పొట్లపల్లి రామారావు (మరణం సెప్టెంబర్ 10, 2001) కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు. ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు. జన్మ స్థలం వరంగల్ జిల్లా, తాటికాయల గ్రామం. కాళోజి రామేశ్వరరావు సమకాలికుడు. తెలుగు, ఉర్దూ రెండింటిలోనూ మంచి కవిత్వం రాశాడు. వట్టికోట ఆళ్వారుస్వామితో కలసి గద్వాల మొదలయిన సంస్థానాలలో అధిక పన్నుల గురించి, రైతాంగం మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి నివేదిక రాశారు. దాసి సినిమా హీరో భూపాల్ పొట్లపల్లి మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేశారు. పొట్లపల్లి సాహిత్య సర్వస్వము తీసుకరావటం కాళోజి కోరిక.
ఈయన కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఏనుగ చొప్ప.
రచనలు
👉చుక్కలు కవితా సంపుటి
👉జైలు కథాసంపుటి. (1934-45)
👉ముల్లా కథలు,
👉ఆచార్యుల వారి కథలు
👉ఏనుగ చొప్ప
👉పాదధూళి (నాటిక)
👉సర్‌బారాహి (నాటిక)
👉పగ (నాటిక)
👉న్యాయం (నాటిక)