Type Here to Get Search Results !

Vinays Info

జయప్రకాశ్ నారాయణ్ | Jayaprakash Narayan (J.P)

జె.పి.గాసుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా.....

భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్ నాయక్  అని సగౌరవంగా పిలుచుకుంటారు  భారత ప్రభుత్వం ఈయన 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం" గా ప్రకటించింది

ప్రారంభ జీవితం:
〰〰〰〰
జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని  బలియాజిల్లాకు,  బీహారు లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను  పాట్నా లో అభ్యసించాడు.  అటుపిమ్మట  అమెరికా లో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి  1929 లో  భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికా లో ఉన్న సమయంలో  మార్క్స్  సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే  యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.

1920 లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు,  కస్తూరిబా గాంధీ  అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడాడు.

స్వాతంత్ర్య సమరయోధుడిగా....
〰〰〰〰〰〰〰〰〰
అమెరికానుండి వచ్చిన వెంటనే  జవహర్‌లాల్ నెహ్రూఆహ్వానం మేరకు  ఇండియన్ నేషనల్ కాంగ్రెసు లో చేరి త్వరలోనే  మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు.

1932 లో శాసనోల్లంఘనోద్యమం లో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెసు లో అంతర్భాగం గా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెసు సోషలిష్టు పార్టీ కి జనరల్ సెక్రటరీ గా నియమించబడ్డాడు.

1942 లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రాం మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.

స్వాతంత్ర్యానంతరం జె.పి. ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ  ప్రజా సోషలిస్టు పార్టీ గా మారి బీహారు ,  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినది.

సర్వోదయ ఉద్యమం :
〰〰〰〰〰〰
1954 లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌ లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరితగతిన భారతదేశం లో మహాత్మా గాంధీభావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.

1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి  బీహారు రాష్ట్ర రాజకీయాల లో క్రియాశీలంగా వ్యవహరించ నారంభించాడు .1974 లో బీహారు లో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆతర్వాత  బీహారు ఉద్యమం గా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన  సంపూర్ణ విప్లవా నికి జె.పి. పిలుపునిచ్చాడు.

ఎమర్జెన్సీ :
〰〰〰
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ని దోషిగా పేర్కొంటూఅలహాబాదు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలోఅత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి. ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌ లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.

చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న  ఎమర్జెన్సీ ని తొలగించి ఎన్నికలను ప్రకటించడం తో ఆమెను ఎదుర్కోవటానికి  కాంగ్రెసు కు వ్యతిరేకంగా జె.పి. మార్గదర్శక త్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెసు ను ఓడించి, ఇందిరగాంధి ని గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించినది.

భారత రత్న:
〰〰〰〰
భారతదేశం లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబరు8,1979లోమరణించాడు.

మరణానంతరం 1998 లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న ను ప్రకటించినది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965 లో  మెగసెసే అవార్డుప్రకటించబడినది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section