Type Here to Get Search Results !

Vinays Info

విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు

👉విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు:

🔹అనేక రకాలైన ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులను రూపొందించడం జరిగింది. ఈ పద్ధతులను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు.

🔹అవి: 1. అంతఃపరీక్షణ పద్ధతి, 2. పరిశీలనా పద్ధతి, 3. ప్రయోగాత్మక పద్ధతి, 4. వ్యక్తి అధ్యయన పద్ధతి.

⚫అంతఃపరీక్షణ పద్ధతి:

🔹అంతఃపరీక్షణ పద్ధతి ని ప్రవేసపెట్టిన శాస్త్రవేత్త సెయింట్ ఆగస్టీన్.
🔹ఇతను ఈ పద్ధతి ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు.
🔹కొన్నిసార్లు మనము ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభూతులు కలుగుతాయి వీటిని మనము పరీక్షించాడాన్ని అంతః పరీక్షనమని చెప్పవచ్చు.
🔹ఏదైనా ఉద్దీపన మన మీద ప్రభావాన్ని చూపినప్పుడు మనం ప్రతిస్పందిస్తుంటాం.
🔹మన అనుభూతి లేదా అనుభూతులను రాత పూర్వకంగా గాని లేదా నోటి ద్వారా గాని తెలియజేసినట్లయితే అంతః పరీక్షణా నివేదిక అని అంటారు.
🔹ఈ పద్దతిలో పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి ఒక్కరే.
🔹ఊంట్ తన ప్రయోగశాలలో ఈ పద్దతుని ఉపయోగించి వ్యక్తి చేతనత్వాన్ని పరీక్షించాడు.

➡లోపాలు: 1.వ్యక్తి నిష్టత 2.భాషా లోపాలు 3.ఉద్వేగాల మార్పులు

➡ఉపయోగాలు:

🔹ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు (ఉదా: లైగిక అనుభవం) కూడా ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు.
🔹అంతః పరీక్షన ద్వారా ఒక వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకుని తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచుకోగాలుగుతాడు.
🔹ఉపాధ్యాయుడు అంతః పరీక్షణ ద్వారా తన భోధనలోని లోపాలను తెలుసుకుని నూతన భోధనా పద్దతులను ఉపయోగించగాలుగుతాడు.

2.పరిశీలనా పద్ధతి:

🔹ప్రవర్తనను ఉన్నదున్నట్లుగా గ్రహించడమే పరిశీలనా అని చెప్పవచ్చు. ఇతరులు వ్యక్తపరిచే ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించడం ఈ పద్ధతి ముఖ్యలక్షణం.
🔹అంటే ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను లేదా ప్రవర్తన అంశాలను పరిసీలింకాహ్డం జరుగుతుంది.
🔹పరిశీలనా పద్దతులు సాధారణం గా నాలుగు రకాలు అవి :
1.సహజ పరిశీలన.  2. నియంత్రిత పరిశీలన 3.సంచరిత పరిశీలన, 4.అసంచరిత పరిశీలన.

🔹1. సహజ పరిశీలన:
🔹పరిశీలన అంశాలు సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిసీలించడాన్ని ‘సహజ పరిశీలన’ అంటారు.
🔹సహజ పరిశీలనలో పరిశీలింప బడే వారికి తాము పరిశీలింప బడుతున్నామని తెలియదు, తెలియకూడదు.

2. నియంత్రిత పరిశీలన:
🔹సహజ పరిస్థితులు ఏర్పడడం చాలా అరుదు.
ఈ పద్దతిలో కృత్రిమంగా పరిశీలనా సన్నివేశాలు కల్పించి, ఆయా సన్నివేశాలలో ప్రవర్తనను గమనించడం జరుగుతుంది.
🔹ఈ పరిశీలనలో తాము పరిశీలించబడుతున్నమనే విషయం ప్రయోజ్యుడికి తెలిసే ఉంటుంది.

3.సంచరిత పరిశీలన:
🔹ఈ రకమైన పరిశీలనలో పరిశీలకుడు సన్నివేశంలో తాను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్దతతో నిశితంగా చూడడాన్ని సంచరిత పరిశీలన అంటారు.

4.అసంచరిత పరిశీలన:

🔹ఈ పరిశీలనలో పరిశీలకుడు సన్నివేశంలో ప్రత్యక్షం గా పాల్గొనకుండా దూరంగా  ఉండి తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను వారికి తెలియకుండా పరిసీలించాదాన్ని .అసంచరిత పరిశీలన అంటారు.
ముఖ్యంగా పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.

🔹గెసెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్సర్వేషన్ డోమ్ ని అమర్చాడు.

🔹లోపాలు:
నియంత్రిత పరిస్థితుల వల్ల సహజత్వం కోల్పోయే అవకాసం ఉంది.
ప్రమాదాలు మొదలైన వాటి విషయంలో నియంత్రిత సన్నివేశాలు కల్పించి ఫలితాలు సాధించడం సాధ్యపడదు.

🔹ఉపయోగాలు:
నియంత్రిత పరిశీలనా వల్ల అరుదైన పరిస్థితులను కల్పించి కాలయాపన లేకుండా పరిశీలనంశాలను అధ్యయనం చేయవచ్చు.

🔹పరిశీలనా పద్దతిని ఉపయోగించి చిన్నపిల్లల, అసాధారణ వ్యక్తుల, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు.

👉పరిశీలనా పద్ధతి విద్యా ఉపయోగాలు:

🔹అసాధారణ ప్రవర్తనకు కారణాలను అన్వేషించవచ్చు.
🔹అసాధారణ శిశువులను, ప్రజ్ఞావంతులను, వెనుకబడిన వారిని, మందబుద్ధులను పరిశీలించి తగిన చర్యలను చేపట్టవచ్చు.

3. ప్రయోగాత్మక పద్ధతి:

🔹ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయోగపద్దతిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్దతిగా చెప్పవచ్చు.
🔹ఎవరి మానసిక లేదా ప్రవర్తనా లక్షణాలను అధ్యయనం చేయదలచామో వారిని లేదా వాటిని శాస్త్రీయంగా పరీక్షించడానికి చేసే ప్రయత్నమే ప్రయోగం అని చెప్పవచ్చు.లేదా ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగం అనవచ్చు.

🔹ప్రయోగాపద్దతిలో కొన్ని పదాలు: 1.ఉద్దీపన, 2.ప్రతిస్పందన, 3.ప్రయోక్త,4.ప్రయోజ్యుడు, 5.చరాలు, 6.సమూహాలు, 7.నమూనాలు..
ఉద్దీపన: ప్రవర్తనా మార్పుకు దోహదపడేది.

👉ప్రతిస్పందన: ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్యే ప్రతిస్పందన.

👉ప్రయోక్త/పరిశోధకుడు: ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో వారిని ప్రయోక్త లేదా పరిశోధకుడు అంటారు.

👉ప్రయోజ్యుడు: ఎవరి మీద ప్రయోగం నిర్వహిస్తున్నమో వారిని ప్రయోజ్యుడు అంటారు.

👉చరాలు: చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తానే మారేది అని అర్ధం. చరాలు సాధారణం గా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి. ఎ) స్వతంత్ర చరం, బి) పరతంత్ర చరం. సి) మధ్యస్త చరం.
ఎ) స్వతంత్ర చరం:
ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలనుగానీ, ఉద్దేపింపజేసే పరిస్థితులను గాని తాను పరీక్షించ దలచుకున్న పద్దతిలో మలచుకోవదాన్ని స్వతంత్ర చరం అంటారు.
స్వతంత్ర చరాలు ఎప్పుడూ ప్రయోక్త ఆదీనంలో ఉంటాయి.
ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చును.
బి) పరతంత్ర చరం:
పరిశోధకుని అదుపులో ఉన్న చరాన్ని స్వతంత్ర చరమనీ దాని ప్రభావానికి లోనయ్యే చరాన్ని పరతంత్ర చరమనీ  అంటారు.
స్వతంత్ర చరాలకు ప్రయోజ్యుని ప్రతిస్పందనే

👉పరతంత్ర చరం.
ఈ ప్రతిస్పందనలు స్వతంత్ర చారాల మీద ఆధారపడతాయి.
అభ్యసించడంలో వేగం, ప్రతిచార్యాకాలం, ప్రయోజ్యుల అనుభవాల వివరణ మొదలైనవి కొన్ని ఉదాహరణలు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section