Type Here to Get Search Results !

Vinays Info

Thimore Leste - తిమోర్ లెస్టే

తిమోర్ లెస్టె ....ఒక ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియా మారిటైమ్ ప్రాంతంలో ఉంటుంది.

🔹ఈ దేశాన్ని ఈస్ట్ తిమోర్ అని కూడా పిలుస్తారు. దీని పేరు మలాయ్ అనే పదం నుంచి వచ్చింది.

🔹మలాయ్ అంటే తూర్పు అని అర్ధం.
🔹మలాయ్ 2002లో పూర్తి స్వాతంత్ర్యం పొందింది.

🔹ఇది 21 వ శతాబ్దంలో సార్వభౌమాధికారం సాధించిన తోలి రాజ్యం.
🔹1975 లో ఉంటే , 1999 వరకు ఇండోనేషియా ఆధీనంలో ఉంది.

🔹రాజధాని : దీలీ
🔹జనాభా : 11,67,242
విస్తీర్ణం : 15,410 చదరపు కిలోమీటర్లు
🔹భాషలు : టెటుమ్, పోర్చుగీస్
🔹కరెన్సీ : యూఎస్ డాలర్

👉జెండా
🔹పసుపు రంగు త్రిభుజం ఈ దేశ వలస చరిత్రకు గుర్తు. నలుపు రంగు త్రిభుజం పారదర్శతకు సూచీస్తుంది. ఎరుపు విముక్తిపోరాటానికి, తెలుపు నక్షత్రం శాంతికి చిహ్నాలు.

👉చూడాటానికి ఈ దేశ స్వరూపం మొసలి ఆకారంలో ఉంటుంది. ఈ రూపం వెనుక ఆసక్తికరమైన ఓ గాధ కూడా ఉండి. ఒక అబ్బాయి ఓ ముసలి మొసలి బాగోలేనపుడు సాయం చేశాడట. ఆ కృతజ్ఞతా భావంతో ఆ మొసలి నీటి మధ్యన ఇలా ద్విపముగా మారిపోయింది. ఆ అబ్బాయి వారసులే ఇక్కడున్న ప్రజలట.

🔹ఇక్కడ మొట్ట మొదటిసారిగా ప్రజాస్వామిక విధానంలో ఎన్నికలు జరిగింది 2001లొనే....

🔹ఈ దేశంలో బంగారం, పెట్రోలియం, సహజవాయువు, మాంగనీస్, మార్బుల్ ఎక్కువగా దొరుకుతాయి. ఇతర దేశాలకు కాఫీ,గంధపు చెక్కలు, మార్బుల్స్ని దిగుమతి చేస్తుంది.

🔹స్థానికులు ఈ దేశాన్ని తిమోర్ లొరెసె అని కూడా పిలుస్తారు. లొరెసె అంటే ఉదయించే సూర్యుడు అని అర్ధం.

🔹ఇక్కడ ప్రధాన ఆహార ధాన్యం మొక్కజొన్న.

🔹ఈ ద్విపానికి ఉత్తరాలు పంపాలంటే వయా డార్విన్, ఆస్ట్రేలియా అని రాయాల్సిందే. అలా రాస్తేనే ఉత్తరాలు చేరతాయి.

🔹ఆసియా దేశాల్లో ఇదో అతి పేద దేశం.

🔹ఇక్కడ పోర్చుగీసు, రోమన్ క్యాథలిక్, ఇండోనేషియన్ల ప్రభావం ఎక్కువ.

🔹అహింసా మార్గంలో శాంతియుతంగా స్వాతంత్ర్య పోరాటం చేసినందుకు ఈ దేశ ఉద్యమకారులు బిషప్ కార్లోస్ ఫిలిపి గ్జిమిసెస్ బెలో, జోస్ రమోస్ హోర్టా లకు 1996లో నోబుల్ శాంతి బహుమతి వచ్చింది.

🔹ఈ దేశ సంస్కృతిలో కవిత్వం భాగం. అందుకే ఇక్కడ వందలాది ప్రఖ్యాత కవులున్నారు. ప్రధాన మంత్రి గ్జనానా గుస్మవో కూడా కవినే.

🔹ఆడవారికి ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన దుస్తులుంటాయి. వారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు.

🔹బహిరంగంగా అరవడం, వాదించడం ఇక్కడ నిషిద్ధం.

- వినయ్ కుమార్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section