సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్
జయంతి సందర్భంగా..
కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతిగ్రహీత.
🔸బాంటింగ్ వైద్యవిద్య టొరాంటో విశ్వవిద్యాలయం నుండి 1916లో పూర్తిచేసిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ ద్వారా దేశానికి సేవలందించాడు. ఆ తర్వాత ఎముకల శస్త్రచికిత్సలో నైపుణ్యం సంపాదించాడు. యూనివర్సిటీలో వైద్య విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ బయట వైద్యసేవలందిం చేవాడు. మధుమేహంతోబాధపడుతున్న రోగుల బాధల్ని బాపేందుకు లండన్ నుండి టొరాంటోకు మకాంమార్చాడు.
అక్కడ 1921 లో జాన్ జేమ్స్ రిచర్డ్ మెక్లియాడ్ (John James Richard Macleod) పర్యవేక్షణ లో టొరాంటో యూనివర్సిటీలో పరిశోధనలు మొదలు పెట్టాడు. చార్లెస్ బెస్ట్ (Charles Best) ఇతనికున్న ఏకైక శిష్యుడు.
🔸బాంటింగ్ కుక్కలలో క్లోమనాళా న్ని బంధించి ఉంచి, కొంతకాలం తర్వాత వాటినుండి క్లోమాన్ని వేరుచేసి వాటి రసాన్నిమధుమేహం తో బాధపడుతున్న కుక్కలకు ఎక్కించి పరీక్షించాడు. దీని ఆధారంగా జరిపిన విస్తృత పరిశోధనల మూలంగా మెక్లియాడ్ పర్యవేక్షణలో 1921-22 ప్రాంతంలో ఇన్సులిన్ ను వేరుచేశారు.
🔸ఇది ఆనాటి కాలంలో వైద్య శాస్త్రం లో చాలా ప్రాముఖ్యమైన అభివృద్ధి. ఇన్సులిన్ ను వేరుచేయ డమే కాకుండా కొన్ని నెలల కాలం లోనే దాన్ని అధిక మొత్తంలో తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరప్రసాదంగా మారింది.
🔸1923 సంవత్సరంలో బాంటింగ్ మరియు మెక్లియాడ్ ఇద్దరు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. బాంటింగ్ తనకు వచ్చిన ధనాన్ని తన శిష్యుడు బెస్ట్ తో పంచుకున్నాడు.
🔸జార్జి రాజు V (King George V) 1934 సంవత్సరంలో సర్ బిరుదాన్ని బహూకరించారు.