Type Here to Get Search Results !

Vinays Info

చంద్రయాన్ 1 | Chandrayaan I - VINAYS INFO

🔹చంద్రయాన్ 1 Chandrayaan I భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము. ఈ మిషన్ లో, లూనార్ ఆర్బిటర్ మరియు ఇంపాక్టర్ ఉన్నాయి. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ చే, ఈ నౌక ప్రయోగించబడింది.

🔹రిమోట్ తో నడిచే ఈ ఉపగ్రహం యొక్క బరువు 1304 కి.గ్రా. (590 కి.గ్రా. ప్రారంభ కక్ష్య బరువు మరియు 504 కి.గ్రా. పొడి బరువు) మరియు సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్) మరియు సాఫ్ట్ మరియు హార్డ్ ఎక్స్-కిరణాల పౌనఃపున్యాల వద్ద దృష్టికి గోచరమయ్యే హై రెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలను మోసుకెళ్తుంది.

🔹మైల్‌స్వామి అన్నాదురైను ఈ ప్రాజెక్టు అధినేతగా ఇస్రో నియమించింది. తొలుత ఈ చంద్ర ఉపగ్రహాన్ని 2008 జూలైలో ప్రయోగించాలని నిర్ణయించుకున్నది. కానీ అక్టోబర్ 24న ప్రయోగించారు. ఈ కార్యక్రమం కొరకు ఇస్రో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. ఈ కార్యక్రమంలో ఇస్రోకు చెందిన ఐదు పే లోడ్లు, ఇతర దేశాలకు చెందిన ఆరు పేలోడ్లు గలవు. ఇతర దేశాల పేలోడ్లు 'నాసా' మరియు 'ఎసా' మరియు బల్గేరియాకు చెందిన ఏజెన్సీలవి.

👉కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలు

🔹చంద్రుని ఉపరితలాన్ని, త్రీ.డీ.లలో చిత్రీకరించడం, వివిధ ఖనిజాలు వాటి రసాయనిక స్పీసీస్‌లను, వాటి రేడియో ధార్మికత ను, న్యూక్లియడ్ల పంపకాలను, వాటి ప్రక్రియలను అధ్యయనం చేయడం. దీని కొరకు రిమోట్ సెన్సింగ్ పేలోడ్ల సెట్ లను ఉపయోగించడం. ఈ డేటా, సౌరమండలము యొక్క రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించడము.
చంద్రనౌకల ఉపయోగాలను సాధారణీకరణ చేయడం, శాస్త్రప్రయోగాల పేలోడ్లు, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్, డి.ఎస్.ఎన్. స్టేషన్లను ఏర్పాటు చేయడం వగైరా. లో-కక్ష్యలో పరీక్షలు నిర్వహించడం, కమ్యూనికేషన్లు, డేటా రిసెప్షన్ వగైరా.

👉పరిశోధనా మరియు అధ్యయనా మైదానాలు

🔹ఎల్లప్పుడూ భూమినుండి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల యొక్క ఖనిజ మరియు రసాయన, హై రెజెల్యూషన్ చిత్రీకరణ.
🔹చంద్రుడి ఉపరితలంపై మరియు ఉపరితలం క్రింద, ముఖ్యంగా ధృవాలలో ఘనీభవించిన నీటిని మరియు మంచును వెదకడం.
🔹చంద్రుడిపై గల ఎత్తైన శిలా ప్రదేశాలలో రసాయనచర్యా అవశేషాలకై వెదకడం.
చంద్రుడి క్రస్ట్ లో మరియు క్రేటార్ లలో రసాయన స్ట్రాటిగ్రఫీను పరిశోధించడం.
🔹కృత్తిమ ఉపగ్రహ మార్గంలో చంద్రుడి ఉపరితల ఎత్తుపల్లాల విషయాలను మ్యాపింగ్ చేయడం.
🔹10 కె.ఎ.వా (keV)ల కంటే ఎక్కువ గల ఎక్స్-కిరణాల స్పెక్ట్రమ్ను అధ్యయనం చేయడము. దీని వలన చంద్రుడి వయస్సు, ఏర్పడిన కాలముల గూర్చి సరైన సమాచారము దొరికే అవకాశం ఉంది.

👉ప్రధాన పరికరాలు లేదా పేలోడ్స్

🔹ఈ సైంటిఫిక్ పేలోడ్ లోని మొత్తం బరువు 90 కి.గ్రా., ఇందులో ఆరు భారతీయ పరికరాలు మరియు ఆరు విదేశీ పరికరాలు గలవు.

🔹ఉపరితల స్వరూప చిత్రీకరణ కెమెరా The Terrain Mapping Camera (TMC), ఇది 5 మీటర్ల రెజెల్యూషన్‌తో 40 కి.మీ.ల మేరకు గల ప్రాంతాలను పాన్-క్రోమాటిక్ బ్యాండ్ లతో చంద్రుడి హై రెజెల్యూషన్ చిత్రాలను తీస్తుంది.

🔹హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ Hyper Spectral Imager (HySI), ఇది ఖనిజాల అధ్యయనాన్ని దాని మ్యాపింగును చేస్తుంది, ఇది 400-900 ఎన్.ఎమ్. బ్యాండ్ లో 15 ఎన్.ఎమ్. మరియు 80 ఎన్.ఎమ్. స్పేషియల్ రెజెల్యూషన్ ను కలిగి వుంది.

🔹చంద్రుడి లేజర్ రేంజింగ్ పరికరం, Lunar Laser Ranging Instrument (LLRI), ఇది చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది.

🔹ఎక్స్-కిరణాల ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ An X-ray fluorescence spectrometer C1XS 1- 10 keV వరకు 25 కి.మీ. గ్రౌండ్ రెజెల్యూషన్ తోనూ మరియు ఒక సోలార్ ఎక్-కిరణాల మానిటర్, a Solar X-ray Monitor (XSM) ఇది సోలార్ ఫ్లక్స్ ను డిటెక్ట్ చేయడానికినూ, 1–10 keV రేంజి గలది.

🔹ఒక హై ఎనర్జీ ఎక్స్-కిరణ/గామా కిరణాల స్పెక్ట్రోమీటర్, A High Energy X-ray/gamma ray spectrometer (HEX) 30- 200 keV కొలతలకొరకు, 40 కి.మీ.ల గ్రౌండ్ రెజెల్యూషన్ తో, HEX, యురేనియం మరియు థోరియాన్ని 210Pb, 222Rn డీగ్యాసింగ్, మరియు ఇతర రేడియోధార్మిక పదార్థాలు.

🔹మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, Moon Impact probe (MIP), దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది.

🔹విదేశీ పేలోడ్ లలో, ఈ.ఎస్.ఏ నుండి The Sub-keV Atom Reflecting Analyzer (SARA),[3]
జె.పి.ఎల్. నుండి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి.
ఈ.ఎస్.ఏ. నుండి Near infrared spectrometer (SIR-2).

🔹జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి ఎస్.బ్యాండ్ miniSAR.

🔹బల్గేరియా నుండి రేడియేషన్ డోస్ మానిటర్, Radiation Dose Monitor (RADOM-7).

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section