Type Here to Get Search Results !

Vinays Info

నేడే భారత వైమానిక దళ దినోత్సవం _ అక్టోబర్ 08

భారతదేశ త్రివిధ దళాల్లో వైమానిక దళము ఒకటి . దీని ప్రధాన భాద్యత గగనతలాన్నిరక్షించడము,  యుద్ధసమయాల్లో వైమానిక దాడులు నుర్వహించడము .

భారత వైమానిక దళాని 1932 అక్టోబరు 08 న తొలుత ఏర్పాటు చేసారు . రెండోప్రపంచ యుద్ధకాలం లో ఈ దళము అందించన సేవలకు గుర్తింపుగా 1945 లో " రాయల్ " అన్న పదాన్ని ముందు కలిపారు . 1947 లో మనదేశము స్వాతంత్రాన్ని సముపార్జించాక " రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ " యూనియన్‌ ఆఫ్ ఇండియాకు సేవలందించినది . 1950 లో భారతదేశము రిపబ్లిక్ గా మారాక ' రాయల్ ' నుతీసేసారు. స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి భారతీయ వైమానిక దళం పాకిస్తాన్‌ తో నాలుగు యుద్ధాల్లో , చైనా తో ఒక యుద్ధం లో పాల్గొన్నది . ఆపరేషన్‌ విజయ్ , ఆపరేషన్‌ మేఘ్ దూత్ , ఆపరేషన్‌ కాక్టస్ వంటి ప్రధాన బాధ్యతల్ని సమర్ధ వంతం గా నిర్వహించినది

యుద్ధాలవిషయం అలా ఉంచితే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతవైమానిక దళము చురుగ్గా పాల్గొన్నది .

ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1300 విమానాలతొ ప్రపంచంలో నాల్గవ పెద్ద దళం గా ఉన్నది . మొదటి స్థానము లొ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ , రెండెవ స్థానములో రష్యన్‌ ఎయిర్ ఫోర్స్ , మూడవ స్థానములో చైనా ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి .

సోవియట్ కాలం నాటి యుద్ధవిమా నాల్ని మార్చేందుకు ఐ.ఎ.ఎఫ్. విసృతమైన ఆధునికీకరణ కార్యక్రమాల్ని చేపట్టింది . 1947 ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చట్టము , భారత రాజ్యాంగము , 1950 నాటి ఎయిర్ ఫోర్స్ చట్టము , ఐ.ఎ.ఎఫ్. విధుల్ని స్పష్టము గా నిర్వచించాయి . దీనిప్రకారము భారత్ ను అన్ని కోణాల నుంచి రక్షించేందుకు భారత వైమానిక దళము సర్వసిద్ధం గా ఉంటుంది . ఇతర సాయుధ దళాల సహకారము తో భాతీయ గగన తలాన్ని రక్షిస్తూ , భారత భూభాగాన్ని , జాతి ప్రయోజనాల్ని అన్నిరకాల సవాళ్ళ నుంచి కాపాడు తుండాలి . యుద్ధ రంగం లో భారత సైన్యానికి ఐ.ఎ.ఎఫ్ వైమానిక మద్దతును అందిస్తూ వ్యూహాత్మకం గా వస్తు సామగ్రిని సైనికుల్ని ఆకాశమార్గాన పంపుతుంది .

సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే దేశ అంతరిక్ష పరికరాల్ని సమర్ధవంతం గా ఉపయగించుకోవడం కోసము అంతరిక్షవిభాగానికి , ఇండియన్‌ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) లతో కలసి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ను నిర్వహిస్తుంది . ఈ సామగ్రికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడుతుంది . ప్రకృతి వైపరీత్యా లు సంభవించినప్పుడు ఇతర సైనికదళ శాఖలతో కలిసి బాధితులను కాపాడె ప్రయత్నాలు చేస్తుంది . ప్రబావిత ప్రదేశాల్లో బాధితులకు సహాయ సామాగ్రిని కిందకు జారవిడుస్తుంది .

కాంగో సంక్షో్భము , గోవా విమోచ నము సందర్భం గా 1960 - 61 లో ఐ.ఎ.ఎఫ్ విశి్ష్ట సేవలు చేసినది . 1962 లో చైనా భారత్ యుద్దంలో  భారతీయ సైనిక వ్యూహకర్తలు కుట్రను పసికట్టడంలో విఫలమైనా, 1965 లో పాకిస్తాన్‌ తో యుద్ధం లో  బారత్ తన వైమానిక దళాన్ని విసృతం గా వినియోగించుకున్నది . తర్వాత దళం సామర్ధ్యానీ పెంచుకున్నది . . . అనేక మార్పులు చేసినది .చేస్తూవుంది కూడా..

వస్తు సామగ్రి అందజేత , రిస్క్ ఆపరేషన్ల సామర్ధ్యాన్ని పెంచుకు నేందుకు అనేక అంతరిక్ష నౌకల్ని అమకూర్చుకున్నది . 1971 లో భారత్ -పాకిస్తాన్‌ నడుమ జరిగిన బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం లో వైమానిక దళం విభిన్న ఆపరేషన్లు నిర్వహించి ఘనతికెక్కినది . ఇలా దాదాపు 8 దశాబ్దాల క్రితం ఏర్పడిన భారత వైమానిక దళము యుద్ధాలు , సహాయక చర్యల్లో పాల్గొంటూ మరెన్నో ఆపరేషన్లు నిర్వహిస్తూ భారత భూభాగాన్ని , భారతీయుల్ని కాపాడుతోంది . ఆన్ని సాయుధదళాలకు భారత రాస్ట్రపతే సుప్రీం కామాండర్ . రక్షణ మంత్రి నేతృత్వం లొ రక్షణ విభాగము ఎయిర్ ఫోర్స్ ను పర్యవేక్షిస్తుంది . పభుత్వ భద్రతా విధానానికి రూపకల్పన చేయడం ద్వారా ప్రధానమంత్రి , జాతీయ భద్రతామండలి పరోక్ష నాయకత్వా న్ని అందిస్తారు .

భారతీయ వైమానిక దళం 5 ఆపరేషనల్ , 2 ఫంక్షనల్ కమాండ్స్ గా విభజితమై ఉంది . దేశాన్ని అన్ని విధాలుగా రక్షిస్తున్న ఈ దళం సేవలను గుర్తిస్తూ , అది ఏర్పాటైన రోజును ..అంటే అక్టోబర్ 8వ తేదీని 'ఎయిర్ ఫోర్స్ డే'గా జరుపుకుంటారు.

Top Post Ad

Below Post Ad

Ads Section