Type Here to Get Search Results !

Vinays Info

పాబ్లో పికాసో | Fablo Picasso - VINAYSINFO

పాబ్లో పికాసో
జయంతి సందర్భంగా...
🔸స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు.పింగాణి తోకూడా పికాసో అద్భుతమైన కళాఖండాలను సృష్టించాడు.

🔸ఇతడు1881లో స్పెయిన్ లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు .

🔸అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. .

🔸1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'...

🔸1937 ఏప్రిల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం.

🔸దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.

🔸లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.

🔸1962 లో అతడు ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్(International Lenin Peace Prize)నుఅందుకొన్నాడు.

🔸'బూడిద రంగు దుస్తుల్లో కూర్చున్న మహిళ’ పేరుతో విఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో 1943లో గీసిన చిత్రమిది. గురువారం పారిస్ నగరంలో సోత్‌బైస్ సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పెయింటింగ్ రికార్డు స్థాయిలో రూ. 28.4 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం ద్వారా వచ్చే సొమ్మును.. ఆపదలో ఉన్న చిన్నారులను ఆదుకునేందుకు వినియోగిస్తానని ఈ చిత్రాన్ని విక్రయించిన పికాసో మనువరాలు మరీనా తెలిపారు

🔸1973లో తన 91వ సం..లో మరణించాడు
✍ సే: వినయ్ కుమార్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section