* భారతదేశ జాతీయ చిహ్నం “లయన్ క్యాపిటల్” (సారనాధ్ లోని అశోకుని ధర్మస్తూపంపై ఉండే సింహాలు). అశోకుని స్తూపంపై 4 సింహాలు ఉంటాయి కానీ మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్యభాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రం నకు కుడివైపు “వృషభం”, ఎడమవైపు “గుర్రం” ఇవి కాక “ఏనుగు, సింహం” కూడా ఉంటాయి ఇవి మనకు కనిపించవు. పీఠం మధ్యభాగంలో “సత్యమేవ జయతే” అని దేవనాగరిక లిపిలో ఉంటుంది, ఈ వాక్యం “ముండకోపనిషత్” నుండి గ్రహింపబడింది. జాతీయ చిహ్నం 1950 జనవరి 26 న ఆమోదింపబడింది.
* భారతదేశ జాతీయ గీతం “జనగణమన” రచించినది “రవీంద్రనాథ్ ఠాగూర్” ఈ గీతాన్ని తొలిసారిగా 1911, డిసెంబర్ 27 న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పదారు. ఠాగూర్ “తత్వబోధిని” పత్రిక లో “భారత విధాత” పేరుతో ఈ గీతం తొలిసారి 1912 లో ప్రచురితం అయింది. ఈ గీతాన్ని ఠాగూర్ “మార్నింగ్ సాంగ్ అఫ్ ఇండియా” పేరుతో 1919 లో ఆంగ్లం లోకి అనువదించారు.జాతీయ గీతం తొలుత బెంగాలీ భాషలో రాయబడింది. జాతీయ గీతం 1950,జనవరి 24 న అధికారికంగా వాడుకలోకి వచ్చింది. జాతీయగీతాన్ని పాడటానికి తీసుకోవలసిన సమయం 52 సెకన్లు.
*భారతదేశ జాతీయ గేయం “వందేమాతరం” రచించింది “బంకించంద్ర ఛటర్జీ” “ఆనంద్ మాట్” నవలలోనిధీ. వందేమాతరం గేయాన్ని తొలుత సంస్కృతంలో రాసారు. దీన్ని “అరవింద్ ఘోష్” ఆంగ్లంలోకి అనువదించారు. వందేమాతరం గేయాన్ని1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు, జనవరి 24,1950లో రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.
* భారతదేశ జాతీయ పతాకం కాషాయం,తెలుపు, ఆకుపచ్చ రంగుల త్రివర్ణ పతాకం, పొడవు, వెడల్పు ల నిష్పత్తి త్రీ:2, కాషాయం – ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి, తెలుపు – శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ – విశ్వాసం,పరాక్రమం,నమ్మకానికి చిహ్నాలు. తెలుపు రంగు మధ్యలో నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. రాజ్యాంగ సభ 1947, జులై 22 న జాతీయ పథకంగా ఆమోదించింది. అధికారికంగా 1947 ఆగష్టు, 24 అర్ధరాత్రి ప్రదర్శించారు, దీనిని తొలిసారి పార్లమెంట్ పై ఎగురవేశారు. తొలిసారి 1921 లో విజయవాడలో ఆంద్రప్రదేశ్ కు చెందిన “పింగళి వెంకయ్య” జండాను రూపొందించారు.
*జాతీయ జంతువు “పెద్దపులి” శాస్త్రీయనామం “పాంతారా టైగ్రిస్”. 1972 వరకు సింహం జాతీయ జంతువు గ ఉండేది 1972 నుంచి పెద్దపులిని జాతీయ జంతువుగా గుర్తించారు. 1973 నుండి దేశంలో “ప్రాజెక్ట్ టైగర్” ను ప్రారంభించారు.
* జాతీయ పక్షి “నెమలి” శాస్త్రీయనామం “పావో క్రిస్టేటస్”, నెమలిని జాతీయ పక్షిగా 1964 లో గుర్తించారు.
* జాతీయ వృక్షం “మర్రి చెట్టు” శాస్త్రీయనామం “పైకాస్ బెంగలేన్సిస్”.
* జాతీయ పుష్పం “తామరపువ్వు” శాస్త్రీయనామం “నెలుంబో న్యూసిపెర గెర్టాన్”.
* జాతీయ ఫలం “మామిడి పండు” శాస్త్రీయనామం “మ్యాంజిపెరా ఇండికా”.
* జాతీయ క్రీడ “హాకీ”.
* జాతీయ జాతీయ క్యాలండర్ “గ్రెగేరియన్ క్యాలండర్” ఆధారంగా 1957 మార్చ్ 22 న తయారుచేసారు ఈ క్యాలండర్ కు “చైత్రం తొలిమాసం ఫాల్గుణం చివరిమాసం” ఆధారంగా రూపొందించారు.
* జాతీయ నది “గంగ నది”, 2008 లో జాతీయ నది గ ప్రకటించారు.
* జాతీయ వారసత్వ జంతువుగా కేంద్రం 2010 లో “ఏనుగు” గా, “డాల్ఫిన్” ను 2009 లో జాతీయ జలచరం గా గుర్తించింది. డాల్ఫిన్ శాస్త్రీయనామం “ప్లాటినెస్టా గంజెటిక”, జాతీయ జంతువును,పక్షిని,జలచరం వంటి వాటిని హింసించడం,చంపడం, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నేరం.
* జాతీయ కాలమానం 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాఅంశం అనుసరించి నిర్ణయిస్తారు.గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5:30 గంటలు ముందు ఉంటుంది.