తెలంగాణలో ప్రథమం, ప్రధానం, ప్రముఖం
1. తొలి తెలుగు చరిత్రకారుడెవరు
- ఏకామ్రనాథుడు (ప్రతాపరుద్ర చరిత్ర)
2.. 1902లో బండారు అచ్చమాంబ రాసిన 'ధన త్రయోదశి' - తెలుగులో మొదటి కథ
3. పూర్తిగా చైతన్య స్రవంతి శిల్పంలో రూపొందించిన మొట్టమొదటి తెలుగు నవల ''అంపశయ్య'' నవీన్
4. తెలంగాణలో మొట్టమొదటి ప్రచురణ సంస్థ ''విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి''
5. తెలంగాణలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనే ప్రథమకవి - పాల్కురికి సోమనాథుడు.
6. ప్రపంచంలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం?
- నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి.
7. ప్రపంచంలోని అతిపెద్దరాతి కట్టడమైన బహుళార్థసాధక ప్రాజెక్ట్ - నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.
8. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జైన దేవాలయం
- కొలనుపాక (నల్లగొండ జిల్లా)
9. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పట్టుకేంద్రం
- భూదాన్ పోచంపల్లి.
10. తెలంగాణ మాండలికంలో ప్రప్రథమంగా భూస్వామ్య సంస్కృతి ఇతి వృత్తంగా రాసిన నవల ఏది? ఎవరు రాశారు? - తరం మారింది- మాదిరెడ్డి సులోచన
11. తెలంగాణ వచ్చిన తొలి తెలుగువార పత్రిక
-'నీలగిరి' - షబ్నవీసు వెంకటనర్సింహారావు
(1922 ఆగస్టు - 24) నల్లగొండ నుండి
12. మొట్టమొదటి అచ్చ తెనుగుకవి, పొన్నగంటి తెలగనార్యుడు రాసింది
-''యయాతి చరిత్ర''. ఇది మొట్టమొదటి అచ్చ తెనుగు గ్రంథం.
13. తెలంగాణలో మొదటి బుర్రకథ - ''హైదరాబాద్ సంస్థాన రాజ్యాంగ సంస్కరణలు'' - 1946లో.
14. తెలంగాణ యక్షగాన పితామహుడు
- శ్రీ చెర్విరాల బాగయ్య కవి.
15. తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రప్రథమ లిఖిత కవి- గుణాఢ్యుడు - బృహత్కథ.
16. తెలంగాణలో మొట్టమొదటి చారిత్రక గేయ కావ్యం - ''నాగార్జున సాగరం'' - డా.సి. నారాయణరెడ్డి రచించారు.
17. ''వాణి నారాణి'' అని సరస్వతీ దేవిని సంబోధించింది. మన తెలంగాణ కవి - ''పిల్లలమర్రి పినవీరభద్రుడు''.
18. ప్రప్రథమంగా తెలుగులో పురాణాన్ని రాసిన కవి
- (ద్విపద) - బసవపురాణం - పాల్కురికి సోమనాథుడు.
19. తెలుగులో మొట్టమొదటి సినిమా తీసిన వారు
- తెలంగాణవారే.
- కందిబండ సంస్థానం - నారపరాజువారు - ఆదర్శం.
20. అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం అను శివరామ దీక్షతీయ సాంప్రదాయం ప్రారంభమైంది
- తెలంగాణలోనే నల్లగొండ జిల్లా - నారాయణపురం.
21. అల్లసాని పెద్దన కన్నాముందే ''ఆంధ్రకవితా పితామహుడు'' అన్న బిరుదున్న కవి
- కొరవి సత్యనారాయణ (రాచకొండ దుర్గం).
22. తొలి తెలుగు ''విజ్ఞానసర్వస్వం'' అనదగినది ఏది?
ఎవరు రాశారు?
- పాల్కురికి సోమనాథుడు - ''పండితారాధ్యుల చరిత్ర''.
23. భారతదేశంలో ఏర్పడిన మ్యూజియం - తెలంగాణలో వుంది- అది - నాగార్జునసాగర్ ఐలాండ్ మ్యూజియం.
24. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పుట్టిన భాష
- 'ఉర్దూ'.
25. ''కొలిమంటుకున్నది'' నవలా రచయిత
- అల్లం రాజయ్య.
26. రొనాల్డ్‌రాస్ మలేరియా మందును కనుగొన్న ప్రాంతం
- హైదరాబాద్ .
27. తెలంగాణలో మొట్టమొదటి డిగ్రీ కళాశాల ఎక్కడ ఎవరి ప్రోత్సాహంతో వెలిసింది
- హైదరాబాద్ ఖండవల్లి లక్ష్మీ రంజనం.
28. తెలంగాణ ప్రప్రథమ ప్రజాకవి ఎవరు? - కాళోజీ నారాయణరావు.
29. తెలుగులో - గజల్స్ - రచనలు ప్రారంభించిన తొలి తెలంగాణ కవి ఎవరు? - డా. సి. నారాయణరెడ్డి.
30. తెలంగాణలో పూర్తిస్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు స్వతంత్ర పత్రిక - హితబోధిని.
31. తెలుగులో తొలిసారిగా నాలుగు వేదాలను వచనంగా రాసిన కవి ఎవరు? - దాశరథి రంగాచార్య.
32. హైదరాబాద్ రాష్ట్ర ప్రాజెక్ట్‌లలో మొట్టమొదటిది ఏది?
- నిజాం సాగర్
33. యావత్ భారతదేశంలోనే అరుదైన శిల్పంగా పేరుగాంచిన ''ఎలుక'' శిల్పం (రాతి) తెలంగాణలో ఎక్కడ కలదు. - నల్లగొండ జిల్లా, పానగల్లు మ్యూజియం.
34. ప్రపంచంలోని 5 ప్రదేశాలలో బుద్ధుని ధాతువులను దాచారు. అందులో తెలంగాణలోనిది ఒకటి ఎక్కడ
- నాగార్జునసాగర్.
35. తెలంగాణలో ప్రప్రథమ సార్వత్రిక విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. హైదరాబాద్‌లో
- డా. అంబేద్కర్ విశ్వవిద్యాలయం.
36. తెలంగాణలో తొలి ఉద్యమం -గ్రంథాలయోద్యమం.
37. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రప్రథమంగా నేలకొరిగిన వ్యక్తి - దొడ్డి కొమురయ్య.
38. తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన పోరాటం - తెలంగాణ సాయుధ పోరాటం.
39. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఏది?
- నిజామాబాద్ జిల్లాలో - టి.కె. బాలయ్య - ఆర్మూర్ తాలుకాలో ఎడ్లబండిపై సంచార గ్రంథాలయాన్ని నడిపాడు.
40. తెలంగాణలో తెలుగు సాహిత్యానికి పునాది వేసిన రాజవంశం ఏది? - వేములవాడ చాళుక్యులు.
41. ప్రపంచంలోనే ఎక్కువ మానవశక్తిని ఉపయోగించి కట్టిన ప్రాజెక్ట్ తెలంగాణలో కలదు
- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.
42. ప్రపంచంలోనే అతిపెద్ద నదీలోయ ప్రాజెక్ట్
- నాగార్జునసాగర్
43. తెలంగాణలో మొదటి చారిత్రక పరిశోధన చేయించినవాడు - కల్నల్ మెకంజీ (1790-1810)
44. మకుట నియమం, సంఖ్యానియమం కలిగిన శతకాల్లో మొట్టమొదటిది- తెలంగాణ కవి పాల్కురికి సోమన్న రచించిన వృషాధిపశతకం.
45.తెలుగులో తొలి రామాయణాన్ని రాసింది తెలంగాణ లోనే
- గోన బుద్దారెడ్డి రాసిన రంగనాథ రామాయణం.
46. తెలుగులో మొదటి పురాణవాదం చేసిన కీర్తి తెలంగాణదే - మారన- మార్కండేయ పురాణం.
48. తెలుగులో మొట్టమొదటి యక్షగానం
- తెలంగాణలోనే - కందుకూరి రుద్రకవి రాసిన - ''సుగ్రీవ విజయం''.
49. తెలుగులో మొట్టమొదటగా కనపడే పదం తెలంగాణలోనిది అది 'గోబద' (నాణెములలో)
- కోటిలింగాలలో దొరికింది.
50. 'తెలంగాణయే అసలైన సిసలైన తెలుగుగడ్డ'' అన్నది
- అడవి బాపిరాజు.
51. తెలుగులో ప్రప్రథమ చంధోగ్రంథం
- (తెలంగాణదే) - కవిజనాశ్రయం.
52. తెలుగులో మొదటి సంకలన గ్రంథం- మడివి సింగన రచించిన - సకలనీతి సమ్మతం
53. తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలు ఏవి? - గోదావరి పుష్కరాలు.
54. తెలుగులో మొదటి సంకలన కావ్యం?
- కొరవి గోపరాజు రచించిన - సింహసన ద్వాత్రింశిక.
55. తెలంగాణలో వేమనతో పోల్చదగిన కవి ఎవరు?
- సిద్దప్పవరకవి.
56. ఆసియాలోనే అతిపెద్ద జాతర- తెలంగాణలో ఏది?
- సమ్మక్క సారక్క జాతర.
57. ''లాటీగోలీఖాయింగే, తెలంగాణ లేయింగే'' నినాదం. - తొలి తెలంగాణ ఉద్యమం (1969) కాలం నాటిది.
58. తెలంగాణలో దళితుల కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ.
59. తెలంగాణ సరిహద్దు గాంధీ- సర్దార్ జమలాపురం కేశవరావు.
60. తెలంగాణ గాంధీ - భూపతి కృష్ణమూర్తి.
61. తెలంగాణ పటేల్ - బొమ్మకంటి, సత్యనారాయణ.
62. తెలంగాణ వైతాళికుడు
- మాడపాటి హనుమంతరావు.
63. హైదరాబాద్ సింహం - పండిత నరేంద్రజీ.
64. హైదరాబాద్ ప్రకాశం - స్వామి రామానంద తీర్థ.
65. జై తెలంగాణ నాయకుడు - మర్రి చెన్నారెడ్డి.
66. తెలంగాణ రచయితల సంఘం స్థాపించింది
- దాశరథి.
67. వైతాళసమితి స్థాపించింది- కాళోజీ నారాయణరావు
68. హైదారాబాద్ సంస్థానంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్ సంస్థ - కామ్రేడ్స్.
69. తెలంగాణలో తెలుగు వారిని జాగృతపర్చుటకేర్పడిన మొట్టమొదటి సంస్థ? - ఆంధ్రజనసంఘం.
70. హైదరాబాద్ సంస్థానాన్ని దర్శించిన తొలివైస్రారు
- రిప్పన్.
71. తెలంగాణ జాతీయోద్యమ చరిత్రలో కీలకమైన సంవత్సరం? - 1938.
72. తెలంగాణలో ''మొహర్రమ్'' పండుగను ఏమని పిలుస్తారు? - పీర్లపండుగ.
73. తెలంగాణలో మొత్తం 641 దేవాలయాలు కలవు.
74. ట్రాజిడీ ఆఫ్ హైదరాబాద్ రచించింది -లాయక్ అలీ.
75. జుఅస శీట aఅ వతీa - కె.ఎం. మున్షీ.
76.'తెలంగాణ వైతాళికులు' పుస్తక రచయిత?
- ఎం.ఎల్. నర్సింహారావు.
77. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- బూర్గుల రామకృష్ణారావు.
78. సైనిక చర్య అనంతరం నిజాం రాజు అలంకరించిన పదవి - రాజ్ ప్రముఖ్
79. హండ్రెడ్ డేస్ ఇన్ హైదరాబాద్ - కె.ఎం. మున్షీ.
80. హైదరాబాద్ వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ నాయకుడు? - రావి నారాయణ రెడ్డి
81. హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్యసమాజ్ ప్రధాన నాయకుడు? - కేశవరావు కొరాట్కర్.
82. 1947 మే 7న సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో ప్రసంగించిన సోషలిస్ట్ నాయకుడు ?
- జయప్రకాశ్ నారాయణ
83. ''తెలంగాణ ప్రజాసింహం వంటిది. అది నిద్రిస్తూనే వుంటుంది. లేచిందా పంజా కొడుతుంది.'' అన్నది. దాశరథి కృష్ణమాచార్య.
84. ఇబ్రహీం కుతుబ్‌షా 1592లో గోల్కొండ నుండి రాజధానిని ఎక్కడికి మార్చినారు? హైదరాబాద్.
85. తెలంగాణలో మూసీనదికి ఆ పేరు ఏ వ్యక్తి పేరుతో వచ్చింది? - ముచికుంద మహర్షి.
86. ''ఆది హిందూభవన్'' ఎక్కడ స్థాపించబడింది- హైదరాబాద్. - 2010 ఫిబ్రవరి3న
87. ''సలాం హైదరాబాద్'' నవలా రచయిత
- పరవస్తు లోకేశ్వర్.
88. జల్-జంగిల్-జమీన్ నినాదం ఎవరిది
- కొమరంభీమ్.
89. ఆదిలాబాద్ గోండులపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్ మానవ శాస్త్రవేత్తలు ఎవరు?
- హైమన్ డార్ఫ్.
90. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మునగాల జమీందార్ ఎవరు?
నాయని వెంకట రంగారావు - బహద్దూర్.
91. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ''బేతవోల్'' జమీందార్ ఎవరు?
తడకమళ్ళ రామచంద్రారావు.
92. తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ పటం ఆవిష్కరించింది ఎవరు?
టి. పురుషోత్తమరావు.
93. ప్రపంచంలో ఎక్కువగా ముత్యాలు దొరుకుస్థలం
- హైదరాబాద్.