Type Here to Get Search Results !

Vinays Info

English Grammar

ENGLISH GRAMMAR-1
Grammar అంటే తెలుసు కదా? వాక్యనిర్మాణం, మాటల వాడకం లాంటి వాటికి సంబంధించింది. English లో తప్పులు లేకుండా మాట్లాడాలన్నా, రాయాలన్నా grammar తెలుసుకోవడం అవసరం. అయితే grabmmar తెలిసినంత మాత్రాన, grammar నిబంధనలన్నీ అంత బాగా గుర్తుండకపోవచ్చు. అందుకే మన భాష తప్పులు లేకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదు. Grammar తెలుసుకోవడంతోపాటు రాయడం, మాట్లాడటం regular గా practice చేయడం చాలా ముఖ్యం. మాట్లాడటం, రాయడం, చదవడం లాంటివి సాధన చేయకపోతే ఫలితం ఉండదు.
        ఈ grammar అందివ్వడంలో ముఖ్యోద్దేశాలు రెండు. మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమైందీ, మీరు correct గా మాట్లాడగలిగేందుకు, రాయగలిగేందుకు సహాయపడటం. రెండోది - ఇప్పుడు అన్ని తరగతుల, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు grammar కే ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీ సొంతం చేసుకునేందుకు చేయూతను అందించడం.
        ఈ grammar lessons చదివి, అర్థం చేసుకుని practice చేస్తే మీరు చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు. తప్పులు లేకుండా రాయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు.

1. Sentence: A group of words with complete meaning.

1) New Delhi is the capital of India
     (ఇండియా రాజధాని ఢిల్లీ) 
     ఇది పూర్తి అర్థాన్నిచ్చే మాటల సమూహం. కాబట్టి ఇది sentence.
2) What are you doing?
     (నువ్వేం చేస్తున్నావు?)

     ఇది కూడా పూర్తి అర్థాన్నిచ్చే group of words కాబట్టి, ఇది sentence అవుతుంది.
3) Read the lesson (పాఠం చదువు), and
4) How tall he is! (అతనెంత పొడుగ్గా ఉన్నాడో!) కూడా sentences.
      ప్రతి sentence ఏదో ఒక దాన్ని గురించి చెబుతుంటుంది కదా? అది ఆ sentence కు subject అవుతుంది. For example, sentence (1), New Delhi ని గురించి చెబుతోంది. కాబట్టి New Delhi, sentence (1) కు subject. అలాగే sentence (2) కు subject, 'you', sentence (4) కి 'he' subject అవుతాయి.
      sentence (3), Read the lesson = You read the lesson.. ఇక్కడ - you subject అవుతుంది. అయితే ఇలాంటి sentences లో you మామూలుగా వాడం.
మనం ఇంత వరకు తెలుసుకున్నది:
       Sentence దేన్ని గురించి చెబుతోందో, అది దాని subject అవుతుంది. ఇదెప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. Sentences లో కూడా రకాలు ఉంటాయి.

1. ఏదైనా ఒక విషయాన్ని తెలిపేది.
e.g.: a) He comes here in the evenings.
              (అతడు ఇక్కడికి సాయంత్రం పూట వస్తాడు.)
b) I Know English.
    (నాకు ఇంగ్లిష్ తెలుసు.)
    ఇలాంటి sentences, statements ను assertive sentences అని కూడా అంటారు.
(state = చెప్పడం)

2. రెండోరకం sentences, ప్రశ్నలు (questions).
a) Where is he?
    (అతడెక్కడ? )
b) What is your name?  ఇలాంటి questions ను interrogative sentences అని కూడా అంటారు.
    ( Interrogate = ప్రశ్నించడం).
3. ఇక మూడోరకం sentences, imperative sentences. అంటే ఇవి ఆజ్ఞలను, అభ్యర్థనలను (order & requests) తెలుపుతాయి.
    (you) sit down
     {(నువ్వు) కూర్చో}.
    (you) Please come in
    (లోపలికి రండి - అభ్యర్థన).
     ఈ imperative sentences అన్నింటికి subject మామూలుగా 'you' ఒక్కోసారి అంటాం, మామూలుగా వదిలేస్తాం ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి.

¤  ¤  ¤  ¤  ¤  ¤

ఒక స్కూల్లో ఉన్న విద్యార్థులంతా ఏదో ఒక class వాళ్లై ఉంటారు కదా? అలాగే English లో ప్రతిమాటా ఏదో ఒక part of speech (భాషా భాగం)గా ఉంటుంది.
English లో eight parts of speech ఉన్నాయి.
అవి.
1. Noun
2. Pronoun
3. Adjective
4. Verb
5. Adverb
6. Conjunction
7. Preposition
8. Interjection.

NOUNS:
Noun means a name.
మనుషులు, జంతువులు, ప్రదేశాలు, వస్తువులు ఇలా దేనికైనా మనం ఇచ్చేపేర్లను 'Nouns' అంటారు.

       పై nouns అన్నీ ఒక్కొక్క పేరుతోనే ఏర్పడేవి. అంటే ఇవి Simple nouns. కొన్నిసార్లు, రెండు మూడు మాటల కలయికతో కూడా nouns ఏర్పడతాయి.
అవి Compound nouns.
e.g: Shoe + lace = shoelace
         foot + ball = football
     ఇవేకాకుండా nouns లో మూడో తెగ derivative nouns. కొన్ని సందర్భాల్లో ఒక noun కు ఇంకో శబ్దం చేర్చడం వల్ల ఏర్పడేదే derivative noun.

IMPORTANT: Nouns లో రెండు రకాలుంటాయి.

1) Countables: ఇన్ని, అన్ని అని సంఖ్యలో చెప్పేవాటిని countables అంటాం. అంటే వీటిని మనం 1, 2, 3 అని లెక్కించవచ్చు.

e.g.: One pen, two pens, five pens అంటాం కదా - కాబట్టి pen, countable... అలాగే మరికొన్ని countables: Book, table, student, teacher, man, woman, child etc ఇవన్నీ countables.

2) Uncountables - మనం లెక్కపెట్టలేనివి.
     e.g.: Sugar, milk, rice etc. వీటిని మనం సంఖ్యల్లో చెప్పం. అంటే లెక్కించం - కాబట్టి ఇవి uncountables.
Some more examples of uncountables: air, oil, coffee, tea etc.

uncountables Plural ఉండదు. Milk, sugar, rice లాంటివి Plural లో (2 milks, 3 sugars అని) చెప్పకూడదు.
3. Countable singulars కు ముందు కచ్చితంగా a/an వాడాల్సిందే.
      A book gives information (Book countable singular కాబట్టి, దాని ముందు 'A' వాడాం.) అలాగే An Umbrella is useful in rain (ఇక్కడ umbrella, countable singular. కాబట్టి దానిముందు an వాడాం).
(A/an = ఒక.)
      పైన చెప్పుకున్న వాక్యానికి తెలుగు అర్థం - గొడుగు వర్షంలో ఉపయోగపడుతుంది.
      అంతేకానీ ఒక గొడుగు వర్షంలో ఉపయోగపడుతుందని అనం.
      కానీ English లో ఇది చాలా ముఖ్యం - countable singular ముందు a/an వాడటం అనేది.
      అయితే ఎప్పుడు 'a' వాడాలి? ఎక్కడ 'an' వాడాలి?
      తెలుగు శబ్దాలు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ తో ప్రారంభమయ్యే English మాటల ముందు An వాడతాం.
      మిగతా వాటిముందు, 'A' ను ఉపయోగిస్తాం.
      చూడండి: An ant, An aunt, An egg, An idea, An ox (ఎద్దు), An owl (గుడ్లగూబ), An Umbrella, An honour (ఆన(ర్) = సన్మానం/పురస్కారం), An hour (అవ(ర్)).
      University కి ముందు ఏం వాడతాం. A University అనే అంటాం; university = యూనివ(ర్)సిటీ- అ నుంచి ఔ వరకు ఉండే శబ్దాల్లో, యూ లేదు కదా? అందుకని A University అనడం correct. అందుకే ఈ అంశాలు గుర్తుంచుకుందాం.
4. Uncountables: వీటికి plural ఉండదు. milks, sugars, rices అనం కదా? ఈ కిందివి గుర్తుంచుకోండి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు:

ఏ noun అయినా Uncountable అయితే - 1) దానికి plural ఉండదు.
2) దాని ముందు a/an రాదు.
      అయితే అన్ని భాషల్లో లానే English లో కూడా రెండు అర్థాలుండే మాటలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఒకే noun, ఒక అర్థంతో countable కావచ్చు. ఇంకో అర్థంతో uncountable కావచ్చు.

ఒక మాట ఎప్పుడు countable, ఎప్పుడు uncountable అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
I bought iron yesterday.
      ఇక్కడ iron ముందు 'an' లేదు, కాబట్టి అర్థం, నేను నిన్న ఇనుము కొన్నాను అని.
I bought an iron yesterday.
      Iron ముందు, an ఉంది కదా. అంటే ఇక్కడ iron countable. కాబట్టి అర్థం, ఇస్త్రీపెట్టె.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section