దేశబంధు 'చిత్తరంజన్ దాస్'(C.R.Das)
(నవంబరు 5, 1870 - జూన్ 16, 1925) ప్రముఖ బెంగాళీ న్యాయవాది మరియు
స్వాతంత్ర్యోద్యమ నేత.
ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ ను విజయవంతముగా గెలిపించడంతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు.
ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయు డయ్యాడు.
తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.
బ్రిటిష్ రాజు కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వర్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును "లిబర్టీ"గా మార్చారు.
కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పనిచేసారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు.
ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరిం చారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.
ఆయనప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో
బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లోని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు మరియు సంఘ సంస్కర్త అయిన దుర్గ మోహన్ దాస్‌కు మేనల్లుడు.ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు ఎస్.ఆర్.దాస్, సరళా రాయ్, లేడీ ఆబాల బోస్.
ఆ రోజుల్లో...స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది.
అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందరు చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు.
అందరు విభ్రమంతో చూడసాగారు.“అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచం డి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను” అని అర్థించాడు ఇందోర్ మహారాజు.
ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.
మరెవరైనా అయివుంటే “మహాభాగ్యం” అని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు “అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను.
మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వస్తాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను” అని జవాబిచ్చాడు.ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.
ఆ న్యాయవాది “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.