స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త
అండర్స్ సెల్సియస్
*సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం.
చరిత్ర
అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్.
*సెల్సియస్ ఉష్ణ మాపకం*
దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుకున్నాడు. (మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత 0°C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని హిప్సోమీటర్లోఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 100°C గా తీసుకున్నారు. (నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100°C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు. సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 100° C మరియు అధో స్థిర స్థానంగా 0°C గా తీసుకున్నాడు.
*సెల్సియస్ ఉష్ణోగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:*
[9/5xTemp °C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.