Type Here to Get Search Results !

Vinays Info

భారతదేశ ఉనికి -క్షేత్రీయ అమరిక

భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తారు కారణం ఒక ఖండానికి ఉండవలసిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాలు మరియు అధిక విస్తీర్ణం విశిష్టమైన శీతోష్ణస్థితి ని కలిగి ఉండడం. ఉపఖండపు దేశాలైన పాకిస్థాన్,నేపాల్,భూటాన్,బంగ్లాదేశ్,శ్రీలంక,మయన్మార్ దేశాలన్నీ కలిసి ఒక ప్రాంతీయ, ఆర్ధిక, సహకార,కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమే “సార్క్” కూటమి. ఒకవైపు భూభాగం మూడువైపులా జలభాగం ఉన్నందున భారత దేశాన్ని ద్వీపకల్పంగా కూడా పిలుస్తారు. భారత దేశానికి ఇండియా అనే పేరు సింధునది (ఇండస్) పేరుమీదుగా వచ్చింది.

ఉనికి : హిందూ మహాసముద్రానికి ఉత్తరాన దక్షిణాసియా ఖండ భూభాగంలో 80 4’ – 370 6’ ఉత్తర అక్షంశాల మధ్య, 680 7’ – 970 25’ తూర్పు రేకాంశాల మధ్య ఉత్తరార్ధ గోళం, పూర్వార్ధ గోళాల మధ్య భారతదేశ భూభాగం విస్తరించి ఉంది. భారతదేశ భూభాగం మధ్యగుండా కర్కటరేఖ (23 1/2 ఉత్తర అక్షంశ రేఖ) దేశాన్ని అడ్డంగా రెండు సమన అర్ధభాగాలుగా విభజిస్తుంది.ఇది దేశంలోని 8 రాష్ట్రాల గుండా పోతుంది.
అవి 1.గుజరాత్, 2.రాజస్థాన్(తక్కువ దూరం), 3. మధ్యప్రదేశ్ (ఎక్కువదూరం), 4. ఛత్తీస్గఢ్, 5.జార్ఖండ్, 6.పశ్చిమబెంగాల్, 7.మిజోరాం, 8.త్రిపుర.
భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని 82 1/2 డిగ్రీల తూర్పురేఖంశం ఆధారంగా లెక్కించడం జరిగింది.ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5 1/2 గంటల ముందు ఉండడమే కాకుండా దేశంలో 5 రాష్ట్రములు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల గుండా పోతుంది. అవి 1. ఆంధ్రప్రదేశ్ (కాకినాడ), 2. ఒడిశా (కటక్) 3. ఛత్తీస్గఢ్ (రాయపూర్) 4. మధ్యప్రదేశ్ (రేవ్ మరియు జబల్ పూర్) 5. ఉత్తరప్రదేశ్ (అలహాబాద్). 6. పాండిచ్చేరి (యానాం).

విస్తీర్ణం : భారతదేశ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ. ఇది ఏది మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో 0.57%. ఖండాల ఉపరితల విస్తీర్ణంలో 2.4% కలిగి, విస్తీర్ణం పరంగా రష్యా,కెనడా,చైనా,అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, తరువాత 7 వ స్థానం లో ఉంది. భారతదేశంలో విస్తీర్ణం పరంగా రాజస్థాన్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, మొదటి 4 స్థానాల్లో ఉండగా గోవా చిన్న రాష్ట్రంగా గుర్తింపు పొందిది. జనాభా పరంగా దేశంలో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో, సిక్కిం చివరి స్థానంలో ఉన్నాయ్. దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్ (8 రాష్ట్రాలు), అస్సాం (7 రాష్ట్రాలు) మొదటి రెండు స్థానాల్లో, సిక్కిం, మేఘాలయ ఒకే రాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్నాయ్. భారతదేశం ఉత్తర,దక్షిణాలుగా 3214 కి.మీ. పొడవు, తూర్పు, పడమరలుగా 2933 కి.మీ. వెడల్పు కలిగి ఉన్నాయ్. త్రిపుర,సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్,జమ్మూ & కాశ్మీర్. మూడువైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయ్.

సరిహద్దు ఒప్పందాలు :
1. డ్యూరాండ్ ఒప్పందం : ఇండియా- ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్-ఆఫ్ఘానిస్తాన్ ల మధ్య ఈ ఒప్పందం అమలులో ఉంది.
2. రాడ్ క్లిప్  రేఖ : ఇండియా-పాకిస్థాన్ (రాజస్థాన్-పంజాబ్) ఇండియా-బంగ్లాదేశ్ ల మధ్య అమలులో ఉంది.
3. అంతర్జాతీయ రేఖ : సవాయ్ నుంచి మధోపూర్ వరకు.
4. నియంత్రణ రేఖ లేదా పూంచ్ రేఖ : పూంచ్ నుంచి N . J .-9842 వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ , జమ్మూ కాశ్మీర్ మధ్య ఉంది.
5. AGPL : N . J .-9842 నుంచి ఇందిరాకల్ వరకు.
6. వాస్తవాధీన రేఖ : భారత్-చైనా ల మధ్య WESTERN SECTOR వెంబడి ఉంది.
7. మేక్ మోహన్ రేఖ : భారత్-చైనా ల మధ్య EASTERN SECTOR వెంబడి ఉంది.
8. 240 ల సమాంతర రేఖ : భారత్-పాకిస్థాన్ లో మధ్య గుజరాత్ లో వివాదాస్పదంగా ఉన్న రాణ్ అఫ్ కాచ్ ప్రాంతంలో ని సర్ క్రీక్ వెంట పాకిస్థాన్ గుర్తించిన సరిహద్దు ఇది.

భారతదేశం మొత్తం 15,200 కి. మీ ల పొడవైన భూ సరిహద్దును 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో కలిసి పంచుకొంటున్నాయి. అవి : 1.ఆఫ్ఘానిస్తాన్(జమ్మూ కాశ్మీర్ తో సరిహద్దు కలదు), 2. పాకిస్థాన్ (రాజస్థాన్ పొడవైన సరిహద్దు కలదు) , 3. చైనా (జమ్మూ కాశ్మీర్ తో పొడవైన సరిహద్దు కలదు), 4. నేపాల్ ( యూ పి తో పొడవైన సరిహద్దు కలదు), 5. భూటాన్ (అస్సాం తో పొడవైన సరిహద్దు కలదు), 6. మయన్మార్ (అరుణాచల్ తో పొడవైన సరిహద్దు కలదు), 7. బాంగ్లాదేశ్ (పశ్చిమబెంగాల్ తో పొడవైన సరిహద్దు కలదు). భారత్ లో అతి తక్కువ సరిహద్దు కల దేశం ఆఫ్ఘానిస్తాన్, భారత్ లో అతి ఎక్కువ  సరిహద్దు కల దేశం బంగ్లాదేశ్.

భారత్ (దీవులతో కలుపుకొని) 7,516 కి.మీ. పొడవైన తీరరేఖ కలదు. భారత ప్రధాన భూభాగం (దీవులు కాకుండా) 6,100 కి.మీ. ల తీరరేఖ కలదు. ఈ ప్రధాన తీరరేఖ వెంబడి 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు తీర సరిహద్దు కలిగి ఉన్నాయ్. వీటిలో గుజరాత్ (1054 కి.మీ) పొడవైన, గోవా (36 కి. మీ.) అతి తక్కువ తీరాన్ని కలిగి ఉన్నాయ్.భారత ప్రాదేశిక జలాలు తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరం, భారత  ప్రత్యేక ఆర్ధిక మండలి తీరరేఖ నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు హిందూ మహా సముద్ర జలాల్లో విస్తరించి ఉంది. భారత్ శ్రీలంక ను 4 భూస్వరూపాలు వేరుచేస్తున్నాయి. అవి : 1.పాక్ జలసంధి, 2.పాక్ అఖాతం, 3. ఆడమ్స్ బ్రిడ్జి (రామసేతు మార్గం), 4. మున్నార్ సింధు శాఖా.

భారతదేశ దక్షిణ చివర “ఇందిరా పాయింట్”, ఇది గ్రేట్ నికోబర్ దివిలో ఉంది. భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివర కోన – “కన్యాకుమారి”. ఉత్తర చివర కోన – ” ఇందిరాకల్”, ఇది కారకోరం శ్రేణి లో కిలిక్ ధావన్ కనుమలలో ఉంది. తూర్పు చివర కోన అరుణాచల్ ప్రదేశ్ లోని ద్విపూ కనుమ లేదా కీబూటు, పశ్చిమ చివరి కోన గుజరాత్ లోని రాణ్ అఫ్ కచ్.

భారతదేశంలో భూపరివేష్టిత రాష్టాల సంఖ్య 5 అవి. 1. మధ్యప్రదేశ్, 2.ఛత్తీస్గఢ్, 3.జార్ఖండ్, 4, హర్యానా, 5. తెలంగాణ. ప్రపంచంలో అతి పెద్ద భూ పరివేష్టిత దేశం “కజకిస్థాన్” రెండవది మంగోలియా. భూ పరివేష్టిత దేశాలు ఎక్కువగా కల ఖండం “ఆఫ్రికా”, భూ పరివేష్టిత దేశాలు లేని ఖండాలు “ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. నాలుగువైపులా జలంతో ఆవరించి ఉన్న భూభాగమే దీవి. పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా దీవులున్నాయి. భారత సార్వభౌమాధికారం కింద మొత్తం 247 దీవులున్నాయి. వీటిలో 2014 దీవులు బంగాళాఖాతంలో, విగిలినవి అరేబియా సముద్రం, మున్నార్ సింధు శాఖల్లో ఉన్నాయ్. భారత దేశంలో అది పెద్ద ఆర్చి పెలాగో అండమాన్ నికోబర్ దీవుల సముదాయము.ప్రపంచం లో అతిపెద్ద నది ఆధారిత దీవి “మజూలి” దీవి. ఏది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది లో ఉంది.

ముఖ్యంశాలు :
* భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం గ్రేట్ ముంబై. తీర రేఖ ఎక్కువగా కల నగరం చెన్నై(11 కి.మీ).
* అండమాన్ నికోబర్ దీవులని థాయిలాండ్ ను వేరుచేస్తున్నది “గ్రేట్ అండమాన్ ఛానల్”
* అండమాన్ నికోబర్ దీవులని మయన్మార్ ను వేరుచేస్తున్నది “కోకో ఛానల్”
* అండమాన్ నికోబర్ దీవులని ఇండోనేషియా ను వేరుచేస్తున్నది “గ్రేట్ ఛానల్”
* దక్షిణ అండమాన్ ని, లిటిల్ అండమాన్ ని వేరుచేస్తున్నది “డంకన్ పాసేజ్”
* అండమాన్ మరియు నికోబర్ దీవులని వేరుచేస్తున్నది “10 ఛానల్”.
* లక్ష్య దీవులను, మాల్దీవులను వేరుచేస్తున్నది “8 ఛానల్”.
* అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం “థాయిలాండ్”, “ఇందిరా పాయింట్” నికోబర్ దీవిలో ఉంది.
* దేశంలో పొరుగుదేశాలతో సరిహద్దు మరియు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు – “గుజరాత్,పశ్చిమబెంగాల్”.
* మయన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ” ఆర్కన్ యోమా”.
* గ్రీన్ విచ్ లో ఉదయం 10 గంటలు అయితే ఇండియా లో త్రీ.30 PM (+5.30 గంటలు) అవుతుంది. గ్రీన్ విచ్ లైన్ “లండన్”  గుండా పోతుంది.
* భారత దేశంలో అగ్ని పర్వతాలు అండమాన్ దీవులలోని “బారన్” దీవులలో ఉన్నాయ్.
* ప్రపంచంలో అతి పెద్ద ఆర్చి పెలాగో “ఇండోనేషియా”, హిందూ మహా సముద్రంలో అతి పెద్ద దీవి “మడగాస్కర్”
* పశ్చిమ తీరంలో విశాలమైన తిరమైదానం “మలబార్”, వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద నున్న ఓడరేవు “కొచ్చిన్”, సుప్రసిద్ధ “అంజనా బీచ్” గోవా తీరం లో ఉంది.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section