జవహర్ లాల్ నెహ్రూ (మొదటి ప్రధాని)
జయంతి సందర్భంగా..
భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారు డు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమై న నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
నవ భారత రూపశిల్పి:
〰〰〰〰〰〰
ఆయన భారత దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు అందరికంటే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి. వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ, స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబ డ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు.
అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాల అంతర్జాతీయ రాజకీయా లలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని, (సంస్కృతంలో "పండిట్" గౌరవసూచకము ) భారతదేశంలో పండిట్ జీ(జీ, మర్యాద పూర్వక పదం) అని పిలిచేవారు.
భారత దేశంలో సంపన్న న్యాయవాది మరియు రాజకీయ వేత్త అయిన మోతిలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ లో వామ పక్ష నాయకుడయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ,మహాత్మా గాంధీ సలహాలతో, ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీగారి రాజకీయ వారసునిగా గుర్తించ బడ్డారు. జీవిత పర్యంతం స్వేచ్ఛా వాదిగా ఉన్న నెహ్రూ, పేద దేశాల దీర్ఘకాల ఆర్ధిక అభివృద్ధిసమస్యలుఎదుర్కోవటానికి నిలకడతో కూడిన సామ్యవాదం మరియు ప్రభుత్వ రంగం అనుకూలమని భావించారు.
ఆగష్టు 15 1947లో భారత దేశం స్వాతంత్ర్య్యం సంపాదించినపుడున్యూఢిల్లీలో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితి ని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.
ఆయన సుదీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందిం చటంలో సాధనంగా ఉంది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు.
ఆయన కుమార్తె, ఇందిరాగాంధీ, మరియు మనుమడు, రాజీవ్ గాంధీకూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.
బాల్యం:
〰〰
నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలో జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూదంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాది గా బాగా రాణించి, తన కుటుంబా నికి సకల సంపదలు సమకూర్చారు మొదట ఇంగ్లాండు లో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరుతో పిలిచేవారు.
జీవిత చరిత్ర:
〰〰〰
మోతీలాల్ చాలా సంవత్సరాల క్రితం అలహాబాద్ కు తరలి వెళ్లి న్యాయవాద వృత్తిలో విజయవంత మయ్యారు. కాని..
1919 లో జలియన్ వాలా బాగ్ లో ఆందోళనకారులపై ఆంగ్లేయుల ఊచకోత తరువాత, నెహ్రూ తీవ్ర ప్రతీకారంతో తన శక్తులన్నీ స్వాతంత్ర్య సంగ్రామానికే కేటాయించారు.
ఆయన జీవితకాలంలో తొమ్మిది సంవత్సరాలు కారాగారంలో ఉండేటట్లు చేసాయి. కారాగారంలో ఉన్న కాలంలో నెహ్రూ, "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ(1934), తన "జీవిత చరిత్ర " (1936), మరియు "ది డిస్కవరీ అఫ్ ఇండియా " (1946) రచించారు. ఈ రచనలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయనకు పెరుగుతున్న కీర్తితో పాటు రచయితగా కొంత ప్రత్యేకతను సంపాదించి పెట్టాయి.
గాంధీ గారి మార్గదర్శకత్వంలో నెహ్రూ మొదటిసారిగా 1929 లో భారత జాతీయ కాంగ్రెస్, లాహోర్ సమావేశాలకు నాయకత్వం వహించారు. అయన మరలా 1936, 1937 చివరిగా 1946 లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై స్వతంత్ర సంగ్రామంలో గాంధీ తరువాత రెండవ నాయకునిగా గుర్తింపు పొందారు.
నెహ్రూ తన శేష జీవితం మొత్తం ఒంటరిగానే గడిపారు. అయితే 1946 నుండి వైస్రాయి భార్యగా నున్న ఎడ్విన మౌన్త్బట్టేన్తో అయన సంబంధం గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.
బ్రద్దలైన మతకలహాలు మరియు గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నడుపబడు చున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేక తల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీన పడింది.మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫల మైన తరువాత, నెహ్రూ జూన్3, 1947 న ఆంగ్లేయులచే ప్రతిపాదిం చబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరిం చారు. ఆయన 15ఆగస్టున భారత దేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకా రం చేసి ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ :గా ప్రసిద్ద మైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.
చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమం తా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్రజీవనానికైమేల్కొంది. మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమై నపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది. భారత దేశం కొరకు మరియు దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది."
ఆర్ధిక విధానాలు:
〰〰〰〰
భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు.
నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార మరియు ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ మరియు భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానాన్ని యోచించారు.
నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమా లు చేపట్టారు.కమ్యూనిటీ అభివృ ద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యా న్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.
భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన మరియుజలవవిద్యుత్ఉత్పత్తితో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు.
నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధి మరియు ఆహారోత్పత్తి పెరుగుదల జరిగినప్పటికీ, భారత దేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు, ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక మరియు భారీ పరిశ్రమలను ప్రోత్సహించినప్పటికీ, దేశ ప్రణాళిక, నియంత్రణ మరియు క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత మరియు లాభదాయక తలను బలహీన పరచాయి.
భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైన పేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు.
నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తార మైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు మరియు వ్యవస్థాపనసౌకర్యాలు కల్పించడం లో విజయవంత మయ్యింది.
విద్య మరియు సంఘ సంస్కరణ:
〰〰〰〰〰〰〰〰〰
భారత దేశ బాలలు మరియు యువకులు విద్యను అభ్యసించా లనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమనిభావించారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది.
భారత దేశ బాలలం దరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించా లనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలనుమరియు వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు మరియు ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి మరియు సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.
కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించు టకు మరియు స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను మరియు సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.
షెడ్యుల్డ్ కులాలు మరియు తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను మరియు అననుకూలతలను రూపుమాపడా నికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు.
నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి మరియు ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.
జాతీయ భద్రత మరియు
విదేశాంగ విధానం:
〰〰〰〰〰
ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన నూతన స్వేచ్ఛా భారతా నికి నెహ్రూ 1947 నుండి 1964 వరకునాయకత్వం వహించారు. యు.ఎస్. మరియు యు.ఎస్.ఎస్.ఆర్.లు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.
1948 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణకు నెహ్రూ అంగీకరించి నప్పటికీ, తరువాతి కాలంలో ఐక్యరాజ్య సమితికి దూరమై 1953 లో జనాభిప్రాయ సేకరణకు నిరాకరించారు. అంతకుముందు తాను బలపరచిన షేక్ అబ్దుల్లా, వేర్పాటు వాద ఆశయాన్ని కలిగి ఉన్నారనే అనుమానంతో ఆయన అరెస్టుకు ఆదేశించి, ఆయన స్థానంలో బక్షి గులాం మొహమ్మద్ ను నియమించారు.
అంతర్జాతీయ రంగంలో నెహ్రూ ఒక శాంతి కాముక నాయకునిగా ఉండి UNO కి మంచి మద్దతుదా రుగా నిలిచారు. ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించి,US మరి యు USSR దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాల తో అలీనోద్యమా న్నిస్థాపించి, దాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించారు.
స్థాపించిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాను గుర్తించి (అనేక పశ్చి మ కూటములు రిపబ్లిక్ అఫ్ చైనాతో సంబంధాలు కొనసాగిం చాయి), ఐక్యరాజ్య సమితిలో దానిని చేర్చు కోవాలని వాదించి, కొరియాతో వైరం వల్ల చైనీయులను కలహ కారకులుగా గుర్తించడాన్ని వ్యతిరేకించారు.చైనా 1950 లో టిబెట్ను ఆక్రమించినప్పటికీ దానితో సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాలని భావించి,కమ్యూనిస్ట్ దేశాలకు మరియు పశ్చిమకూటమి కి మధ్య ఏర్పడిన ఒత్తిడులను తొలగించేందుకు మధ్యవర్తిగా ఉండాలని ఆశించారు. చైనాతో ఈ విధమైన శాంతి కాముక విధానం సమస్యాత్మకమైనదిగా,చైనా కాశ్మీర్ ప్రాంతంలో నున్న, టిబెట్ సరిహద్దు గా ఉన్న అక్సాయి చిన్ ను ఆక్రమించి, భారత-చైనా యుద్ధం, 1962 కు దారి తీసినపు డు ఋజువైనది.
అణు ఆయుధాల బెదిరింపులను మరియు ప్రపంచంవ్యాప్త వత్తిడు లను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది. అణు విస్ఫోటనం వల్ల మానవ జాతికి కలిగేఫలితాలతొలిఅధ్యయ నాన్ని ప్రారంభించి, తాను'వినాశకర భయానక యంత్రాలు'గా పిలిచే, వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటి వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరా యుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి కారణం.
1956 లో సుయాజ్ కాలువపై ఆంగ్లేయ, ఫ్రెంచ్ మరియు ఇజ్రాయిల్ ల ఉమ్మడి దండయాత్ర ను విమర్శించారు. అనుమానం మరియు అపనమ్మకం యు.ఎస్., మరియు భారత దేశాల మధ్య సంబంధాలను బలహీనపర చి, నెహ్రూ వ్యూహాత్మకంగాసోవియ ట్ యూనియన్ నుబలపరుస్తున్నా రనే అనుమానాన్ని కలిగించింది.
1960 లో పాకిస్తాన్ పాలకుడైన ఆయుబ్ ఖాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా దీర్ఘకాలంగా అపరిష్కృతం గా ఉన్న పంజాబ్ ప్రాంతంలోని నదీ వనరుల పంపక సమస్య సాధనకు, యునైటెడ్ కింగ్డం మరియు ప్రపంచ బ్యాంక్ల మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.
1962 ఎన్నికలలో, ఆధిక్యత తగ్గిన ప్పటికీ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కొద్దినెలల కాలంలోనే,సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చింది. సామ్రాజ్యవాద బాధితులుగా (భారత దేశం ఒక వలస రాజ్యం) మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, "హిందీ-చీనీ భాయి భాయి ", (భారతీయులు మరియు చైనీయులుసోదరులు)అనే మాటల లో నెహ్రూ తన భావాన్ని వ్యక్తం చేసారు.అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్య సోదరభావంమరియు ఐకమత్యానికి ఆయన అంకితం అయ్యారు. నెహ్రూ స్వాభావికంగా ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశం పై పోరుసల్పదని భావించారు, ఏ సందర్భంలో నైనా భారతదేశం చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి.చైనా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతాల్లో వారిని ఎదుర్కోవాలనే ఆలోచనను - "వారిని (చైనీయులను )బయటకు విసిరేయండి"-అనే జ్ఞప్తికి ఉంచుకోదగిన ప్రకటనలో సైన్యాన్ని ఆదేశించారు-చైనా ముందస్తు దాడిని ప్రారంభించింది.
చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారత దేశంలోని అస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనత ను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి,యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది.
క్రమంగానెహ్రూఆరోగ్యంమందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బంది కి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం మరియు విశ్వాస ఘాతుకంగా భావిస్తారు. కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండె పోటు తో బాధపడి తరువాత మరణించారు. 27 మే 1964 వేకువ సమయంలో ఆయన మరణించారు.
తన జీవిత కాలంలో నెహ్రూ భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి.
బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్,ను భారత దేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్) అని గౌరవిస్తారు.