భూమి ఆవరణములు
1. లితో అంటే గ్రీకు భాషలో అర్థం?
1) శిల్పం 2) జీవం 3) శిల 4) నీరు
2. నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు అనేవి దేనికి సంబంధించినవి?
1) వాతావరణం 2) శిలావరణం
3) జలావరణం 4) జీవావరణం
3. ఆవిరి అంటే గ్రీకు భాషలో అర్థం?
1) వాతావరణం 2) శిలావరణం
3) జలావరణం 4) జీవావరణం
4. బయోస్ అంటే అర్థం?
1) శిల 2) నీరు 3) ఆవిరి 4) జీవం
5. జీవం అనేది ఏ ఆవరణాన్ని ప్రభావితం చేస్తుంది?
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) పైవన్నీ
6. మహా సముద్రాలు, ఖండాలు ఏ రకమైన భూ స్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
7. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ రకమైన భూ స్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
8. లోయలు, డెల్టాలు (గాలి, నీరువల్ల ఏర్పడే భూస్వరూపాలు) ఏ రకం భూస్వరూపాలు?
1) మొదటి శ్రేణి 2) రెండో శ్రేణి
3) మూడో శ్రేణి 4) నాలుగో శ్రేణి
9. పలకల అంచుల వద్ద ఏర్పడే భూచర్యలు?
1) అగ్ని పర్వతాలు 2) భూకంపాలు
3) 1, 2 4) ఏదీకాదు
10. భూగర్భంలో కరిగిన శిలాద్రవాన్ని ఏమంటారు?
1) లావా 2) మాగ్మా 3) 1, 2 4) ఏదీకాదు
11. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు పెల్లుబికి వచ్చిన శిలాద్రవాన్ని ఏమంటారు?
1) లావా 2) మాగ్మా 3) 1, 2 4) ఏదీకాదు
12. మధ్యదరా సముద్రపు ద్వీపస్తంభం అని ఏ అగ్ని పర్వతాన్ని పిలుస్తారు?
1) స్ట్రాంబోలి (సిసిలీ) 2) ఫ్యూజియామా
3) కోటోపాక్సి (ఈక్వెడార్) 4) నార్కొండమ్ (ఇండియా)
13. అత్యధిక సంఖ్యలో అగ్ని పర్వతాలు బద్దలయ్యే, భూకంపాలు సంభవించే ప్రాంతం?
1)అట్లాంటిక్ వలయం2) పసిఫిక్ అగ్నివలయ
3) హిందూ వలయం 4) ఏదీకాదు
14. కిలిమంజారో అగ్ని పర్వతం కలిగిన ప్రాంతం?
1) భారత్ 2) ఫిలిప్పైన్స్
3) ఇటలీ 4) టాంజానియా
15. నాజ్‌కా, అరేబియా వంటివి .................. పలకాలు.
1) పెద్ద 2) చిన్న 3) పసిఫిక్ 4) ఏదీకాదు
16. జిగ్‌సా పజిల్ అంటే?
1) ఖండాలన్నింటిని ఒక చోట అమర్చడం
2) సముద్రాలను విడగొట్టడం
3) ఖండాలన్నింటిని వేర్వేరుగా ఉంచటం
4) ఏదీకాదు
17. నీటి ప్రవాహం వల్ల ఏర్పడే భూ స్వరూపాలను జతపర్చండి.
భూ స్వరూపాలు ప్రాంతం
1)Vఆకారపు లోయ ఎ) ఏంజెల్
2) అగాధదరి బి) బైసన్ గార్జ్
3) జలపాతం సి) గ్రాండ్ కాన్యన్
4)ఒండ్రు మైదానం డి) నదీముఖ ద్వారం
ఇ) గంగా-సింధు మైదానం
1)1-బి,2-డి,3-ఎ,4-ఇ 2)1-బి,2-సి,3-ఎ, 4-ఇ
3)1-ఎ,2-బి,3-సి,4-డి 4)1-డి,2-సి,3-బి, 4-ఎ
18. తెలంగాణ, ఇండియాలో అత్యంత ఎత్తయిన జలపాతాలు?
1) టుగెలా, పోచారం 2) జోగ్, టుగెలా
3) కుంటాల, జోగ్ 4) జోగ్, కుంటాల
19. కింది వాటిని జతపర్చండి.
పార్ట్-1 పార్ట్-2
1) ఆసియాఖండం ఎ) హిమనీ నదాలు
2) హిమాలయాలు బి) రెండవ శ్రేణి
3) సుందర్‌బన్ డెల్టా సి) మొదటి శ్రేణి
4) Uఆకారపు లోయ డి) మూడో శ్రేణి
ఇ) ఇండస్
1)1-ఎ,2-బి,3-సి,4-డి 2)1-సి,2-బి,3-డి, 4-ఇ
3)1-సి,2-బి,3-ఇ,4-ఎ 4)1-సి,2-బి,3-డి, 4-ఎ
20. అంతర్జనిత బలాలవల్ల ఏర్పడిన భూ స్వరూపం?
1) కొండలు 2) నదులు
3) జలపాతాలు 4) గార్జ్‌లు
21. భూ-అంతర్భాగపు సంవహన ఉష్ణప్రవాహాల వలన కలిగే ఫలితం?
1) ఖండం లాగబడుతుంది
2) పగులులోయ ఏర్పడుతుంది
3) సముద్రం ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంటుంది.
4) ప్రాచీన సముద్రం ఏర్పడుతుంది.
22. కింది వాటిని జతపర్చండి.
సముద్రపు భూ స్వరూపాలు నిర్మాణం
(అలల ప్రభావం వల్ల)
1) సముద్రపు తోరణాలు ఎ) సముద్ర భూభాగం
(సీ ఆర్చెస్) లోపలికి చొచ్చుకుని వెళ్లిన ప్రదేశం
2) పేర్పుడు స్తంభాలు (స్టాక్స్) బి) సముద్రంలోకి చొచ్చుకువచ్చిన భూభాగం
3) సముద్రపు బృగువు సి) సముద్రపు నీటి (సీ క్లిఫ్) నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం
4) అగ్రం డి) అలలవల్ల పక్కగోడల శిలలు మిగలడం
ఇ) సముద్రపు అలలు నిరంతరం రాళ్లకేసి కొట్టడం
1)1-ఇ,2-డి,3-సి,4-ఎ 2)1-ఇ,2-డి,3-సి,4-బి
3)1-ఎ,2-బి,3-సి,4-డి4)1-బి,2-డి,3-సి, 4-ఇ
23. భూభాగంలో 1/5వ వంతు ఏ భూస్వరూపాలు ఉన్నాయి?
1) నదులు 2) కొండలు 3) లోయలు 4) ఎడారులు
24. గాలి ప్రభావంవల్ల ఏర్పడే భూ స్వరూపాలు?
1) పుట్ట గొడుగులు 2) ఇన్సెల్‌బెర్గ్
3) ఇసుక దిబ్బలు 4) పైవన్నీ
సమాధానాలు:-
1-3, 2-3, 3-1, 4-4, 5-4, 6-1, 7-2, 8-3, 9-3, 10-2, 11-1, 12-1, 13-2, 14-4, 15-2, 16-1, 17-2, 18-3, 19-4, 20-1, 21-1, 22-2, 23-4, 24-4