వాతావరణం
1. వాతావరణంలో ఉండే వాయువుల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
1) నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, నియాన్
2) నత్రజని, ఆర్గాన్, ప్రాణవాయువు, నియాన్
3) ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువు, ఆర్గాన్, నియాన్
4) ఏదీకాదు
2. ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉండే ప్రదేశం?
1) ధృవాలు 2) భూమధ్య రేఖ
3) ఆయన రేఖ 4) పైవన్నీ
3. వాతావరణంలో మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?
1) ట్రోపో 2) స్ట్రాటో
3) మిసో 4) థర్మో
4. ఏయే ఆవరణల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరుగుతాయి?
1) ట్రోపో, స్ట్రాటో & ఐనో, మిసో
2) స్ట్రాటో, ఐనో & ట్రోపో, మిసో
3) ట్రోపో, మిసో & మిసో, ఐనో
4) ట్రోపో, మిసో & స్ట్రాటో, ఐనో
5. కింది వాటిని జతపర్చండి.
ఆవరణాలు అంశం
1. ఐనో ఆవరణం ఎ. జెట్ విమానాలు, ప్యారాచూట్‌లు, ఓజోన్ పొర
2. మిసో ఆవరణం బి. శీతోష్ణస్థితి, వర్షపాతం
3. స్ట్రాటో ఆవరణం సి. రేడియో తరంగాలు
4. ట్రోపో ఆవరణం డి. ఉల్కలు కాలిపోతాయి
ఇ. అత్యంత ఎత్తైన పొర
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
6. కింది వాటిలో సరికాని వాక్యం?
1. గాలి నిదానంగా వీచి హాయిగా ఉండేది-సమీరం (తెమ్మర)
2. వేగంగా వీచే గాలి - ఈదురు గాలి
3. తీర ప్రాంతంలో వేగంగా వీచే గాలి - పెనుగాలి/తుపాను గాలి
4. తక్కువ పీడన ప్రాంతం నుంచి ఎక్కువ పీడన ప్రాంతం వైపు కదిలే గాలి - పవనం
7. ఉప ఆయన రేఖ వద్ద ఏర్పడిన అధిక పీడన మేఖల రెండు భాగాలుగా చీలి పవనాలను కింది విధంగా ప్రసరింపజేస్తుంది.
1) రెండు భాగాలు ఉపధృవ ప్రాంతం వైపు
2) రెండు భాగాలు భూమధ్య రేఖ ప్రాంతం వైపు
3) ఒక భాగం భూమధ్య రేఖ వైపు, మరొక భాగం ఉపధృవ ప్రాంతం వైపు
4) ఒక భాగం ధృవ ప్రాంతం వైపు, మరొక భాగం ఉపధృవ ప్రాంతం వైపు
8. ఉపధృవ ప్రాంతంలో ఏ పీడన మండలం ఏర్పడుతుంది?
1) అధిక పీడనం 2) అల్పపీడనం
3) 1, 2 4) ఏదీకాదు
9. అధిక పీడన మండలం ఏర్పడే ప్రాంతాలు, అల్పపీడన మండలం ఏర్పడే ప్రాంతాలు?
1. ఉప ఆయనరేఖ, ధృవ & భూమధ్యరేఖ, ఉపధృవ
2. ఉప ఆయనరేఖ, భూమధ్య రేఖ & ధృవ, ఉపధృవ
3. భూమధ్య రేఖ & ఉప ఆయరేఖ
4. ఏదీకాదు
10. ప్రపంచ పవనాలు అంటే?
1) వ్యాపార పవనాలు 2) పశ్చిమ పవనాలు
3) ధృవ పవనాలు 4) పైవన్నీ
11. ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి మాత్రమే పరిమితమై వీచే పవనాలు?
1) ప్రపంచ పవనాలు
2) రుతు పవనాలు
3) స్థానిక పవనాలు 4) ఏదీకాదు
12. మాన్‌సూన్ అనే ఆంగ్ల భాషాపదం, మౌసమ్ అనే ఏ భాషాపదం నుంచి వచ్చింది?
1) ఫ్రెంచ్ 2) అరబిక్
3) గ్రీకు 4) లాటిన్
13. చినూక్, లూ అనేవి ఏ విధమైన పవనాలు?
1) శీతల 2) ఉష్ణ
3) 1, 2 4) ఏదీకాదు
14. లూ అనే ఉష్ణ పవనాలు ఏ దేశంలో వీస్తాయి?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) గుజరాత్ 4) ఉత్తర భారతదేశం
15. కింది వాటిలో శీతల పవనం కానిది?
1) మిస్ట్రాల్ 2) ప్యూనా. 3) పాంపెరో. 4) యోమా
16. జతపర్చండి.
పవనం పేరు. . ప్రాంతం
1. ఫోన్ ఎ. ఫ్రాన్స్, మధ్యదరా సముద్రం, రోమ్
2. సైమూన్ బి. జపాన్
3. మిస్ట్రాల్ సి. యూరప్
4. పాంపెరో డి. అరేబియా ఎడారి
ఇ.దక్షిణఅమెరికా (పంపాలు)
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
2) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
17. వాతావరణంలోని నీటి ఆవిరిని (ఆర్థ్రతను) కొలిచే పరికరం?
1) రెయిన్ గేజ్ 2) ఉష్ణమాపకం
3) ఆర్థ్రతామాపకం 4) థర్మోఫైల్
18. జతపర్చండి.
మేఘం రకం లక్షణం
1. సిర్రస్ మేఘాలు ఎ. మధ్యలో ఉంటాయి
2. క్యుములస్ బి. బాగా ఎత్తులో ఉంటాయి
3. స్ట్రాటస్ సి. కింద స్థాయిలో
4. నింబస్ డి. వర్షం, నిలువు మేఘాలు
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
19. ఏ వర్షపాతాన్ని ఓరోజెనిక్ వర్షపాతం అంటారు?
1) సంవహన 2) పర్వతీయ
3) చక్రీయ 4) పైవన్నీ
20. తుఫాను/అల్పపీడన ద్రోణితో కూడిన వర్షపాతం?
1) సంవహన 2) పర్వతీయ
3) చక్రీయ 4) ఏదీకాదు
21. కింది వాటిలో సరైన వాక్యం?
1) వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకిలేచి చల్లబడినపుడు పడే వర్షం-సంవహన వర్షపాతం
2) తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండవల్ల పైకి లేచినపుడు కురిసే వర్షం - పర్వతీయ వర్షపాతం
3) సాధారణంగా పవనాలు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి - కొరియాలిస్ ప్రభావం
4) వాతావరణంలో సాపేక్ష ఆర్థ్రత 100గా ఉంటే దాన్ని సంతృప్త స్థాయి అంటారు 5) పైవన్నీ సరైనవే
సమాధానాలు:-
~~~~~~~~