Type Here to Get Search Results !

Vinays Info

Ts History bits

Top Post Ad

సీఎం కేసీఆర్ జాతీయ జండాను తొలిసారిగా ఎక్కడ ఎగురవేశారు?
- గోలకొండ కోటపై, ఆగస్టు 15న
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎన్ని కి.మీ.లు?
- 1586.09 కి.మీ. (6 జాతీయ రహదారులు)
తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరికి పేరు?
- సంగెం లక్ష్మీబాయి
హైదరాబాద్ ప్రకాశం అంటే ఎవరు?
- స్వామి రామానంద తీర్థ
1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్?
- కాశీనాథరావ్ వైద్య
ఇండియన్ తోరోదత్ అని ఎవరిని అంటారు?
- సరోజినీ నాయుడు
తెలంగాణ పటేల్ అంటే ఎవరు?
- బొమ్మకంటి సత్యనారాయణ రావు
హైదరాబాద్ సింహం?
- పండిత నరేంద్రజీ
ఇండియన్ మార్టిన్ లూథర్, ఇడియన్ ఐన్‌స్టీన్ ఎవరు?
- ఆచార్య నాగార్జునుడు
దాశరథి కృష్ణమాచార్యుని రచనలు?
- అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, కవితా పుష్పకం, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం
ఉమర్ ఖయ్యూం రచించిన తెలంగాణ కవి?
- బూర్గుల రామకృష్ణారావు
1921లో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన వ్యక్తి?
- అల్లంపల్లి వెంకట రామారావు
హైదరాబాద్ భారతదేశం అనే గుండెపై పుట్టిన రాచపుండు అన్నదెవరు?
- సర్దార్ పటేల్
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఎవరు?
- కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి
తెలంగాణలో ఒగ్గు కథా చక్రవర్తి అని ఎవరిని అంటారు?
- మిద్దె రాములు
హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ నుంచి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా మిగలనివ్వను అని శపథం చేసింది ఎవరు?
- సర్దార్ పటేల్
నిజాం రాజ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్ట్?
- నిజాం సాగర్ ప్రాజెక్ట్ (మంజీరా నదిపై)
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరు?
- చిన్నారెడ్డి
తెలంగాణ కోసం కేశవరావ్ జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
- 1997, అక్టోబర్ 28న
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎప్పుడు నిర్మించారు? ఫలక్‌నుమా అంటే అర్థం?
- 1884, మార్చి 3న నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం
నిజాం రాజు అధికార నివాసం?
- చౌమొహల్లా ప్యాలెస్
మా హైదరాబాద్ గ్రంథ రచయిత?
- శ్రీధర్ ధర్మాసనం
కులం అణచివేత మీద కంచె ఐలయ్య రాసిన పుస్తకం?
- STATE AND REPRESSIVE CULTURE
నక్సలైట్లు దేశభక్తులు అని అన్నదెవరు?
- మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన తెలంగాణ కవి?
- దాశరథి రంగాచార్య
దగాపడ్డ తెలంగాణ రాసిందెవరు?
- గాదె ఇన్నయ్య

గద్దర్ అసలు పేరు? ఆయన ఎక్కడ జన్మించారు?
- విఠల్‌రావు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు?
- అల్లం నారాయణ
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్?
- కట్టా శేఖర్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)
తెలంగాణ డిమాండ్ డే ఎప్పుడు?
-1969, మే 1 (తెలంగాణ ప్రజాసమితి ప్రకటించింది)
తెలంగాణ సిద్ధాంత కర్త?
- ప్రొ. జయశంకర్
భాగ్యోదయం గ్రంథం రాసిన భాగ్యరెడ్డివర్మ కుమారుడు?
- ఎంబీ గౌతమ్
ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు?
- భాగ్యరెడ్డి వర్మ
అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిందెవరు?
- అరిగె రామస్వామి (దళిత ఉద్యమనేత)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తేదీ?
- 1947, సెప్టెంబర్ 11
కాకతీయులను శూద్రులుగా పేర్కొన్న శాసనం?
- వర్ధమానపుర శాసనం
తెలంగాణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది?
- 2014, ఫిబ్రవరి 20న
నిజామాబాద్ జైలు గోడలపై విప్లవ గీతాలు రాసిన తెలంగాణ కవి?
- దాశరథి కృష్ణమాచార్య
అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ?
- కాకతీయ వర్సిటీ
కాళోజీ పూర్తి పేరు?
- రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు
గేట్ వే టు తెలంగాణ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
- కోదాడ
ఐక్యరాజ్య సమితిలోని (2015, సెప్టెంబర్) జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం వచ్చిన తెలంగాణ విద్యార్థులు?
- మాలావత్ పూర్ణ (నిజామాబాద్ జిల్లా), సాదిక్ పాషా (ఖమ్మం)
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి
బతుకమ్మా బతుకు రచయిత?
- శ్రీగిరిజామనోహరబాబు
పుట్టుక నీది, చావు నీది... బతుకంతా దేశానిది అన్నదెవరు?
- కాళోజీ
1968లో తొలి దశ ఉద్యమంలో తెలంగాణలో ఫ్లాగ్‌డేని ఎప్పుడు నిర్వహించారు?
- జూలై 12న
పింగళి జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్‌ని దేనిగురించి నియమించారు?
- 1952లో ముల్కీ ఉద్యమం-పోలీసుల కాల్పుల గురించి
అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది?
- శాలిబండ, హైదరాబాద్
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట రాసి పాడింది ఎవరు?
- గద్దర్, 1997లో
2008లో 610 జీవో అమలు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎవరు?
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు?
- బెల్లి లలిత
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు 2007లో ఏర్పడిన సంస్థ?
- తెలంగాణ జాగృతి
తెలంగాణ ప్రభుత్వ తొలి కార్యదర్శి?
- రాజీవ్ శర్మ
రాళ్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?
- కరీంనగర్ జిల్లాలో
రావి నారాయణరెడ్డి ఆడిటోరియం ఎక్కడ ఉంది?
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయిన తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తి?
- పీవీ నరసింహారావు
1968లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆరుట్ల కమలాదేవి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అయితే ఆమెకు ఉన్న మరోపేరు?
- అభినవ రుద్రమ
సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించిందెవరు?
- ప్రొ. కేశవరావు జాదవ్ (1969లో)
తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయం?
- ఉస్మానియా యూనివర్సిటీ
నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు?
-అయ్యపు వెంకటరమణ
తెలంగాణలో నృత్య సంబంధ కళా రూపాల్లో ఒకటి?
- థింసా
1860లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా (ఆదిలాబాద్ జిల్లాలో) పోరాటం చేసిన గోండుల నాయకుడు?
- రాంజీ గోండు
పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణమైన ఉద్యమం?
- జై ఆంధ్ర ఉద్యమం
హైదరాబాద్ సంస్థానంలో అల్తాఫ్ బల్దా అంటే ఏ జిల్లా?
- రంగారెడ్డి
రాష్ట్ర తొలి వైద్య ఆరోగ్య శాఖామంత్రి?
- టీ రాజయ్య
ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల విజ్ఞాన సర్వస్వం రాసిన చరిత్రకారుడు?
- బీఎన్ శాస్త్రి
ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా అన్న తెలంగాణ వాగ్గేయ కారుడు?
- భక్త రామదాసు
పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ నృత్యకారుడు?
- నటరాజ రామకృష్ణ
నిజాం కాలంలో టంకశాలగా పేరొందిన వజీరాబాద్‌ను ప్రస్తుతం ఏమని వ్యవహరిస్తున్నారు?
- వాడపల్లి
ముల్కీ నిబంధనల అమలు గురించి ఐదు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చిన ప్రధాని?
- ఇందిరాగాంధీ
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అందించిన మొదటి గ్రంథం?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన అబ్రహం లింకన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నించిన మునగాల జమీందార్ ఎవరు?
- రాజా నాయని వెంకటరంగారావు బహద్దూర్
తెలంగాణలో తొలి రైతు కావ్యం?
- గంగుల శాయిరెడ్డి రాసిన కాపుబిడ్డ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా చూస్తే తెలంగాణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకంటే పెద్దది
1. తెలంగాణ- 11,48,000 చ.కి.మీ.
2. కోస్తాంధ్ర- 9,28,000 చ.కి.మీ.
పాత తరం జర్మలిస్టు ధర్మవరపు సీతారాం స్వస్థలం? ఆయన ఏయే సంస్థలో పనిచేశారు?
- నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ సమీపంలోని లక్కవరం. ఆయన UNI STATESMEN వార్త సంస్థలో, ECONOMIC TIMES, పేట్రియాట్, లింక్ పత్రికల్లో పనిచేశారు.
మునగాల రాజా నాయని వెంకట రంగారావుకు కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చిందెవరు?
- ఆంధ్ర విశ్వవిద్యాలయం (1953లో)
మన తెలంగాణము పేరుతో వ్యాసాలను సంకలనం చేసిందెవరు? ఎప్పుడు?
- వట్టికోట ఆళ్వారు స్వామి, 1956లో
హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గంలో మొదటి డిప్యూటీ స్పీకర్?
- శ్రీపంపన గౌడ
హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి?
- బూర్గుల రామకృష్ణారావు
1997లో జై తెలంగాణ పార్టీని స్థాపించింది ఎవరు?
- ఇంద్రారెడ్డి
6 సూత్రాల పథకం ఏర్పాటు
- 1973, సెప్టెంబర్ 21
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిజాం ప్రభుత్వం ఎప్పుడు నిషేధించింది?
- 1938, సెప్టెంబర్ 8న
హైదరాబాద్ చరిత్రలో నగర కొత్వాల్ (పోలీస్ కమిషనర్)గా పనిచేసిన మొదటి హిందువు?
- వెంకట్రామిరెడ్డి
విప్లవ రచయితల సంఘం (విరసం) ఎప్పుడు ఏర్పడింది?
- 1970, జూలై 4
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు?
- దొడ్డి కొమరయ్య, 1946, జూలై 4న కడివెండిలో
కరీంనగర్ జిల్లాలో పశ్చిమ కనుమలకు ఏమని పేరు?
- రాఖీ గుట్టలు
తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు శాస్త్రీయనామం?
- ట్రెనర్స్ కాషియా
ప్రాణహిత నది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది?
- చెన్నూరు వద్ద
తెలంగాణలో పటం సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించేవారు?
- కాటిపడగలు, గౌడజెట్టి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కొర్రాజుల, కూనపులి, మాసయ్యలు, పాండువలోల్లు, తెరచీరలు, పూజారి మొదలైనవారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు?
- కాసోజు శ్రీకాంతాచారి (పొడిచేడు గ్రామం), 2009, డిసెంబర్ 3
మునగాల ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలన్నది ఎవరు?
- నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
బర్మా దేశంలో బౌద్ధం వ్యాపించడానికి కారణమైన పాలకులు?
-శాలంకాయనులు
దగాపడ్డ తెలంగాణ అని ఎక్కడ జరిగిన సభకు పేరుపెట్టారు?
- భువనగిరి
తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ సభ్యుల సంఖ్య?
- ఐదు
మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన వ్యక్తి?
- ఎంవీ రాజు (హుజూర్‌నగర్, నల్లగొండ జిల్లా)
భారతదేశంలోని ప్రసిద్ధ కట్టడాల్లో మక్కా మసీద్ ఒకటి అన్న ఫ్రెంచి యాత్రికుడు?
- ట్రావెర్నియర్
భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసింది ఎవరు?
- నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు
మలి దశ ఉద్యమకాలంలో కేసీఆర్ ఎక్కడ పాదయాత్ర చేశారు?
- కోదాడ నుంచి హాలియా వరకు (నల్లగొండ జిల్లా)
-వరంగల్ జిల్లాలో జనగాం సమీపంలోని ఎర్రిగొల్లిపాడుకు చెందిన పులి రామక్క రజాకార్లను నరికి చంపింది. ఈ సంఘటన చరిత్రలో మరువలేనిది.
భారతదేశపు బుడాపెస్ట్ అని ఏ నగరాన్ని అంటారు?
- హైదరాబాద్
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు?
- నవాబ్ సర్ విఖారుల్ ఉలమా
పురానాపూల్‌ను పారిస్‌లోని ఫోర్ట్ న్యూఫ్‌తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?
- ట్రావెర్నియర్ (1645లో)
పురానాపూల్‌కు మరోపేరు?
- బ్రిడ్జ్ ఆఫ్ లవ్
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలిపే చెరువుకట్టను ఏమంటారు?
- హుస్సేన్‌సాగర్ ఆనకట్ట (ట్యాంక్‌బండ్)
ఈసా, మూసా (మూసీ) నదుల సంగమం వద్ద మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నీటిలో కలిపారు.
హైదరాబాద్‌లో గోషామహల్‌ను ఎవరు, ఎందుకు నిర్మించారు?
- అంతఃపుర స్త్రీల సరససల్లాపాల కోసం అబుల్ హసన్ తానీషా నిర్మించాడు
పెద్దమనుషుల ఒప్పందంలో (1956 ఫిబ్రవరి 20న) ఉన్న ఉపముఖ్యమంత్రి పదవి ఆరో వేలుతో సమానం అన్నది?
- నీలం సంజీవరెడ్డి
610 జీవోను ఏ కమిటీల సిఫారసు ఆధారంగా ఎన్టీ రామారావు 1985, డిసెంబర్ 30న ప్రవేశపెట్టారు?
- జై భారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని నాటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పార్లమెంటులో ఎప్పుడు ప్రకటించారు?
- 2013, ఆగస్టు 5న
50 సంవత్సరాల హైదరాబాద్ రచయిత ఎవరు?
- ముందుముల నరసింగరావు
50 సంవత్సరాల జ్ఞాపకాలు రచయిత?
- దేవులపల్లి రామానుజరావు
బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర రాసిందెవరు?
- ఉమ్మెత్తల కేశవరావు
తెలంగాణ పోరాట స్మృతులు రచయిత?
- ఆరుట్ల రామచంద్రారెడ్డి
పులిజాల రంగారావు జీవిత చరిత్ర రచయిత ఎవరు?
- బీఎన్ శాస్త్రి
తెలంగాణ సాయుధ పోరాటం- నా అనుభవాలు రాసిందెవరు?
- నల్లా నర్శింహులు
తెలంగాణ ఉద్యమానికి తొలి వేదిక?
- ఖమ్మం జిల్లా పాల్వంచ
2002, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రసమితి ప్రథమ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
- నల్లగొండ
2011, జూలై 21న పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్నది ఎవరు?
- యాదిరెడ్డి
తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చంచల్ గూడ జైల్లో ఎప్పుడు దీక్ష చేశారు?
- 2013, ఆగస్టు 25న
షేర్వానీ ధరించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన నిజాం?
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఆరో నిజాం)
ముల్కీ ఉద్యమ నేపథ్యంలో కుమార్ లలిత్ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి?
- కాసు బ్రహ్మానందరెడ్డి
ఇటీవల 8 గంటలపాటు 18 దేవాలయాల్లో భక్తి గీతాలు పాడిన తెలంగాణ గాయకుడు?
- భళ్లిమూడి రాంప్రసాద్ శర్మ
2012లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత?
- పెద్దిబొట్ల సుబ్బరామయ్య
మేడార జాతర గ్రామం (సమ్మక్క సారక్క) వరంగల్ జిల్లా కేంద్రానికి ఎంత దూరంలో ఉంది?
- 110 కి.మీ. (తాడ్వాయి మండలం)
వీ6 న్యూస్ చానల్‌లో ప్రసారమవుతున్న తీన్మార్ కార్యక్రమంలో వచ్చే బిత్తిరి సత్తి అసలు పేరు?
- చేవెళ్ల రవి
ఇటీవల దాశరథి పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?
- తిరుమల శ్రీనివాసాచార్య
తెలంగాణ చరిత్రను తెలిపే వెయ్యేండ్ల వీణవంక రాసింది ఎవరు?
- ఆవాల బుచ్చిరెడ్డి
తెలంగాణ భాషలో కైకిలి అంటే?
- కూలి
చారిత్రక అజంజాహి మిల్లు ఏ నగరంలో ఉంది?
- వరంగల్
మెదక్ జిల్లా పిత ఎవరు?
- జాకన్నగారి రాంరెడ్డి
భారతదేశంలో ఉన్న ఏకైక స్పాంజ్ ఐరన్ ఉక్కు కర్మాగారం తెలంగాణలో ఎక్కడ ఉంది?
- ఖమ్మం జిల్లా పాల్వంచ
తెలంగాణలో గ్రామీణ జనాభా ఎక్కువగా లేని జిల్లా ఏది?
- హైదరాబాద్
ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో ఏ శిలపై ప్రతిష్టించారు?
- జీబ్రాల్టర్ శిల
వజీర్ సుల్తాన్ కంపెనీని హైదరాబాద్‌లోని అజామాబాద్‌లో ఎప్పుడు నెలకొల్పారు?
- 1930లో
ఢిల్లీకి హైదరాబాద్‌కు మధ్య దూరం?
- 1680 కి.మీ.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని మా భూమిగా సినిమా తీసిన దర్శకుడు?
- బీ నర్సింగరావు (1979) మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఈ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లేకి నందీ అవార్డ్ అందుకున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్ (హిందీ) ఏ జిల్లాకు చెందినవారు?
- కరీంనగర్
1975లో బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు హీరోయిన్?
- సంగీత (హన్మకొండకు చెందినవారు)
తొలి తెలుగు సినీ కవి?
- చందాల కేశవదాసు (భక్త ప్రహ్లాద- 1931). ఆయన ఖమ్మం జిల్లా జక్కెపల్లికి చెందిన వారు.
మషీర్-ఏ-దక్కన్ పత్రికను నడిపించిందెవరు?
- మాడపాటి హన్మంతరావు
తెలంగాణలో తొలి తెలుగు దినపత్రిక?
- తెలంగాణ (1941-42), దీన్ని బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించారు.
తెలంగాణ జర్నలిజానికి పూజనీయుడనదగినవాడు?
- షోయబుల్లాఖాన్
వందేమాతరం గీతాన్ని ఆలపించిన రామచంద్రరావు ఇంటిపేరు?
- వావిలాల
ఆర్యసమాజానికి పోటీగా నిజాం స్థాపించిన పోటీ సంస్థలు ఏవి?
- దీన్‌దార్, తబ్లిక్, ఇత్తేహాదుల్ ముసల్మీన్
ఏడో నిజాంపై బాంబు విసిరింది ఎవరు?
- నారాయణరావు పవార్ (20 ఏండ్ల వయస్సులో), 1947, డిసెంబర్ 4న
హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లో ఆర్యసమాజంను ఎప్పుడు స్థాపించారు?
- 1892లో
తెలంగాణ సాయుధపోరాట తొలి విప్లవ విజయం?
- చాకలి ఐలమ్మ పోరాటం (1945)
దేవరకొండ గాంధీ అంటే ఎవరు?
- మునగాల కొండలరావు
కోదాడ గాంధీ అని ఎవరిని అంటారు?
- గుడుగుంట్ల అప్పయ్య
తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు?
- సర్దార్ జమలాపురం కేశవరావు
దిగంబర కవి నిఖిలేశ్వర్ అసలుపేరు?
- యాదవరెడ్డి
ప్రజానాట్య మండలిని ఎప్పుడు ప్రారంభించారు?
- 1943లో
గజల్ ప్రక్రియను తెలుగులో ప్రారంభించింది?
- డా. సి.నారాయణ రెడ్డి
తొలి తెలుగు శతావధానం 1285లో కాకతీయుల ఆస్థానంలో జరిగింది. మల్లినాధుడు (సిద్ధాంత గ్రంథం)
- రాళ్లబండి కవితా ప్రసాద్
తెలంగాణ ప్రథమ శతావధాని?
- శ్రీమాన్ శిరిశినగల్ కృష్ణమాచార్యులు
చండూరు సాహితీ మేఖలను స్థాపించింది ఎవరు?
- 1934లో నల్లగొండ జిల్లా చండూరులో అంబడిపూడి వెంకటరత్నం
తెలంగాణ నాటక సంప్రదాయ కళారూపాలు ఏవి?
- దాసరి బాగోతం, వీధి నాటకం, చెంచునాటకం, గంటి బాగోతం, గొండి బాగోతం
తెలంగాణ ఇంద్రజాల సంప్రదాయ కళా రూపాలు?
- కాటిపాపలు, యక్షిణి, పెద్దమ్మలు
రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ముగిసింది?
- 1951, అక్టోబర్ 21న
మా భూమి నాటకాన్ని రాసిందెవరు?
- 1947లో సుంకర సత్యనారాయణ
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపన సభకు అధ్యక్షులు?
- పాల్వంచ జమీందారు పార్థసారధి అప్పారావు (1901, సెప్టెంబర్ 1)
శేషాద్రి రమణ కవులు ఎవరు?
- దూపాటి వెంకట రమణాచార్యులు, దూపాటి శేషాచార్యులు
1918లో సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు?
- పువ్వాడ వెంకటప్పయ్య
తెలంగాణలో మొదటి సాంఘిక నాటకం ఏది? రాసింది ఎవరు?
- కనక దాసు, చందాల కేశవదాసు
హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ మాట్లాడేవారి సంఖ్య?
- 12 శాతం
కాళోజీ సోదరులు అంటే ఎవరు?
- కాళోజీ రామేశ్వరరావు (ఉర్దూ), కాళోజీ నారాయణ రావు (తెలుగు)
తొలి తెలుగు కథకురాలు ఎవరు?
- బండారు అచ్చమాంబ
కలం అలలపై తేలేను మనసు మల్లెపూవై అనే సినిమా పాటను రాసిన తెలంగాణ కవి?
- డా. సి.నారాయాణ రెడ్డి (గులే భకావళి కథ)
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన రోజు?
- 2011, జనవరి 6న
రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
- 2014, నవంబర్ 6న (ఎస్సీ, ఎస్టీల కోసం)
కోటిలింగాల బౌద్ధ ఆరాధనా స్థలమని తెలిపే జాతక కథ ఏది?
- శెరవనిజ (శ్రీవనిజ)
గౌతమ బుద్ధుడు చేర్చుకున్న (బౌద్ధ సంఘంలో) రాజ నర్తకి ఎవరు?
- ఆమ్రపాలి
దాశరథి కృష్నమాచార్య రాసిన జాతక కథల పద్యకావ్యం పేరు?
- మహాబోధి (1960)
-బావరి (నిజామాబాద్ జిల్లా) శిష్యులు బుద్ధునితో సంభాషించిన పాళీ భాషలోని గ్రంథాలు
1. సుత్తనిపాత 2. పారాయణ వగ్గ
తెలుగు భాషలో తొలిసారిగా బౌద్ధంతో పరిచయం కలిగించిన గ్రంథం?
- పాల్కురికి సోమన రాసిన పండితారాధ్య చరిత్ర
బుద్ధుని జ్ఞాన సిద్ధాంతానికి పునాది ఏది?
- ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం
తెలంగాణలో బౌద్ధమత వ్యాప్తికి కారణమైన తత్వవేత్తలు?
- ఆచార్య నాగార్జునుడు. ఆర్య దేవుడు, బుద్ధఘోషుడు, బుద్ధ పాలితుడు, వసు బంధుడు, అసంగుడు, ధర్మకీర్తి
తెలంగాణలో ఇక్షాకుల తర్వాత బౌద్ధాన్ని ఆదరించిన రాజులు?
- విష్ణు కుండినులు
నాగార్జునకొండలో నివసించిన బౌద్ధ శాఖ ఏది?
- మహా సాంఘిక శాఖ
డా. సి.నారాయణ రెడ్డి రాసిన పద్యకావ్యం (బౌద్ధం) ఏది
నాగార్జున సాగరం

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.