బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు మరియు మంత్రి.తెరాస ఆందోల్ mla
నేపధ్యము
ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
రాజకీయ జీవితం
బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో పరాజయం పాలయ్యాడు.
కుటుంబం
ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ అక్టోబర్ 13, 2003 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
నటించిన చిత్రాల
20వ శతాబ్దం (సినిమా) (1990)
ముగ్గురు మొనగాళ్ళు
చిన్నరాయుడు
హిట్లర్
దేవి
రాజేంద్రుడు గజేంద్రుడు
రెండిళ్ళ పూజారి
మాయలోడు
హలో బ్రదర్
వారసుడు
మామగారు
పెదరాయుడు
జంబలకిడిపంబ
అప్పుల అప్పారావు