మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్కు
జిల్లా: రంగారెడ్డి
విస్తీర్ణం: 14.59 చదరపు కిలోమీటర్లు
నోటిఫైడ్ తేదీ: 05.10.1994
ఉష్ణోగ్రత: గరిష్ఠం 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిష్ఠం 9 డిగ్రీల సెంటీగ్రేడ్
వర్షపాతం: వర్షాకాలం-జూన్ నుండి సెప్టెంబర్ వరకు (నైరుతి రుతుపవనాలు) సగటు వర్షపాతం 750 మి.మీ నుండి 1100 మి.మీ వరకు
అటవీ వర్గీకరణ: దక్షిణ ఆయనరేఖా ఆకురాల్చు అడవి
వన్యమృగసూచి: కృష్ణజింక
విశిష్ఠత: హైదరాబాద్ నగరంలో అంతరించిపోయే ప్రమాదం గల కృష్ణజింకకు తగిన అభయారణ్యం.
చేరుకోవటం ఎలా: హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్ -65)పై హైదరాబాద్ నుండి 13 కి.మీ.
చరిత్ర: ఈ ప్రాంతాన్ని పూర్వం పచ్చిక భూములుగా వర్గీకరిం చారు. పూర్వం రాచకుటుంబీకులు వేటకు ఈ ప్రాంతాన్నే ఎంచుకునేవారు. ఈ అడవిలో కృష్ణజింకలు, చింకారాలు, ఒకప్పుడు చిరుతలు కూడా సమృద్ధిగా ఉండేవి. అటవీశాఖ నిజాం నుండి ఈ భూమిని కొనుగోలు చేసి, ఈ అడవిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.
ఈ పార్కు గురించి: ఈ జాతీయ పార్కు కార్బన్‌ను తగ్గించే కేంద్రంగా ఉపయోగపడుతోంది. జంట నగరాల్లోని కార్బన్ డై ఆక్సైడ్‌ను ఈ అభయారణ్యం స్వీకరించి, నగర వాసులకు ఆరోగ్యకరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నది. అంతరించి పోతున్న కృష్ణజింకకు, ఇంకా మరిన్ని వన్యజీవులకు ఈ వనం అభయారణ్యంగా ఉంది.
మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్కు
May 13, 2016
Tags