రకాల పుష్పించే మొక్కలను పెంచుతూ వాటి పెరుగుదలను నిశితంగా పరిశీలించేవారు.
🔸బోస్ తండ్రి డిప్యూటి మాజిస్ట్రేట్ గా పనిచేశారు. బోస్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగాడు. తల్లి ద్వారరామాయణం, మహాభారతాలను తెలుసుకొన్నా డు. కర్ణుడి జేవితం ఆయనను ఎంతొ ఆకర్షించింది.
🔸1980 లో జగదీష్ చంద్ర బొస్
మెడిసన్ చదవాటానికి "యూనివె ర్సిటి ఆఫ్ లండన్” లో చేరెందుకు ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడతరచూ మలేరియాకు గురి కావడంతొ స్కాలర్షిప్ మీద కేంబ్రిడ్జి లొ నేచురల్ సైన్సులొ క్రీస్ట్స్ కాలేజి లో చదవవలసి వచ్చింది. అక్కడ సర్ మైఖేల్ ఫాస్టర్,ఫ్రాన్సిస్ డార్విన్ వంటి టీచర్ల ప్రభావం ఆయన మీద ఎంతగానొ పడంది. 1884 లో కేంబ్రిడ్జి నుంచి బి.ఎ., తర్వాత సంవత్సరంలొ "లండన్ యూనివ ర్సిటి " నుంచి డిగ్రీ తిసుకున్నాడు.
🔸1885 లొ భారత్ కు తిరిగి వచ్చిన ప్పుడు కలకత్తాలోని ప్రెసిడెన్సి కాలీజీలొ ఉద్యొగం లభించింది. అయితే అక్కడి యాజమాన్యం బ్రిటీష్ టీచర్లకు ఇచ్చే జీతంలొ సగమే ఇస్తామని షరతు పెట్టారు. అందుకు నిరసనగా మూడు సంవత్సరాలు పాటు జీతం తీసుకొ కుండానే పనిచేశాడు. ఆ సమయం లొ విద్యార్ధులకు పాటాలను ప్రయోగ పూర్వకంగాభొదించెవారు. అందుకె విద్యార్ధులకు ఆయన అభిమాన ఉపాధ్యాయుడిగా పేరుపొందారు.
*పుస్తకాలు సహయంలేకుండా ప్రతీ విషయాన్ని పరిశీలించడం, ప్రశ్నించతం, ప్రయోగాలు చేసి పరిశోధించటం వంటివి అలవర్చుకోవటం విద్యార్ధులకు నేర్పారు.*ముడేళ్ళు కాలేజీలొ పనిచేసిన పిదప అప్పటి ప్రిన్సిపాల్ ఆయన ప్రతిభను మెచ్చిఆయనకు పూర్తి జీతం ఇవ్వాలని సిఫారసు చేసాడు.
🔸ఆ రొజులలొ సరైన ప్రయొగశా లలు ఉండేవికావు. అందుకె ఆయన తన బాత్ రూం ప్రక్కన ఉండే చిన్న గదిని తన ప్రయోగశాల గా మార్చుకొన్నాడు. తరగతులు అయిపోయిన తర్వాత ఆయిన తన ప్రయోగశాలలోనే ఎక్కువ కాలం గడిపేవారు. ఆయన తన ప్రయోగాశాలలో రిఫ్రాక్షన్ ,డిఫ్రాక్షన్ పోలరైజేషన్ వంటి వాటిమిద ప్రయోగలు చేసేవారు.
🔸 *1894లో ఎలక్ట్రొ మాగ్నటిక్ వేవ్స్ ఆడారంగా వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ ప్రదిర్శించి చూపారు. ఈ తరంగాల ద్వారా కొంత దూరం లో వున్న బెల్ మ్రోగించటం, గన్ పౌడర్ ను బార్ ద్రారా మందించి చూపించారు. “కోహిరర్” అనే పరికరానికి ఇంగ్లాండులో ఎంతో ప్రాచుర్యం లభించింది. జె.జె. థాంసన్, పాయిన్ కేర్ వంటి శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని గూర్చి పలు పుస్తకాల్లో ప్రస్తావించారు.*
🔸 *“ఫాదర్ ఆఫ్ వైర్ లెస్ ట్రాన్స్ మిషన్" మేద పరిశోధన లు జరిపిన ఒక సంవత్సరం తర్వాత మార్కోని ఆ పరిశోధన లపై పేటెంట్ రిజిష్టరు చేశారు.* జె.సి బోస్ తన పరిశోధన లపై పేటెంట్ రిజిష్టరు చేయక పోవడం వలననే ఆయనకు సరైన గుర్తింపు లబించలేదు.
🔸 *1899-1900 సంవత్సరం మధ్య బోసు తన పరిశోధనలను “ప్లాంట్ ఫిజియాలజి” పై దృష్టి మరల్చారు.మొక్కల కదలికలు, జీవన ధర్మాలను “క్రెస్కో గ్రాఫ్ ” అనే పరికరం *ద్వారా ఆయన గుర్తించగల్గారు.*
*రెసోనెన్స్ రికార్డుర్ ,ఆసిలేటింగ్ రికార్డరు ద్వారా ,సెకండు లో,కణ జాలాలలో జరిగే అనే ప్రభావాల నుఆయనగుర్తించగల్గారు*
🔸 *ఆయన స్వయంగా రూపొందిం చిన క్రెస్కో గ్రాఫ్ పరకరం ద్వార మొక్కల వివిధ జీవన ధర్మాలను పరిశోధిం చారు. క్రెస్కొ గ్రాఫ్ సహాయంతో మొక్కల జీవకణా లను పదివేల రెట్లు పెద్దవి చేసి చూడవచ్చు.* ఈ పరికరాన్ని గూర్చి ప్రపంచ నలుమూలల నుండి ప్రశంసలు లభించాయి. మొక్కల మీద ఎరువులు,కాంతి కిరణాలు, అల్ట్రావై లెట్ కిరణాలు,విషపదార్ధా ల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రపంచానికి ఆయన వెల్లడించారు. *1901న రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో మొక్కలు బ్రోమైడ్ విష పదార్ధం వల్ల ఏ విధంగా చనిపొతాయో ఆయన ప్రయోగ పూర్వకంగా నిరూపించారు.*
🔸ఒక మొక్కను తన పరికరానికి అమర్చి, దాని వేళ్ళను బ్రోమైడ్ ద్రావణంలో ఉంచారు.పరికరం ద్వారా కాంతి తెర మీద ప్రసార మయ్యేట్లు చేశారు. మొక్క యొక్క స్పందనల ను తెరమీద చూపగల్గా రు. గడియారంలోని లోలకంలాగా ఆ ప్రతిబింబం కదలటం శాస్త్రవేత్త లు గమనించారు. బ్రొమైడ్ ప్రబావం వల్ల ఆప్రతిబింబం విషం తిన్న ఎలుక లాగా గిల గిలా కొట్టుకొని కొంత సేపటికి ఆప్రతిబింబం ఆగి పోవటం గమనించారు. ఈయాసిడ్ ప్రభావం వల్ల మొక్క మరణించింది ఈ ప్రయోగం పూర్తివ గానే “రాయల్ సొసైటీ” భవనం కరతాళ ధ్వనులతోమ్రోగిపొయింది. అయతే కొంత మందికి ఈప్రయోగం నచ్చలే దు. బోస్ చేసిన ప్రయోగాల ను రాయల్ సొసైటి ప్రచురించటా నికి వీలు పడదని అడ్డు తగిలారు.
🔸బోస్ అంతటితో ఆగక 2 సం" నిరంతరం పరిశోధనలు చేసి జీన నిర్జీవాలతో ప్రతి స్పందనలు గూర్చి ఒక మేనో గ్రాఫ్ ప్రచురించారు. దానిని రాయల్ సొసైటీ ఆమోదించి ప్రచురించి ప్రపంచ వ్యాప్తంగా పంపి ణీ చేసింది. 1901 మే 10 వ తేదిన రాయల్ సొసైటి లోని సభా భవనం లో బోస్ తనప్రయోగాన్ని నిరూపిం చుకొన్నారు. 1920 లో ఆయన రాయాల్ సొసైటీ లో సభ్యులుగా ఎంపిక ఆయ్యారు.
🔸 *మొక్కలకు,జంతువులు, మానవుల మాదిరిగా ప్రాణం ఉంటుందని, వేడికి,చలికి, కాంతికి,శబ్ధనికి, అవి కూదా స్పందిస్తయని ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా మొట్టు వెల్లడి చేసిన వారు -జగదీష్ చంద్రబోస్*తన చిరకాలం వాంఛ అయిన బోస్ ఇన్ స్టిట్యూట్ ను 30 నవంబర్, 1917 లోప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్బంగ ఆయన మాట్లాడుతూ *“ఇది ఒక ప్రయోగ శాల కాదు,ఒక దేవాలయం” అని అభివర్ణంచారు.*
🔸 *బోస్ ప్రయోగాలన్నీ కలకత్తా లోనే జరిగాయి. అయితే మహత్మాగాంధీ, రవీంద్రనాధ్ ఠాగూర్,స్వామి వివేకానంద వంటి కొందరు మాత్రమే ఆయన ప్రతిభను గుర్తించ గలిగారు.* మిగిలిన భారత దేశం ఆయన ప్రతిభను గుర్తించలేదు. రవీంద్రనాధ్ ఠగూర్ బోస్ కు మంచి మిత్రులు. పాశ్చాత్య దేశాలన్ని బోస్ ప్రతిభను గుర్తించిన తర్వాతగాని, ఆయన ప్రతిభను మన దేశం గుర్తించలేదు.
🔸 *1902 లొ “ది లివింగ్”,1926లొ “ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ ” ఆయన వ్రాసిన ఈ రెండూ పుస్థకాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.*
ఆయితే దురదృష్టవశాత్తు విజ్ఞాన శాస్త్రంలో ఆయనకు సరైనగుర్తింపు లభించలేదు. బోస్ నవంబర్ 23, 1937 లో తన ఎనభైయవ్వ యేట కు ఒక వారం రోజుల ముందు చనిపోయారు.
Sir Jagadeesh Chandra Bose(JC Bose) | సర్ జగదీష్ చంద్రబోస్
November 30, 2016
Tags