Type Here to Get Search Results !

Vinays Info

కెప్టెన్ లక్ష్మీ సెహగల్ | Captain Lakshmi Sehagal

🌸➖➖➖➖➖➖➖🌸
       కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 
🌸➖➖➖➖➖➖➖🌸
🔸ప్రముఖ సంఘసేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ.

🔸ఈమె తండ్రి స్వామినాథన్  మద్రాసులో  ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యనిషేధం  వంటి జాతీయ పోరాటాలలో పాల్గొన్నారు.

🔸1938 లో మద్రాసు వైద్య కళాశాలలో MBBS గైనకాలజీ పూర్తయిన తరువాత 1940లో  సింగపూర్ వెళ్ళి, అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించారు.

🔸అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్  ప్రసంగా లకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమం లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళాదళాల్లో చేరి, క్యాప్టెన్ హోదా పొంది, డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందచేశారు. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని "ఝాన్సీ రెజిమెంట్ "కు ప్రాతినిధ్యం వహించారు.

🔸లక్ష్మీ సెహగల్ 1947లో లాహోర్ కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ ను లాహోర్‌లో వివాహం చేసుకొని కాన్పూరులో స్థిరపడి కాన్పూర్ ప్రజలకు వైద్యసేవలందించారు.

🔸స్వాతంత్రానంతరం ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోషియేషన్ (ఐద్వా) ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు.

🔸1971లో, సీపీఎం తరఫున లక్ష్మీ సెహ్‌గల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

🔸1998లో ఈమెకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడినది.2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగారు. (ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.)

🔸97 సంవత్సరాల వయసులో లక్ష్మీ సెహ్‌గల్ 2012, జులై 23న కాన్పూర్‌లో మరణించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section