Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ సాహిత్యంలో మైలురాళ్ళు

🔹తెలంగాణ తొలి గ్రంథం గుణాఢ్యుడు రచించిన ''బృహత్కథ''. ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఫలితాల ప్రకారం గుణాఢ్యుడు మెదక్‌ జిల్లా కొండాపుర వాసిగా పరిగణిస్తున్నారు.

🔹హాలుడు సంకలించిన గ్రంథం ''గాథాసప్తశతి''. ఈ రెండు గ్రంథాలు క్రీ.పూ. ఒకటో శతాబ్దంలో వెలువడి నాయి. ఈ రెండు గ్రంథాలు ప్రాకృతంలో ఉన్నాయి.
🔹* పంపకవి రచించిన 'జినేంద్ర పురాణం' తెలుగులో తొలి కావ్యం. అయితే ఇది అలభ్యం. పంపకవి కన్నడంలో రాసిన విక్రమార్జున విజయం, ఆదిపురాణం రచించారు. కన్నడంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందారు.
🔹* మల్లియరేచన రచించిన 'కవిజనాశ్రయం' తొలి తెలుగు కావ్యంగా పేరొందింది. రేచనకు 'శ్రావకాభరణుడు' అనే బిరుదు వుంది. కవిజనాశ్రయంలో లక్షణ పద్యాలన్నీ కందంలో ఉన్నాయి.
🔹* పాల్కుర్కి సోమనాథుడి కన్నా ముందే తెలుగులో రచనలు చేసిన కవి రేచన. తొలి తెలుగు వీరశైవ కవి - మల్లికార్జున పండితుడు. శివతత్త్వసారము, శ్రీగిరి మల్లికార్జున శతకము ఇతని తెలుగు రచనలు. శివతత్త్వసారములో 489 కంద పద్యాలున్నాయి.
🔹 పాల్కుర్కి సోమనాథుడు (119-1270) - వరంగల్‌ జిల్లా జనగామ దగ్గరిలోని పాలకుర్తి గ్రామంలో జన్మించారు. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో రచనలు చేశారు.
🔹* సోమన తొలి రచన: అనుభవసారము.
🔹* ఇతని తొలి దేశి ద్విపద పురాణం: బసవ పురాణం.
🔹* సోమన ఇతర రచనలు
* వృషాధిపశతకం, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, బసవోదాహరణం.
* పురాణాన్ని మొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేసినవారు మారన. మార్కండేయ పురాణం రాశారు. మనుచరిత్ర, హరిశ్చంద్ర చరిత్ర వంటి కావ్యాలకు ఆధార గ్రంథం ఈ మార్కండేయ పురాణం.
* సంస్కృతంలో అలంకార శాస్త్ర గ్రంథం రచించిన తొలి తెలుగు అలంకారికుడు విద్యానాథుడు
* తొలి తెలుగు జంట కవులు - కాచభూపతి, విట్టల రాజులు. రామాయణంలో ఉత్తరకాండను రచించారు.
* తెలుగు సాహిత్యంలో తొలి సంకలన గ్రంథం 'సకల నీతి సమ్మతం'. సంకలనకర్త మడికి సింగన (1350)
* తొలి యక్షగానం 'సారంగధర చరిత్ర' రచించిన వారు ఒకటవ సింగభూపాలుడు. రేచర్ల పద్మనాయకుల రాజులలో ఒకరు.
* 1వ అనపోతానాయకుడు రచించిన నాటకం అభిరామ రాఘవం
* రెండో సింగభూపాలుడు రచించిన రసార్ణవ సుధాకరం గొప్ప అలంకార శాస్త్ర గ్రంథం. వీరే సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథం, రత్న పాంచాలిక అనే నాటకాన్ని రచించారు.
* స మాధవ భూపాలుడు వాల్మీకి రామాయణానికి రాఘవీయమనే వ్యాఖ్యను రచించారు.
* స నూతన కవి సూరన (1400-1475) రచించిన 'ధనాభిరామం' తొలి ప్రబంధం. పింగళి సూరన 'కళాపూర్ణోదయం' కన్నా ముందుగా వెలువడిన ప్రబంధమిది.
* బంధ కవిత్వ ప్రక్రియకు, చమత్కార కవిత్వానికి ఆద్యుడు భైరవకవి (1400-1475)
* తొలి వచన రచన, తొలి చారిత్రక గ్రంథం 'ప్రతాపరుద్ర చరితం'. ఏకామ్రనాథుడు (1450-1550) రచించారు.
* ప్రబంధ కవితకు మార్గదర్శి చరిగొండ ధర్మన (1480-1530). ఆయన రచించిన గ్రంథం 'చిత్రభారతం'.
* కందూరు చోళుల వంశానికి చెందిన గోకర్ణుడు (క్రీ.శ. 1109-1136) - గోకర్ణ ఛందస్సు, ఉదయాదిత్యుడు (1136-1176) - ఉదయాదిత్యాలంకారం రచించారు.
* రావిపాటి త్రిపురాంతకుడు - ప్రేమాభిమాని
* రుద్రదేవుడు - నీతిసారం
జాయపసేనాని - నృత్యరత్నావళి
* గోన బుద్ధారెడ్డి - ద్విపద రామాయణం
* కృష్ణమాచార్యులు - సింహగిరి వచనాలు. మతవ్యాప్తి కోసం వచనాలను మొదట రాశారు.
1. పొన్నెగంటి తెలగన్న - యాయతిచరిత్ర - 16వ శతాబ్దం
2. మరింగంటి సింగరాచార్యులు - శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కళ్యాణం - 16వ శతాబ్దం
3. మరింగంటి నరసింహాచార్యులు - చిలువ పడిగె ఱేని చరితము - 17వ శతాబ్దం
4. సంబరాజు రామచంద్రకవి (1810) - సుపాణినీ పరిణయము
5. తూము రామదాసు (1856-1904) - ఆంధ్ర పద నిదానము (అచ్చ తెనుగు నిఘంటువు)
6. న.చ. ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు - 20వ శతాబ్దం - అచ్చతెనుగు కుబ్జాకృష్ణవిలాసం (1932) ముద్రితం
శుద్ధాంధ్ర నిర్గద్య నిరోష్ఠ్య కేకయ రాజనందన చరిత్ర (అముద్రితం)
శుద్ధాంధ్ర రామాయణ సంగ్రహం (అముద్రితం)
గడ్డం రామదాసు - భక్త వినతి
వట్టెం పాపకవి 'వేల్పు' శతకం
మణిహరి గోపాల సూరి - శ్రీ వేంకటేశ్వర శతకము
కూడా అచ్చతెనుగు రచనలే. కానీ ఈ మూడు అలభ్యం.
1. బమ్మెర పోతన - నారాయణ శతకం
2. రావిపాటి త్రిపురాంతకుడు - అంబికా శతకం
3. కంచర్ల గోపన్న - దాశరథీ శతకం
4. బద్దె భూపాలుడు - సుమతి శతకం
5. కృష్ణభక్తుడు సంజీవ కవి - వీరనారాయణ శతకం
6. ధర్మపురి శేషప్ప కవి - నరసింహ శతకం
7. సంగభట్టు నరసింహరాజు - శ్రీ యాదగిరీశ్వర స్తోత్రరత్నము
8. చొల్లేటి నృసింహశర్మ - యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం
9. ఒద్దిరాజు సీతారామచంద్రరావు - లోకేశ్వర శతకం
10. దూపాటి వెంకటరమణాచార్య - రంగధామ శతకం
11. నల్లందిగళ్‌ చక్రవర్తుల ఠంయ్యాల లక్ష్మీ నరసింహా చార్యులు - ముకుంద శతకం, రమేశ శతకం
12. ముదిగొండ వీరలింగేశ్వర శాస్త్రి - అగస్త్యేశ్వర శతకం
13. ముదిగొండ శంకరాధ్యులు - భావలింగ శతకం, మల్లికార్జున శతకం
14. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య - అంతర్మథనం
15. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు - పాంచాలరాయ శతకం
ఈవిధంగా తెలంగాణలో అనేకులు శతకాలు రచించారు. ఈనాటికీ శతకాలు రచించే ఉపాధ్యాయులు, పండితు లు వివిధ జిల్లాల్లో ఉన్నారు. పాల్కూర్కి సోమన (వృషాధిప శతకం)తో ఆరంభమైన శతకరచన కొత్తపుంతలు తొక్కుతూ ఈనాటికీ ఒక సాహిత్య ప్రక్రియగా విలసిల్లుతున్నది.
అవధానం చతుష్షష్టి కళల్లో ఒకటిగా కొఱవి గోపరాజు గ్రంథం 'సింహాసన ద్వాత్రింశక'లో చెప్పారు. ఎనిమిది మంది మొదలుకొని దాదాపు వందమంది వరకు అడిగేవాటికి కవితారూప సమాధానం ఆశువుగా చెప్పడం అవధానాల్లో ప్రముఖమైంది. కనుకనే అష్టావధానం, శతావధానం తరువాత ద్విగుణిత, చతర్గుణిత, దశగుణిత, సహస్ర, ద్విసహస్ర, పంచసహస్ర మొదలైన అవధానాలు కూడా కొందరు చేశారు. అయితే అష్టావధానం, శతావధానం ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
ఇప్పటివరకు పరిశోధకుల విశ్లేషణల ప్రకారం కాకతీయ ప్రతాపరుద్రుని పాలనా కాలంలో మొదటి శతావధానం జరిగిందని భావిస్తున్నారు. తొలి శతావధానం క్రీ.శ. 1285లో కాకతీయుల ఆస్థానంలో జరిగిందని, కొల్లచెల్లు వంశీయుడైన మల్లినాథుడు ఈ శతావధానం నిర్వహించాడని చెబుతున్నారు.
తెలంగాణ ప్రాచీన కావ్యాలలో అవధానాల ప్రస్తావన వుంది. కందనామాత్యుడు అనే కవి తన 'నీతితారావళి'లో ఆశుకవిత్వాన్ని గురించి ప్రస్తావించారు. అలాగే చరిగొండ ధర్మన్న (1500-1580) ప్రాంతంలో తన గ్రంథం 'చిత్రభారతం' లోనూ దీని ప్రస్తావన వుంది.
సురవరం ప్రతాపరెడ్డి సంకలనం చేసిన 'గోలకొండ కవుల సంచిక'లో కొందరు అవధాన కవులున్నారు.
1. విఠాల చంద్రమౌళి శాస్త్రి: మెదక్‌ జిల్లా, సిద్ధిపేట తాలూకా, గజవెల్లి గ్రామం.
2. నేరెళ్ళ వేంకటాచార్యులు: కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి తాలూకా, బందలింగాపురం సంస్థానంలో ఉండేవారు.
3. శ్రీహరి రామలింగశాస్త్రి: ఓ జంటకవితో కలిసి కొన్ని రచనలు చేశారు. అవధానాలు చేశారు.
4. వీరపల్లి నృసింహాచార్యులు: వరంగల్‌ జిల్లా మడికొండ గ్రామవాసి.
5. బుక్కపట్టణము రామచంద్రకవి: కొన్ని కావ్యాలు రచించారు. ఆశువుగా కవిత్వం చెప్పారు.
1. ధప్పూరి సత్యనారాయణాచార్యులు: కరీంనగర్‌ జిల్లా బిజవెంగి గ్రామం. బెజ్జంకి నృసింహాలయ అర్చకులుగా ఉన్నారు. అవధానాలు చేశారు.
2. నెమలికండ శ్రీరంగాచార్య శాస్త్రి
3. బండి వెంకటరామారెడ్డి: వరంగల్‌ జిల్లా మధిర తాలూకా
4. అచివేంకట నృసింహాచార్యులు: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకా, అవునూరు గ్రామానికి చెందినవారు. అనేక అవధానాలు చేశారు.
5. శిరిశినహళ్‌ కృష్ణమాచార్యులు
6. టి.కృష్ణశాస్త్రి: కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్ల తాలూకా వెదిరె గ్రామ నివాసి. అష్టావధానాలు చేశారు.
7. తిరువరంగం పాపయ్యశాస్త్రి : కరీంనగర్‌ జిల్లా, మంథనికి చెందినవారు. కొన్ని అవధానాలు చేశారు.
8. చింతామణి నరసింహాచార్యులు: 12 కావ్యాలు రాశారు.
9. యామవరం రామశాస్త్రి: మెదక్‌ జిల్లా కుక్కునూను గ్రామానికి చెందినవారు
10. బెల్లంకొండ నరసింహాచార్యులు: కొన్ని అవధానాలు చేశారు.
11. వేంకటరాజన్న అవధాని: కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందినవారు.
12. పేరక రంగాచార్యులు: సంగీతాష్టావధాని. హైదరాబాద్‌ గౌలిగూడ వాసి.
13. పోనుగోటి ఆనందమాంబ: కరీంనగర్‌ జిల్లా
ఈవిధంగా గోలకొండ కవుల సంచికలో అనేకమంది అవధానుల కవిత్వం వుంది. వీరు చేసిన అవధానాల గురించి వివరంగా పరిశోధనలు చేయాల్సివుంది.
శేషాద్రి రమణ కవులు: వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌ ప్రాంతాలలో శతావధానాలు నిర్వహించారు.
శిరిశినహళ్‌ కృష్ణమాచార్య (1905-1986): శతావధాని : నిజాం రాష్ట్రంలో ఆద్యశతావధానిగా పేరు పొందారు. వీరి పూర్వీకులు కరీంనగర్‌ జిల్లా మంథని వాస్తవ్యులు.
తెలంగాణలో అవధానాలు చేయడం ద్వారా ప్రఖ్యాతి పొందినవారిలో ఆచి వేంకట నృసింహాచార్యులు, మామిడిపల్లి సాంబశివశర్మ, గౌరీభట్ల రామకృష్ణశర్మ, దూపాటి సంపత్కుమారాచార్యులు, దోర్బల ప్రభాకర శర్మ, అష్టకాల నరసింహ రామశర్మ, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, డా. అందె వేంకటరాజం, పార్వెళ్ళ గోపాలకృష్ణశర్మ, డా. ఇందారపు కిషన్‌రావు, ఆరుట్ల రంగచార్యులు, తిగుళ్ళ శ్రీహరిశర్మ, ప్యారకశేషా చార్యులు, పరిమి రామనరసింహం, ముద్దు రాజయ్య, ఆయాచితం నటేశ్వరశర్మ, గౌరీభట్ల మెట్టు రామశర్మ, గౌరీభట్ల రఘురామశర్మ మొదలైన ప్రముఖులు ఉన్నారు. ధారణ, జ్ఞాపకశక్తి, కవితాభ్యాసం వల్ల అవధానం చేయడం సాధ్యమవుతుంది. ఈ దిశగా దృష్టి పెట్టడం వల్లనే ఇది నెరవేరుతుంది. తెలంగాణలోని అవధాన కవుల గురించి ఇంకా విశేషమైన పరిశోధనలు జరిగితే తెలంగాణ సాహిత్య ప్రపంచంలో అవధానం ప్రత్యేకత తెలుస్తుంది.
*1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?*
డల్హౌసీ విద్యా సంస్కరణలకు సహకరించిన అధికారి? - చార్లెస్ ఉడ్
మాగ్నాకార్టాగా పేర్కొనే విద్యా ప్రణాళిక?
- చార్లెస్ ఉడ్ ప్రణాళిక
భారత్‌లో తొలి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించినవారు? - డల్హౌసీ
భారతీయ మగ్గాలపై ఆంగ్లేయులు విధించిన పన్ను? - మోతుర్పా
ఐసీఎస్‌కు ఎన్నికైన తొలిభారతీయుడు?ఙ- సత్యేంద్రనాథ్ ఠాగూర్
గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని తొలి న్యాయశాఖ సభ్యుడు ఎవరు? - మెకాలే
భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం? - 1835
హంటర్ కమిషన్‌ను 1882లో నియమించిన వైస్రాయ్? - లార్‌‌డ రిప్పన్ కిత్తురు రుగుబాటుకు నాయకత్వం వహించిన స్త్రీ? - రాణీ చెన్నమ్మ
1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నవారు?
- వి.డి.సావర్కర్
వి.డి. సావర్కర్ 1857 తిరుగుబాటుపై రచించిన గ్రంథం?
- ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్‌‌స
క్రైస్తవ మత ప్రచారానికి అవకాశం కల్పించిన చట్టం? - 1813 చట్టం
మొట్టమొదటి సిపాయి తిరుగుబాటు జరిగిన సంవత్సరం? - 1806 (వేలూరు)
1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం? - మీరట్ (ఉత్తరప్రదేశ్)
1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?- 1857 మే 10
తాంతియాతోపే అసలు పేరు- రామచంద్ర పాండురంగ
లక్ష్మీబాయి అసలు పేరు?
- మణికర్ణిక (మనూబాయి)
ఝాన్సీ లక్ష్మీబాయి భర్త, ఝాన్సీ పాలకుడు? - గంగాధర్‌రావు
ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్ల సేనాని? - సర్ హ్యూగ్ రోజ్
ఈస్టిండియా కంపెనీ పాలన అంతరించిన సంవత్సరం? - 1858
హత్యకు గురైన ఏకైక వైస్రాయ్? - మేయో
ముస్లింలీగ్ పార్టీ కాంగ్రెస్‌తో చేసుకున్న ఒడంబడిక? - లక్నో ఒడంబడిక
హోంరూల్ ఉద్యమాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు?
- బాల గంగాధర్ తిలక్
1916 ఏప్రిల్‌లో బాలగంగాధర్ తిలక్ హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? - పూనా నుంచి
హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్ ఇచ్చిన నినాదం? - స్వరాజ్యం నా జన్మహక్కు
హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్‌కు ఇచ్చిన బిరుదు? - లోకమాన్య
హోంరూల్ ఉద్యమ కాలం నాటి వైస్రాయ్?ఙ- ఛేమ్స్‌ఫర్‌‌డ
నాసిక్ కుట్ర కేసులో ఎవరికి ఉరి శిక్ష విధించారు? - అనంత లక్ష్మణ్
అరవింద ఘోష్ సోదరుడు?
- బదీంద్ర ఘోష్
అలీపూర్ బాంబ్ కేసులో ప్రధాన ముద్దాయి? - అరవింద్ ఘోష్
లండన్‌లో ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక ద్వారా విప్లవాన్ని ప్రచారం చేసినవారు? - శ్యాంజీ కృష్ణవర్మ
గదర్ పార్టీ ఏర్పడిన సంవత్సరం? - 1913
గదర్ అంటే అర్థం? - తిరుగుబాటు
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జన్మదినం? - 1869 అక్టోబర్ 2 (గుజరాత్‌లోని పోరుబందర్‌లో) దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన పత్రిక
- ఇండియన్ ఒపీనియన్
భారత్‌లో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక? - న్యూ ఇండియా తిలక్ జన్మించిన ప్రదేశం? - పూనా 1906లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను ప్రారంభించినవారు? - బాల గంగాధర్ తిలక్
ఆనంద్‌మఠ్ గ్రంథం రచించినవారు?ఙ- బకిం చంద్ర ఛటర్జీ (1882)
బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని స్థాపించినవారు? - ప్రఫుల్ల చంద్రరాయ్
స్లింలీగ్ పార్టీని స్థాపించిన సంవత్సరం? - 1906 సాధుజన పరిపాలనా సంఘం స్థాపకులు? - అయ్యంకాళి
సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మితవాద నాయకుడు? - రాస్ బిహారీ ఘోష్
తిలక్ నాయకత్వంలో అతివాదులు ఏర్పరచుకున్న పార్టీ? - నేషనల్ పార్టీ
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచిన చట్టం? - 1909 చట్టం
1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు? - మదన్ మోహన్ మాలవ్య
హోంరూల్ ఉద్యమ నాయకులు?
- బాలగంగాధర తిలక్, అనీబిసెంట్
తిలక్.. మాండలే జైల్లో ఉన్న కాలం?
- 19081914
బెంగాల్ గెజిట్‌ను స్థాపించినవారు?ఙ- జేమ్స్ అగస్టస్ హిక్కీ
కేశవ చంద్రసేన్ స్థాపించిన ఆంగ్ల పత్రిక?
- ఇండియన్ మిర్రర్ (ఆంగ్లంలో తొలి దినపత్రిక) తెలుగులో తొలి పత్రిక? - సత్యదూత (బళ్లారి క్రైస్తవ సంఘం స్థాపించిన ఈ పత్రిక 1835లో వెలువడింది)
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ముస్లిం? - బద్రుద్దీన్ త్యాబ్జీ
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు, తొలి విదేశీయుడు, తొలి క్రైస్తవుడు? - జార్జి యూల్
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు? - పి. ఆనందాచార్యులు
గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం? - బెల్గాం (1924)
జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ?
- సరోజినీ నాయుడు
కాంగ్రెస్ చరిత్రను రచించినవారు?
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నా పదవీ కాలంలో అది సులభంగా చనిపోయేందుకు సాయపడటమే నాకున్న పెద్ద కోరిక అని ప్రకటించిన వైస్రాయ్?
- కర్జన్
బెంగాల్‌ను విభజించిన వైస్రాయ్కర్జన్ (1905, జూలై 20న)
బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన r తేదీ?- 1905, అక్టోబర్ 16
లాలా లజపతిరాయ్ బిరుదు?- పంజాబ్ కేసరి
1926లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో par పాల్గొన్నవారు?ఙ- లాలా లజపతిరాయ్
లాలా లజపతిరాయ్ నడిపిన పత్రికలు?
- 1. వందేమాతరం (ఉర్దూ)
2. పీపుల్ (ఇంగ్లిష్)
జ్యోతిరావు పూలే నాకు స్ఫూర్తిప్రదాత అని ప్రకటించిన మేధావి? - బి.ఆర్. అంబేద్కర్
ఆర్యసమాజ స్థాపకుడు?ఙ- స్వామి దయానంద సరస్వతి (1875లో)
ఆర్యసమాజానికి ప్రామాణిక గ్రంథం?ఙ- సత్యార్థ ప్రకాశిక
స్వామి దయానంద సరస్వతి తొలి సందేశాన్ని వినిపించిన par ప్రాంతం?ఙ- హరిద్వార్
స్వామి వివేకానంద అసలు పేరు?
- నరేంద్రనాథ్ దత్తా
భారతదేశం నా స్వర్గం, భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు, భారతీయుడనని గర్వించు, ప్రతి భారతీయుడు నా సోదరుడే అని సగర్వంగా ప్రకటించు.. అని జాతీయతను par ప్రబోధించినవారు?ఙ- స్వామి వివేకానంద
భారత్‌లో దివ్యజ్ఞాన సమాజ తొలి శాఖ ఏర్పడిన ప్రాంతం? - బొంబాయి (1879)్యూయార్‌‌క నుంచి దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయాన్ని మార్చిన ప్రాంతం? - అడయార్ (తమిళనాడు)
బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన సంవత్సరం? - 1916
అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు?ఙ- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం? - 1920
గాంధీజీ వద్దకు రాయబారిగా వైస్రాయ్ హార్డింజ్ ఏ మితవాద నాయకుడిని పంపించారు? - గోపాలకృష్ణ గోఖలే
గాంధీజీ గురువు? - గోపాలకృష్ణ గోఖలే
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన సంవత్సరం? - 1915 (జనవరి 9)
జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన రోజు? - 1919, ఏప్రిల్ 13 (వైశాఖ పౌర్ణమి రోజున)
జలియన్ వాలాబాగ్ సంఘటనపై విచారణ జరపడానికి నియమించిన కమిషన్?
- హంటర్
జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు? - సర్ శంకరన్ నాయర్
జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం పంజాబ్‌లో సైనిక శాసనాన్ని అమలు చేసి, అనేక మందికి మరణ శిక్షలు విధించిన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్?
- మైకేల్-ఓ-డయ్యర్
మైకేల్-ఓ-డయ్యర్‌ను లండన్‌లో కాల్చి చంపిన యువకుడు? - ఉద్దంసింగ్
సహాయ నిరాకరణోద్యమ కాలంలో గాంధీ వదులుకున్న par బిరుదు?ఙ- కైజర్-ఎ- హింద్
చౌరీ చౌరా సంఘటన జరిగిన , ఫిబ్రవరి 5
విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఆమోదించిన జాతీయ జెండా రూపకర్త? - పింగళి వెంకయ్య
తెలంగాణ హిస్టరీ
శాతవాహన వంశ స్థాపకుడు?
- శ్రీముఖ శాతకర్ణి
మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు? - వి.ఎ. స్మిత్
శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం? - మత్స్య పురాణం

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section