Type Here to Get Search Results !

Vinays Info

అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం | International Diabatic Day

🌸🌼🌸➖➖➖➖➖➖➖➖
నేడు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం
➖➖➖➖➖➖➖➖🌸🌼🌸
🔸నేటి ఆధునిక ప్రపంచాన్ని మనిషి రూపంలో పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య తీవ్రవాదం (లేదా) ఉగ్రవాదం. వ్యాధుల్లో... ఎయిడ్స్ మహమ్మారి. ఇది వయస్సులో ఉండే యువతీయువకులు చేసే తప్పిదాల వల్ల వచ్చే వ్యాధి. ఈ రెండు కాకుండా.. చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతు లకు గురిచేస్తున్న వ్యాధి 'మధుమేహం'.

🔸అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారి నుంచి.. అరవై ఏళ్ల వృద్ధుడు ఈ వ్యాధి బారిన పడుతున్నాడు.దీంతో.. మధుమేహం ఒక  అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, వైద్య రంగానికే కొత్త సవాల్‌ను విసురుతోంది.

🔸తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య 24.6 కోట్లు ఉంది. అంటే ఎయిడ్స్ మహమ్మారి కంటే.. అతి వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.

🔸ఒకనాడు కలరా, మలేరియా, ఆటలమ్మ వంటి అంటు వ్యాధులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవి. ఇవి సోకితే..ఆ ప్రాంతవాసులంతా  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించాల్సిందే. అయితే.. ఈ వ్యాధులను ఆధునిక వైద్య శాస్త్రం చాలావరకు కట్టడి చేసింది. అలాంటి ప్రాణాంతక వ్యాధిలా మారిన మధుమేహాన్ని నిర్మూలించడం ఓ సవాల్‌గా మారింది.

🔸ఇది అంటురోగం  కాకపోయిన ప్పటికీ.. ఒక కుటుంబంలోని వ్యక్తికి ఉన్నట్టయితే.. కొన్ని తరాల పాటు ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలకు కుటుంబాలతో పాటు.. దేశాలకు, దేశాలు, చివరకు ప్రపంచం యావత్ అతలాకుతలమై పోవడం ఖామని 'ఐక్యరాజ్య సమితి' హెచ్చరిస్తోంది.

🔸అందుకే.. నవంబర్ 14వతేదీన"అంతర్జాతీయ  మధుమేహ వ్యాధి దినోత్సవం"గా ఐరాస ప్రకటించింది.

🔸ఈ మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు గుర్తించారు. అందులో ఒకదాన్ని టైప్-1 గాను, రెండోది టైప్-2గాను పేర్కొన్నారు. మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్-1 కింద పరిగణిస్తారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది.

🔸ఇకపోతే.. ఇన్సులిన్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతూ పూర్తిగా వినియోగం కాకపోయిన ట్టయితే దీన్ని టైప్-2 రకం అంటారు. ఇది ఎక్కువగా పెద్దలకు వస్తుంది.

🔸అయితే ఇటీవలి కాలంలో.. చిన్నపిల్లలకు రెండు రకాల మధుమేహాలు సంక్రమిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఇలా చిన్నపిల్లలు మధుమేహం వ్యాధి బారిన పడుతున్న దేశాల్లో ఆసియా దేశాలే అగ్రస్థానంలో ఉండటం విచారించ దగ్గ విషయం.

సమైక్యత'కు స్పూర్తి ఆ చిహ్నం:
〰〰〰〰〰〰〰〰
🔸నానాటికీ పెరిగిపోతున్న మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్యను అరికట్టేందుకు వీలుగా.. ఐరాస అంతర్జాతీయ మధుమేహా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయం.  ఈ ఏడాది ప్రత్యేకంగా మధుమేహంపై దృష్టి సారించి ప్రత్యేకంగా ఓ తీర్మానం చేయడం ఈ వ్యాధి తీవ్రత ఎంతమేరకు ఉందో ఇట్టే పసిగట్టవచ్చు.

🔸ఇందుకోసం ఓ చిహ్నాన్ని కూడా ఐరాస రూపొందించింది. మధుమేహంపై ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా పోరాడాలన్న స్పూర్తిని స్ఫురించే విధంగా వృత్తాన్ని, దాని మధ్యలో నీలి రంగు మధుమేహ వ్యాధికి చిహ్నంగా చాటి చేపుతోంది. ఈ వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు పలు రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ.. క్రమం తప్పకుండా మందులు వాడటం, మిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రతరం కాకుండా అరికట్టేందుకు ఏకైక మార్గమని వైద్య నిపుణులు చెపుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section