Type Here to Get Search Results !

Vinays Info

దర్శన్ రంగనాథన్:

దర్శన్ రంగనాథన్:
〰〰〰〰〰〰🌸
Hi friends,Today's Indian scientist 'Darsan Ranganadhan 'birth & death anniversary --VINAYS INFO

(జూన్4 ,1941జూన్4,2001)  

🌀భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ (కర్బన రసాయన శాస్త్రం) శాస్త్రవేత్త.

🌀 ఈమె బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో సుపరిచితులు. ఈమె విశేషమైన కృషిని "ప్రోటీన్ ఫోల్డింగ్" పై చేశారు

🌀 ఈమె "పరమాణు పరిధిని దాటిన సమ్మేళనాలు, అణు ఆకృతులు, జీవప్రక్తియల రసాయన అనుకరణ, ఫంక్షనల్ హైబ్రిడ్ పెప్టైడ్ ల సంశ్లేషణ, మరియు నానో ట్యూబ్స్ సంశ్లేషణ" వంటి వాటిలో గుర్తింపబడ్డారు."

బాల్యం, విద్య:
〰〰〰〰〰
🌀 దర్శన్ రంగనాథన్ జూన్ 4, 1941 న విద్యావతి మరకన్ మరియు శాంతి స్వరూప్ దంపతులకు జన్మించింది.

🌀 ఈమె విద్యాబ్యాసం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1967వ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. మొదట లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత ఢిల్లీ నందలి "మిరండా కాలేజి" నందు రసాయన శాస్త్ర విభాగానికి ఆధిపతిగా పనిచేశారు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ నిమిత్తం ప్రొఫెసర్ డి.హెచ్.ఆర్. బార్టన్ తో కలసి చేయుటకు యు.ఎస్. వెళ్లారు.

🌀 1970 లో ఐ.ఐ.టి , కాన్పూర్ (IIT Kanpur) నందు పరిశోధనలు ప్రారంభించారు. ఆ సంవత్సరంలో ఆమె ఎస్. రంగనాథంను వివాహమాడారు. . అదేవిధంగా "కరెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైలైట్స్" లో కొన్ని సవరణలు కూడా చేశారు.

🌀 ఆమె ఐ.ఐ.టి కాన్పూర్ లో పరిశోధనలు ఫెలోషిప్ ఆధారంగా కొనసాగించారు. ఆమె భర్త అచట ఒక మెంబర్ అయినందున అలిఖిత నియమాలు ఆమె అధ్యాపకులు కాకుండా చేశాయి.

రచనలు :
---------
🌀 ఆమె రచయితగా "ఛాలెంజింగ్ ప్రోబ్లెమ్స్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్"(1972) , "ఆర్ట్ ఇన్ బయో సింథసిస్:ద సింథెటిక్ కెమిస్ట్స్ చాలంజి"(1976) మరియు "ఫర్దర్ ఛాలెంజింగ్ ప్రాబ్లెంస్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్"(1980) లను వ్రాసారు

పరిశోధనలు:
------------
🌀 ఆమె 1993 లో త్రివేండ్రం లోని రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ లో ఆమె పరిశోధనలు ప్రారంభించారు. 1998 లో హైదరాబాదు లో కల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కూడా పనిచేశారు.,where she became Deputy Director. ఈ కాలంలో ఆమె యు.ఎస్.నావల్ రీసెర్చ్ లాబొరేటరీ లోని "సాబెల్లా కర్లె" తో కలసి పరిశోధనలు నిర్వహించారు

సేవలు :
--------
🌀 రంగనాధన్ యొక్క ప్రత్యేక అభిరుచి ప్రయోగశాలలో సహజ జీవరసాయనిక ప్రక్రియలు పునరుత్పత్తి చేయటం.

🌀 ఆమె "ఇమిడజోల్" యొక్క స్వతంత్ర పునరుత్పత్తి గూర్చి ఒక నియమావళిని రూపొందించారు."ఇమిడజోల్" నునది ఔషధ ప్రాముఖ్యత కలిగిన "హిస్టాడిన్" మరియు "హిస్టామిన్" యొక్క పదార్థం

🌀 ఆమె "యూరియా సైకిల్" యొక్క అనుకరణను అభివృద్ధిచేశారు.

🌀 ఆమె కెరీర్ వృద్ధి చెందుతున్న దశలో స్వయం నిర్మిత పెప్టైడ్ల యో నానో స్ట్రక్చర్ రూపకల్పన మరియు వివిధ ప్రోటీన్ల నిర్మాణాలను డిజైన్ చేయుటలో స్పెషలిస్ట్ గా నిలిచారు

🌀 దర్శన్ రంగనాథన్ 1997 లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈమె తన 60 పుట్టిన రోజున 2001 లో మరణించారు

🌀 ఆమె ద్వివార్షిక రోజున "ప్రొఫెసర్ దర్శాన్ రంగనాథన్ మెమోరియల్ లెక్చర్" ను సన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభ కనబరచిన మహిళా శాస్త్రవేత్త ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ఆమె జ్ఞాపకార్థం ఆమె భర్తచే నెలకొల్పబడింది.

     〰〰🙏🏻🙏🏻🙏🏻〰〰

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section