Type Here to Get Search Results !

Vinays Info

హిమాలయాల ప్రాంతీయ విభజన

భారతదేశంలో ప్రవహించే నదుల ఆధారంగా, ప్రాంతాల వారీగా హిమాలయాలను తూర్పు, పడమరలుగా 5 రకాలుగా విభజించొచ్చు. అవి..
1. కశ్మీర్ హిమాలయాలు
2. పంజాబ్ హిమాలయాలు
3. కుమయూన్ హిమాలయాలు
4. నేపాల్ (లేదా) మధ్య హిమాలయాలు
5. అస్సాం హిమాలయాలు
కశ్మీర్ హిమాలయాలు
ఇవి సింధూ నదికి ఉత్తరాన సుమారుగా 3,50,000 చ.కి.మీ.విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
ఇవి ప్రధానంగా కశ్మీర్‌లో ఉన్నాయి.
ఈ హిమాలయాల్లో పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ ఉంది.
ఇవి హిమానీనదాలకు ప్రసిద్ధి.
వీటిలో అత్యంత ఎత్తయిన ప్రదేశం సియాచిన్ ఉంది.
పంజాబ్ హిమాలయాలు
ఇవి సింధూ-సట్లెజ్ నదుల మధ్య భాగంలో సుమారు 570 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి.
ఇందులోనే ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కశ్మీర్ లోయ ఉంది. ఇది పండ్ల తోటలకు ప్రసిద్ధి.
కశ్మీర్ లోయ భూతల స్వర్గంగా ప్రసిద్ధి చెందింది.
దేశంలో కుంకుమపువ్వుకు కశ్మీర్ ప్రసిద్ధి చెందింది.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన పాస్కీనా ఉన్నికి కూడా కశ్మీర్ ప్రసిద్ధి చెందింది.
దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని సరోవరీయ రాష్ర్టం అని కూడా పిలుస్తారు.
హిమాలయాల్లో మొట్టమొదట నిర్మించిన జల విద్యుత్ కేంద్రం - మండి జలవిద్యుత్ కేంద్రం.
ఇక్కడ అనేక వేసవి విడుదులున్నాయి. ముఖ్యంగా కులు, కాంగ్రాలు ప్రసిద్ధి చెందాయి.
కుమయూన్ హిమాలయాలు
ఇవి సట్లెజ్ నదికి, కాళీ నదికి మధ్యభాగంలో విస్తరించి ఉన్నాయి.
ఇవి పూర్తిగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
ఇవి మతపరమైన క్షేత్రాలు, సరస్సులకు ప్రసిద్ధి చెందాయి.
మతపరమైన పుణ్యక్షేత్రాలు: బద్రీనాథ్, కేదార్‌నాథ్.
సరస్సులు - ధాల్, నైనిటాల్ సరస్సులు.
హిమానీ నదాలు కూడా ఉన్నాయి.
ఉదా॥యమునోత్రి, గంగోత్రి.
నందాదేవి అనే శిఖరం కూడా ఈ శ్రేణుల్లోనే ఉంది. ఇక్కడ ఉన్న కనుమలు.. 1) మిధులా 2) దల్గా
నేపాల్ (లేదా) మధ్య హిమాలయాలు
ఈ పర్వత భాగం కాళీ-తీస్తా నదుల మధ్య సుమారు 800 కి.మీ. పొడవున విస్తరించి ఉంది.
తీస్తా నది బ్రహ్మపుత్ర నదికి ఉప నది.
వీటిని కేంద్ర హిమాలయాలు అంటారు.

వీటిని వివిధ ప్రదేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. నేపాల్ హిమాలయాలు, సిక్కిం హిమాలయాలు, డార్జిలింగ్ హిమాలయాలు, భూటాన్ హిమాలయాలు అని పిలుస్తారు.
ఇవి భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ, నేపాల్‌లోనూ విస్తరించాయి. సుమారు 1,16,000 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి.
ఈ హిమాలయాలు ఎత్తై శిఖరాలకు ప్రసిద్ధి. ఇక్కడే ముఖ్యమైన మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగ, అన్నపూర్ణ, మకాలు, ధవళగిరి ఉన్నాయి.
అస్సాం హిమాలయాలు
ఈ హిమాలయాలు తీస్తా నదికి, బ్రహ్మపుత్ర (దిహాంగ్) నదికి మధ్య సుమారు 720 కి.మీ. పొడవున, 67,500 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి.
ఈ హిమాలయాలు క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందాయి.
ఈ హిమాలయాలు ఎక్కువగా తేయాకు పంటకు అనుకూలం. ఇక్కడే అసోంలోని తేయాకు పంటకు ప్రసిద్ధి చెందిన సూర్య లోయ ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజులీ ఈ హిమాలయాల్లోనే ఉంది.
గారో, కాశీ, జయంతియా, మిర్ కొండలు ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి.
కనుమలు
రెండు కొండల మధ్య లేదా పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన రహదారిని కనుమ అంటారు.
బనీహాల్ కనుమ: ఇది జమ్మూ, శ్రీనగర్‌ను
కలుపుతుంది.
దీన్ని ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని అంటారు.
భారతదేశంలో అతి పొడవైన ‘జవహర్ టన్నెల్’ ఈ కనుమ వద్ద ఉంది.
జోజిలా కనుమ: ఇది లేహ్, శ్రీనగర్ ప్రాంతాలను కలుపుతుంది.
ఇది జమ్మూకశ్మీర్ రాష్ర్టంలో ఉంది.
ఖార్డుంగ్లా కనుమ: ఇది భారతదేశంలో ఎత్తై కనుమ.
ఇది జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉంది.
కారకోరం కనుమ: ఇది భారతదేశం, చైనాల మధ్య ఉంది.
బుర్జిలా కనుమ: ఇది జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ లోయ నుంచి మధ్య ఆసియా వరకు ఉంది.
పిర్‌పంజాల్ కనుమ: ఇది కశ్మీర్‌లో ఉంది.
ఇది జమ్మూ, శ్రీనగర్‌ను కలుపుతుంది.
జమ్మూ-శ్రీనగర్ రహదారి ఈ కనుమ ద్వారా పోతుంది.
రోహతంగ్ కనుమ: ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
కులూ- క్యెలాంగ్‌లను కలుపుతుంది.
ఈ కనుమ గుండా రోహతంగ్ సొరంగాన్ని తవ్వారు.
బారాలాప్చాలా కనుమ: ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
ఈ కనుమ వద్ద చీనాబ్ నది జన్మించింది.
ఇది లేహ్ నుంచి క్యెలాంగ్ వరకు ఉంది.
షిప్కిలా కనుమ: దీన్ని హిందూస్తాన్ టిబెట్ రోజ్ అంటారు.
ఈ కనుమ గుండానే సట్లెజ్ నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది.
ఈ కనుమ సిమ్లా నుంచి టిబెట్‌లోని గార్టోక్ వరకు ఉంది.
నిథిలా కనుమ: ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.
ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు వ్యాపించింది.
లిపులేఖి కనుమ: ఈ కనుమ ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు ఉంది.
ఈ కనుమను ఇండియా, నేపాల్, చైనాల ‘ఖీటజీ ఒఠఛ్టిజీౌ’ అంటారు.
థగులా కనుమ: ఇది ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు ఉంది.
జీలప్‌లా కనుమ: ఇది పశ్చిమ బెంగాల్‌లోని ‘కలింపాంగ్’ను టిబెట్‌లోని ‘లాసా’ను కలుపుతుంది.
నాథులా కనుమ: ఇది టిబెట్‌ను, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌తో చుంబీ లోయ ద్వారా కలుపుతుంది.
ఇటీవల కాలంలో భారతదేశం-చైనా దేశాల మధ్య వర్తకం ఈ కనుమ గుండా ప్రారంభమైంది.
బొమ్మిడిలా కనుమ: ఇది అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ను, టిబెట్ సమీపంలోని తేజ్‌పాల్‌తో కలుపుతుంది.
యాంగ్‌యాస్ కనుమ: ఈ కనుమ భారతదేశం, చైనాను కలుపుతుంది.
దీని గుండా బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది.
కైబర్ కనుమ: ఇది పాకిస్తాన్‌లోని పెషావర్ నుంచి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ వరకు ఉంది.
బోలాన్ కనుమ: ఇది అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నుంచి క్వెట్టా వరకు ఉంది.
ట్రాన్‌‌స హిమాలయాలు
హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలకు ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులను ట్రాన్‌‌సహిమాలయాలు అంటారు. ఇవి టిబెట్ భూభాగంలోని పామీర్ పీఠభూమి నుంచి జమ్మూకశ్మీర్ వరకు విస్తరించి ఉన్నాయి.
ఈ మండలంలో ఉన్న శ్రేణులు: కారకోరం శ్రేణి, లడక్ శ్రేణి, జస్కార్ శ్రేణి, హిందూకుష్ పర్వతాలు, సులేమాన్ పర్వతాలు, కున్‌లున్ పర్వతాలు, కైలాస కొండలు, మహాభారత శ్రేణి మొదలైనవి.
ప్రముఖ నదులకు జన్మస్థానమైన మానససరోవరం, ప్రపంచంలో అతి ఎత్తయిన పామీరు పీఠభూమి (దీన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు) ఇక్కడే ఉన్నాయి.

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ ఇక్కడే ఉంది.
కారకోరం పర్వత శ్రేణి: ఈ పర్వత శ్రేణిని ‘ఆసియా ఖండం వెన్నెముక’ (బ్యాక్‌బోన్ ఆఫ్ ఆసియా) అని పిలుస్తారు.
ఇది సింధూనదికి ఉత్తరాన వాయవ్య కశ్మీర్‌లో ఉంది.
ప్రపంచంలోనే 2వ ఎత్తయిన శిఖరం ఓ2 లేదా గాడ్విన్ ఆస్టిన్ ఈ పర్వత శ్రేణిలోనిదే.
ఓ2 శిఖరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది. దీని ఎత్తు 8,611 మీ.
దీన్ని పాకిస్తాన్‌లో చాగోరీ అని, చైనాలో క్వాగర్ అని పిలుస్తారు.
ఈ శ్రేణిలో ఓ2 శిఖరంతోపాటు ‘హీడెన్ పీక్’ బ్రాడ్ పీక్ శిఖరాలు కూడా ఉన్నాయి.
ఓ2 శిఖరాన్ని ‘క్వీన్ ఆఫ్ హిమాలయాస్’ అని పిలుస్తారు.
ఓ2 శిఖరాన్ని భారతదేశంలో ‘కృష్ణగిరి’ శిఖరం అని కూడా పిలుస్తారు.
భారతదేశంలో కెల్లా అతి పొడవైన హిమానీ నదం సియాచిన్ కూడా ఈ పర్వత శ్రేణిలోనే ఉంది. ఇది నుబ్రా లోయలో ఉంది.
బైఫో, బల్టారో, బటార్, పిస్సార్ మొదలైన హిమనీనదాలు కూడా ఈ మండలంలోనే ఉన్నాయి
లడఖ్ శ్రేణి: ఈ పర్వత శ్రేణి సింధూ, షియాన్ నదుల మధ్య జాస్కార్ శ్రేణికి సమాంతరంగా సుమారు 300 కి.మీ.ల పొడవుతో విస్తరించి ఉంది.
సింధూనది ఈ శ్రేణి గుండా ప్రవహిస్తూ బుండి అనే ప్రదేశం వద్ద 5,200 మీ. లోతైన విదీర్ణ దరిని ఏర్పరుస్తుంది.
జస్కార్ పర్వత శ్రేణి: ఈ పర్వత శ్రేణులు లడఖ్ శ్రేణులకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి.
లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య సింధూ నది ప్రవహిస్తోంది.
ఈ శ్రేణి హిమాద్రి రూపాంతరం.
ఇది హిమాద్రి నుంచి 80ం తూర్పు రేఖాంశం వద్ద ఒక పర్వత శాఖ విడిపోయి హిమాలయాలకు సమాంతరంగా, వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది.
ట్రాన్‌‌స హిమాలయ మండలంలోని పర్వత శ్రేణులు - దేశాలు
సులేమాన్ పర్వతాలు - పాకిస్తాన్
హిందూకుష్ పర్వతాలు - ఆఫ్గనిస్థాన్
లడక్ శ్రేణులు - భారతదేశం
జస్కార్ శ్రేణులు - భారతదేశం
కారకోరం శ్రేణులు - భారతదేశం
కున్‌లున్ పర్వతాలు - చైనా
కైలాస కొండలు - టిబెట్
గంగా-సింధూ మైదానం

హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో ఈ మైదానం ఏర్పడింది. ప్లీస్టోసీన్ కాలం నుంచి ఇప్పటి వరకు హిమాలయ నదుల వల్ల వచ్చిన ఒండ్రు మట్టితో ఇవి ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రవహించే గంగా, సింధూ నదుల పేర్ల మీదుగా దీనికి ‘గంగా-సింధూ’ మైదానంగా పేరొచ్చింది.
ఈ మైదానం సుమారు 7 లక్షల చ.కి.మీ.
విస్తీర్ణంలో ఉంది. సింధూ నది ముఖద్వారం నుంచి గంగా నది ముఖ ద్వారం వరకు సుమారు 3,200 కి.మీ. పొడవున వ్యాపించి ఉంది. పాకిస్తాన్‌లోని పొట్వార్ పీఠభూమి నుంచి భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిహంగ్ గార్‌‌జ వరకు విస్తరించి ఉంది.
భారతదేశంలో దీని పొడవు 2,400 కి.మీ. మాత్రమే. మనదేశంలో పశ్చిమాన రావి, సట్లెజ్ నదుల ఒడ్డు నుంచి తూర్పున గంగానది డెల్టా వరకు విస్తరించి ఉంది.
ఈ మైదాన భూ స్వరూపాల్లో 4 ముఖ్యమైన ఉపరితల వ్యత్యాసాలను గుర్తించవచ్చు. అవి
) భాబర్ , 2) టెరాయి, 3) భంగర్ 4) ఖాదర్
భాబర్ : శివాలిక్ కొండల పాదాల వెంబడి విసన కర్ర ఆకారంలో ఉండే గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మండలాన్ని భాబర్ అంటారు.
ఇది పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని బృహత్ మైదానాల ఉత్తర సరిహద్దు వెంబడి సుమారు 8-16 కి.మీ. వెడల్పున్న సన్నని మేఖలుగా ఏర్పడింది.
టెరాయి: భాబర్ నుంచి ఉపరితలానికి వచ్చి, ఎల్లప్పుడూ వెల్లువలా ప్రవహించడం వల్ల అక్కడ 15-30 కి.మీ. వెడల్పున్న చిత్తడి ప్రదేశం ఏర్పడింది. దీన్నే టెరాయి అంటారు.
ఇది దట్టమైన అడవులతో అనేక రకాల వన్యమృగాలతో నిండి ఉంది.
భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని భంగర్ అంటారు.
ఖాదర్: ఇటీవల కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఖాదర్ అని పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలను రే లేదా కల్లార్ అంటారు. కార్బొనేట్, బై కార్బొనేట్ లవణాల వల్ల ఇవి క్షార స్వభావం కలిగి ఉన్నాయి.
వీటిని చవిటి నేలలు అని కూడా పిలుస్తారు.
పంజాబ్‌లో ఖాదర్ భూములను బెట్స్ అని పిలుస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section