Type Here to Get Search Results !

Vinays Info

Sir Frederick William Herschel | సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్


🌉 సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్ 🔭🌉
(నవంబర్ 15, 1738 - ఆగష్టు 25, 1822) 

🔻ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఆధునిక పరికరా లు లేని కాలంలోనే అంతరిక్షంలోని అద్భుతా లను ఆవిష్కరించిన ఖగోళ శాస్త్ర వేత్త సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్‌. వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుక్కొన్నారు.

🔻మొదట మిలటరీలోని బ్యాండు మేళంలో పనిచేసిన వ్యక్తి, తన పరిశోధనలతో ప్రపంచంలోని మేటి ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా ఎదిగారు. అతడే సర్‌ ఫ్రెడెరిక్‌ విలియం హెర్చెల్‌.

🔻తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్‌తో పాటు దానికున్న రెండు ఉపగ్రహాలను, శని, గురు గ్రహాలకు చెందిన రెండేసి ఉపగ్రహాలను కనుక్కున్నారు.

🔻స్వయంగా రూపొందించుకున్న టెలిస్కోపు లతోనే ఆయన నక్షత్రమండలాల (గెలాక్సీలు) ఆకారాలతో పాటు, విశ్వం స్వరూపాన్ని కూడా అంచనా వేయడం విశేషం.

🔻దాదాపు 2500 నక్షత్ర సముచ్ఛయా (నెబ్యులా)లను, వాటికి సంబంధించిన సిద్ధాంతాలను వెలువరించారు.

🔻సూర్యుని చలన మార్గాన్ని నిర్ధరించి, పరారుణ ఉష్ణతరంగాల ఉనికిని చెప్పినది కూడా ఆయనే. ఆయన సుమారు 400కు పైగా టెలిస్కోపులను తయారుచేశారు.

🔻జర్మనీలోని హోనోవర్‌లో 1738 నవంబర్ 15 న జన్మించిన విలియం చిన్నప్పట్నించే వయోలిన్‌ వాయించడం నేర్చుకున్నాడు. తండ్రితో కొంతకాలం మిలటరీ బ్యాండ్‌లో పనిచేసి, తరువాత అన్నతో ఇంగ్లండ్‌ వెళ్లిపో యాడు. కొన్నేళ్లపాటు సంగీతం మీదనే ఆధారపడి బతికిన ఇతడు తరువాత ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంచుకుని టెలిస్కోపులతో అంతరిక్ష పరిశీలన చేసేవాడు. అలా 1781లో యురేనస్‌ను కనుగొన్నాడు.

🔻ఆ ఏడాదే కోప్లీ అవార్డుతో పాటు, ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా ఎంపికయ్యారు. 'సర్‌' బిరుదును కూడా పొందారు. అప్పటి చక్రవర్తి జార్జి3 ఆయన ను 'రాజఖగోళపరిశీలకుడి' 
(రాయల్‌ ఆస్ట్రానమర్‌)గా నియమించాడు.

🔻కొద్దికాలానికే యురేనస్‌, శని, గురుగ్రహాల ఉపగ్రహాలను కూడా కనుగొన్నారు. చంద్రునిపై గల పర్వతాలను చూడడమే కాదు, వాటి ఎత్తును కూడా కనుగొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన నైట్‌హుడ్‌ సహా అనేక పురస్కారాలు పొందిన ఆయన, 1822 ఆగష్టు 25న తన 84వ ఏట మరణించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section