Type Here to Get Search Results !

Vinays Info

విద్యాలక్ష్యాల వర్గీకరణ | Classification of Educational Objectives

🔹విద్యాబోధనలో ప్రతి ఉపాధ్యాయుడికి విద్యాలక్ష్యాల వర్గీకరణ గురించి; గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాల గురించి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. 🔹ఎందుకంటే విద్య అనే త్రిధ్రువ ప్రక్రియలో మొదటి సోపానం బోధనా లక్ష్యాలను రూపొందించడం.
🔹రెండో సోపానం అభ్యసనానుభవాలను కల్పించడం, మూడోది ప్రవర్తనా మార్పులను మూల్యాంకనం చేయడం.

🔹సాధారణంగా అంతిమ గమ్యాలనే 'ఉద్దేశాలు' అంటారు.
🔹ఉదా: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని కలిగించడం
🔹నిర్దిష్టమైన త్వరితగతిన సాధించగల గమ్యాలనే 'లక్ష్యాలు' అంటారు. లేదా గమ్యాన్ని చేరడానికి ఉపయోగకరమైన   సాధనాలు లేదా మార్గాలను 'లక్ష్యాలు' అంటారు.
🔹నిర్దిష్ట కాలంలో ఒక పాఠ్యబోధన వల్లగానీ, ఒక ప్రామాణిక అంశాన్ని బోధించడం వల్ల గానీ లభించే అంత్య ఉత్పాదనను 'బోధనా లక్ష్యం' అంటారు.
🔹ఉదా: విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ భావనను అవగాహన చేసుకోవడం.
👉విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులను సూచించేవి - స్పష్టీకరణలు.
🔹విద్యార్థి గడించిన సామర్థ్యాన్ని సూచించేవి, నిర్దిష్ట  అభ్యసన ఫలితాలుగా పిలిచేవి - స్పష్టీకరణలు.
▪ఉదా: విద్యార్థి వృక్షకణం, జంతుకణాలకు మధ్య భేదాలను గుర్తిస్తాడు.
👉ఉద్దేశాలు స్థూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు.
🔹ఉద్దేశాలకు విశాల పరిధి ఉంటుంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా మానవుడిని తీర్చిదిద్దేట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో సాధించడానికి వీలుగా ఉంటాయి.
🔹లక్ష్యాలు నిర్దిష్టంగా ఉండి స్వల్పకాలంలో సాధించ డానికి వీలుగా ఉంటాయి.
లక్ష్యాలను అధ్యాపకులు విద్యార్థి కేంద్రంగా నిర్ణ యిస్తారు.
👉ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి (గమ్యాలుస ఉద్దేశాలు స లక్ష్యాలు).
స ఆర్.సి. రాస్ ప్రకారం విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం విద్యార్థిలో సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడి పూర్తి మూర్తి మత్వాన్ని అభివృద్ధి చేసేదిగా ఉండాలి.
👉ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక ఆధునిక సమాజంలో మనుగడ సాధించగల వాడిగా విద్యార్థిని తీర్చిదిద్దాలి.
👉సి.పి.ఎస్.నాయర్ ప్రకారం ఉద్దేశాలు, లక్ష్యాలు విషయ బోధన ద్వారా విద్యార్థి పెరుగుదలకు దోహదం చేసేవిగా ఉండాలి. ఉద్దేశాలను, లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు, అభ్యసనకు సంబంధించిన మానసిక అంశాలనూ, బోధనా పద్ధతులకు చెందిన సూత్రాలనూ, అభ్యాసకుడి దశను గుర్తుంచుకొని, మూల్యాంకనం చేయడానికి వీలైన లక్ష్యాలనే ఎన్నుకోవాలి.

👉నేషనల్ సొసైటి ఫర్ సైన్స్ 59వ వార్షిక పుస్తకం ప్రకారం ప్రతి ఒక్కరికి శాస్త్రపరిజ్ఞానం అవసరం. తద్వారా శాస్త్రమంటే ఏమిటో సరైన అవగాహన ఏర్పడుతుంది.

👉నేషనల్ సొసైటి ఫర్ ది స్ట్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి సూచనలు చేసింది.
🔹తరగతి గదిలో ఉపాధ్యాయుడు అమలుపరచడానికి వీలుగా ఉండాలి.
🔹తార్కికంగా ఒక దశ నుంచి మరొక దశకు వృద్ధి చెందేట్లు ఉండాలి.
🔹పరమ లక్ష్యసాధనకు తోడ్పడేట్లు ఉండాలి.
🔹విద్యార్థి ప్రవర్తన రూపంలో చెప్పాలి.
🔹మానసికంగా సరైనవిగా ఉండాలి.
🔹సాధారణ పరిస్థితుల్లో లక్ష్యాలు సాధించేట్లుగా ఉండాలి.
🔹ప్రజాస్వామ్యయుత సంఘంలో లక్ష్యాలకు సార్వజనీనత ఉండాలి.
🔹తరగతిలో విద్యార్థి చేయవలసిన కృత్యాలు స్పష్టంగా నిర్దేశించేట్లు ఉండాలి.

👉థర్బర్, కోలెట్టె సూచనలు
🔹ఉపయోగత్వం: కోరదగిన అభ్యాసనాలు నిజ జీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలి.
🔹సమకాలీనత: లక్ష్యాలు వర్తమానానికి సంబంధించినవై ఉండాలి.
🔹అనువు: ప్రధాన లక్ష్యాన్ని చేరడానికి అనువైన రీతిలో లక్ష్యాలు తోడ్పడాలి.
🔹అనుగుణ్యత: విద్యార్థుల స్థాయికి, వారి పూర్వ జ్ఞానానికి తగినట్లు ఉండాలి.
🔹ఆచరణయోగ్యత: విద్యార్థి అభివృద్ధికి తగిన అనుభవాలను కలగజేయడానికి వీలుగా ఉండాలి.

👉1948లో బోస్టన్‌లో జరిగిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల సమావేశంలో విద్యాలక్ష్యాలను విభజించాలనే ఆలోచన ఏర్పడింది.
🔹లక్ష్యాలను విభజించడంలో విద్యావిషయక, తార్కిక, మానసిక ఆధారాలుండాలని నిర్ణయించడమైంది. బి.ఎస్.బ్లూమ్స్ లక్ష్యాలు
1956లో విద్యావిషయక లక్ష్యాలను మూడు ప్రధాన రంగాలుగా విభజించారు. అవి:
🔹జ్ఞానరంగం తలకు సంబంధించింది. ఇందులోని లక్ష్యాలను బి.ఎస్. బ్లూమ్స్ వివరించారు.
ప్రజ్ఞ సామర్థ్యాలు, సమస్యల పరిష్కారాలకు, ఆలోచనలకు సంబంధించిన రంగం జ్ఞానరంగం.
🔹జ్ఞానరంగంలో జ్ఞానానికి సంబంధించి జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, జ్ఞానసామర్థ్యాన్ని పెంచు కోవడం అనే లక్ష్యాలను చేర్చారు.
🔹జ్ఞానం అనేది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం.
జ్ఞానం అంటే
🔹నిర్దిష్టమైన, అసంయుక్తాత్మకం అయిన సత్యాలు, సమాచారం.
🔹శాస్త్రీయ పారిభాషిక పదజాలం
ఉదా: బలం అంటే ఏమిటి?
🔹సంఘటనలు, తారీఖులు, వ్యక్తులు- విషయ సేకరణ ఆధారాలు.
ఉదా: విద్యాలక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది?
🔹పద్ధతులు, క్రమానుగతాలు
వ్యవస్థీకరణకు మార్గాలు
వర్గీకరణలు - వర్గాలు
సత్యాలు, భావనలు, సూత్రాలు పరీక్షించి నిర్ణయించడానికి ఉపయోగపడే లక్షణాలు.
🔹బోధనా పద్ధతులు
విశ్వజనీనమైన అంశాలు – విషయతత్వాలు
సూత్రాలు- సాధారణీకరణాలు వాటి మధ్య పరస్పర సంబంధాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం జ్ఞానం అనవచ్చు

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section