Type Here to Get Search Results !

Vinays Info

కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం

కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం
(Kohlberg Theory of Moral Development)
'సత్ప్రవర్తనతో కూడిన విద్యే నిజమైన విద్య'. అందులో నైతిక వికాసమంటే శీల వికాసమే (Character development). తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించగల నైతిక వైఖరులను అభివృద్ధి చేసుకోగల వ్యక్తి సామర్థ్యాన్నే 'నైతిక వికాసం' అంటారు. ఇందులో మంచి, చెడులను వివేకంతో విశ్లేషించడం, పాపభీతి, ఇతరుల స్థానంలో తన పరిస్థితులను ఉంచి ఊహించడం, ఆపదలో ఇతరులకు సహాయపడటం మొదలైనవి ఉంటాయి.
శిశువికాసం - అధ్యాపనం
కోల్‌బర్గ్నైతికవికాససిద్ధాంతం (Kohlberg Theory of Moral Development)
అమెరికాలోనిహార్వర్డ్విశ్వవిద్యాలయానికిచెందినలారెన్స్కోల్‌బర్గ్అనేమనోవైజ్ఞానికశాస్త్రవేత్తవివిధసంస్కృతులకుచెందినవందలమందిపిల్లలనుఅధ్యయనంచేసినైతికవికాససిద్ధాంతాన్నిరూపొందించారు.
ముఖ్యాంశాలు:
¤ప్రతివ్యక్తినైతికతఅతనిసంజ్ఞానాత్మకవికాసం, పెంపకం, సామాజికఅనుభవాలపైఆధారపడిఉంటుంది.
¤ఒకదశతర్వాతదశలుపూర్వదశతోకలసిఉంటాయి.
¤నైతికవికాసంఎల్లప్పుడూపురోగమనాన్నిచూపుతుందికానీతిరోగమనాన్నిచూపదు.
¤కోల్‌బర్గ్అభిప్రాయంప్రకారంసమాజంలోనివయోజనుల్లో 10% మాత్రమేఉత్తరసాంప్రదాయస్థాయికిచేరుకుంటారు. ఈదశకేవలంసామాజికప్రయోజనాలకుమాత్రమేకానీ, వ్యక్తిగతస్వార్థాలకుకాదు.
నమూనా ప్రశ్నలు
1. 'హుద్‌హుద్' తుపాను బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యత అని గుర్తించిన శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహకారాన్ని అందిస్తే కోల్‌బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు?
1) విధేయత, శిక్ష 2) మంచిబాలునినీతి
3) సహజసంతోషం 4) అధికారం, సాంఘికక్రమాన్నిఅనుసరించేనీతి
జ: అధికారం, సాంఘికక్రమాన్ని అనుసరించే నీతి
2. జశ్వంత్, నిహారిక అనే పిల్లలు తల్లి కోపగించుకుంటుందనే కారణంతో ఇంట్లోని ఏ వస్తువు తీసుకోరు, తినరు. వీరు కోల్‌బర్గ్ సూచించిన ఏ స్థాయికి చెందినవారిగా పరిగణించాలి?
జ: పూర్వ సాంప్రదాయ స్థాయి
3. కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంత లక్షణమేది?
1) వరుసక్రమనమూనానుఅనుసరించేదశలులేవు.
2) ముందుకుసాగేక్రమంలోఏకరూపతలోపించినదశలు.
3) వరుసఆకృతులులేకుండాప్రతిదశవేర్వేరుప్రతిక్రియలతోకూడిఉంటుంది.
4) అన్నిసంస్కృతుల్లోసాధారణంగాఉండేసార్వత్రికదశలు.
జ: అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు.
4. ప్రశాంత్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పుకాదని చెప్పడం కోల్‌బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది?
జ: ఉత్తర సాంప్రదాయ స్థాయి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section