🔹మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
🔹గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన మన బతుకమ్మ మురిసి మెరిసిపోయింది.
🔹ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన మహా బతుకమ్మ వేడుకలో ఒకే చోట, ఒకే సారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను ఆడి చరిత్ర సృష్టించారు.
🔹మొత్తంగా 10,029 మంది మహిళలు స్టేడియానికి తరలివచ్చారు. మహా బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో చోటు లభించడంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
🔹కేరళ రాష్ట్రంలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించి చరిత్ర సృష్టించింది.
🔹తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో 20 అడుగులతో బతుకమ్మను పేర్చారు.
🔹స్టేడియం మధ్యలో ఈ 20 అడుగుల బతుకమ్మను ఉంచి దాని చుట్టూ చిన్నపాటి బతుకమ్మలను ఉంచారు.
🔹35 వరుసలలో 2 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఉయ్యాల పాటలతో స్టేడియం మార్మోగిపోయింది.
🔹మహా బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
🔹జోరు వానలోనూ పది వేలమంది మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా ఆడపడుచులు బతుకమ్మ ఆడారు.
🔹 కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చూడముచ్చటగా బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు సందర్భానుసారంగా పాటలు పాడుతూ సందడి చేశారు. కోలాటాలు, డప్పులు, నృత్యాలతో కనువిందు చేశారు ఆడపడుచులు.