2016 టి-20 ప్రపంచకప్ క్రికెట్
విజేత వెస్టీండీస్
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ విరాట్ కోహ్లీ
టి-20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ పరంపరలో 6వ టోర్నీ 2016 మార్చి, ఏప్రిల్ లలో భారత్‌లో జరిగింది. అర్హతకై పోటీపడిన దేశాలతో కలిపి మొత్తం 16 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. సూపర్-10 దశలో 10 దేశాలు రెండు జట్లుగా పోటీపడి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, భారత్, వెస్టీండీస్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్, వెస్టీండీస్ జట్ల మధ్య ఏప్రిల్ 3న కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్‌లో జరుగగా వెస్టీండీస్ జట్టు 4 వికెట్ల తేడాతీ ఇంగ్లాండుపై విజయం సాధించి రెండోసారి టి-20 కప్ సాధించింది.
పాల్గొన్న దేశాలు:
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టీండీస్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. సూపర్ 10లో ఆడిన ఈ దేశాలు కాకుండా నెదర్లాండ్స్, ఓమన్, ఐర్లాండ్, జింబాబ్వే, స్కాంట్లాండ్, హాంకాంగ్‌లు అర్హత దశలోనే వెనుతిరిగాయి. సూపర్ 10లోపాల్గొన్న 10 దేశాలలో గ్రూప్ 1 నుంచి వెస్టీండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి న్యూజీలాండ్, భారత్ సెమీస్ చేరాయి.
సెమీఫైనల్స్:
తొలి సెమీఫైనల్‌లో న్యూజీలాండ్ పై ఇంగ్లాండ్ 7 వికెట్లతో విజయం సాధించగా, రెండో సెమీస్‌లో వెస్టీండీస్ భారత్‌పై 7 వికెట్లతో గెలుపొందినది.
ఫైనల్ మ్యాచ్:
ఏప్రిల్ 3న కోల్‌కతలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టీండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లకు 155 పరుగులు చేయగా, వెస్టీండీస్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించి రెండోసారి కప్ గెలుచుకుంది.
టోర్నీ రికార్డులు:
మ్యాన్ ఆఫ్ ది సీరీస్: విరాట్ కోహ్లీ
అత్యధిక పరుగులు చేసినది: తమిమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)
అత్యధిక వికెట్లు తీసినది: మహ్మద్ నబి (అఫ్ఘనిస్తాన్)
భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసినది: విరాట్ కోహ్లీ.