➖➖➖➖➖➖➖
🎆 *బ్రూస్ లీ* 🎆🎥
జయంతి సందర్భంగా...✍
➖➖➖➖➖➖➖➖
(నవంబర్27,1940-జులై 20, 1973)
🔸అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు. *ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.* కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు.
🔸బ్రూస్ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించే వారు.చైనీయుల సాంప్రదాయ క్రీడ యైన కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించే వాడు.
*బాల్యం:*
బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించి. హాంకాంగ్ లో పెరిగాడు. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం.
*నటనా జీవితం:*
బ్రూస్ లీ 1973 వ సం"లో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ, ఆతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.
🔸 *శారీరక ధారుడ్యము, పౌష్టికాహారం:*
అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిష నింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయప డేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. *'వింగ్ చున్' విధానంలోని 'వన్ ఇంచ్ పంచ్'కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు.* 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్ట మొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. *సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు.* ఆబ్జెక్ట్‌కు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుంద న్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షర సత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. *ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది.* అయితే, అపారమైన అనుభ వం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. *ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ఉన్నంతకాలం బతికే ఉంటాడు.*
*బ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలు:*
*స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి...బ్రూస్ లీ.* 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...
🔸 *బ్రూస్ లీ అసలు పేరు 'లీ జూన్ ఫాన్'.*ఈ చైనా ఫైటర్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో పుట్టాడు. బ్రూస్ లీ ప్రైవేట్‌గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పటానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవాడు. *ఫైటింగ్‌లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటేవేగంగాకదులుతుంది.*ఈ వేగాన్ని నిరూపించ టం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించే వాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చు కునే వాడు.ఒక అంగుళం దూరం నుంచే పవర్‌ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి.
*మరణం:*
*మే 10, 1973 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపో యాడు.*మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికీ బ్రూస్ లీ కోమా లోకి వెళ్ళిపో యారు. ఒక గంటలో చనిపోయాడు.
కానీ అతని సాహసాలు,మన మది లో మెదులుతూనే ఉన్నాయిగా...