Type Here to Get Search Results !

Vinays Info

భోగరాజు నారాయణమూర్తి |Bhogaraju Narayana Murthy

భోగరాజు నారాయణమూర్తి (అక్టోబర్ 8, 1891 - ఏప్రిల్ 12, 1940) ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త.
జననం
ఈయన 1891, అక్టోబర్ 8 న గజపతినగరం లోని దేవులపల్లి గ్రామంలో జన్మించాడు.
ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రావు మరియు జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
రచనలు
నవలలు
విమలాదేవి (1915)
ఆంధ్ర రాష్ట్రము (1918)
అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల
ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల
ప్రచండ పాండవము
చంద్రగుప్తుడు
కాలచక్రము : సమకాలీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవల
అల్లాహో అక్బర్ : కాకతీయులకు, మహమ్మదీయులకు మధ్యగల మతరాజకీయాలను వివరించే నవల.
ఉషఃకాలము : శివాజీ జీవితం ఇతివృత్తంగా సాగిన నవల
పండుగ కట్నము (1927)
పద్య కావ్యాలు
కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ[1]
కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవిత చరిత్ర
వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం
ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ
పార్థివలింగ శతకము
నాటకాలు
లక్షణ (సాంఘిక నాటకము)[2]
లతాంగి (1915)
ఉషా పరిణయము (1909)
ఆంధ్ర భారతి (1911)
నౌరోజ్ (1926)
మరణం
1940, ఏప్రిల్ 10 న పరమపదించాడు.

Top Post Ad

Below Post Ad

Ads Section