Type Here to Get Search Results !

Vinays Info

జిల్లా పరిషత్

జిల్లా పరిషత్» 

భారతదేశంలో మొత్తం 537 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి.» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్‌ను ఏర్పరచింది.» జిల్లా పరిషత్‌లో ఎక్స్అఫీషియో సభ్యులు, ఆ జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లాలో ఓటరుగా నమోదైన MLCలు, ఆ జిల్లాలోని లోక్‌సభ సభ్యులు, ఆ జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ ఓటుహక్కు ఉండదు.» ఆ జిల్లా ఓటర్లుగా నమోదైన ఇద్దరు మైనారిటీ సభ్యుల్ని కో-ఆప్ట్ చేసుకుంటారు.» కో-ఆప్ట్ చేసుకున్నవారికి ఓటు హక్కు ఉంటుంది.» జిల్లా పరిషత్‌లోని ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. వీరు జిల్లాపరిషత్తులో సభ్యులవుతారు.సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు
       i) జిల్లా కలెక్టర్
       ii) జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షుడు
       iii) జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
       iv) జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్
       v) జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్
పై వారు జిల్లా పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ ఓటు హక్కు ఉండదు.» మండల పరిషత్ అధ్యక్షుని గౌరవవేతనం రూ.1500» MPTC గౌరవవేతనం రూ.750» మండల పరిషత్‌కు ప్రభుత్వాధికారి MPDOMPDO విధులు:       i) రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు చేయడం
       ii) మండల పరిషత్ తీర్మానాల్ని అమలు చేయడం
       iii) నెలకోసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం» చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల లోపల మరొక సమావేశం ఏర్పాటు చేయనట్లయితే MPDOపై రాష్ట్రప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.అవిశ్వాస తీర్మానం   i) మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సంతకాలు పెట్టాలి.
   ii) మొత్తం పదవీకాలంలో ఒక వ్యక్తిపై ఒకసారి కంటే ఎక్కువసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదు.
   iii) మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు ఆమోదం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది.
   iv) పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష, ఉపాధ్యక్షులపై 4 సంవత్సరాల్లోపు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు.» పదవిని కోల్పోయిన లేదా రాజీనామా చేసినప్పటికీ రెండేళ్ల లోపు వారిపై విచారణ పూర్తి కావాలి.» ఈ విధంగా తొలగినవారు రెండేళ్ల వరకు పోటీ చేయరాదు.ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై నిబంధనలు   i) పదవిలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి.
   ii) 2/3వ వంతు సభ్యుల సంతకాలతో కలెక్టర్‌కు, CEOకు ఒక ప్రతిని అందించి, ఒక ప్రతిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు అందించాలి.
   iii) అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
   iv) సగానికంటే ఎక్కువ మంది హాజరై సాధరణ మెజారిటీతో తొలగించవచ్చు.

జిల్లా పరిషత్‌లో 7 స్థాయీ సంఘాలుంటాయి
       i) ప్రణాళిక, ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం
       ii) అభివృద్ధి పనుల స్థాయీ సంఘం
       iii) గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం
       iv) వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం
       v) సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం
       vi) స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం
       vii) విద్య, వైద్య సేవల స్థాయీ సంఘం
» అన్ని స్థాయీ సంఘాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ సభ్యునిగా వ్యవహరిస్తారు.
» అన్ని స్థాయీ సంఘాలకు సభ్యులను జిల్లా పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు.
» ఏ రాజకీయ పార్టీకి చెందని వారిని, జిల్లా పరిషత్‌కు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవొచ్చు కానీ ఓటు హక్కు ఉండదు.
» జిల్లా పరిషత్‌కు చెందిన సభ్యులు పార్టీ ఆదేశానుసారం 'చేతులెత్తే' విధానం ద్వారా తమలో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
» ఎవరైని సభ్యుడు పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తే అతని సభ్యత్వం రద్దవుతుంది.
» MLA, MPలు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికైతే 15 రోజుల లోపు తమ MLA, MP పదవులకు రాజీనామా చేయాలి. లేకపోతే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు రద్దవుతాయి.
» జిల్లా పరిషత్ సభ్యులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల కాలపరిమితి అయిదేళ్లు.
» ఓటరు జాబితాలో పేరు నమోదై 21 సంవత్సరాలు నిండినవారు జిల్లా పరిషత్ సభ్యునిగా పోటీ చేయడానికి అర్హులు.
» ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీ చేయడానికి అనర్హులు.
» ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఎన్నికైన సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు రాజీనామా లేఖల్ని కలెక్టరుకు పంపించాలి.
» ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు చేయనప్పుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు, తమ స్వార్థానికి అధికారాన్ని వినియోగించుకున్నప్పుడు, అధికార విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు విషయాన్ని వారికి తెలియజేసి అభ్యంతరాల్ని స్వీకరించి తొలగించవచ్చు.
» ఆయా స్థాయీ సంఘాల్లోని సభ్యులు తమరిలో ఒకరిని ఆ స్థాయీ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
» స్థాయీ సంఘాల సమావేశాలు రెండు నెలలకోకసారి తప్పనిసరిగా జరగాలి.
» స్థాయీ సంఘాలు సలహా సంఘాలు మాత్రమే.
» జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని (సీఈవో) రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.
» జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లాపరిషత్ సమావేశాలను సీఈవో ఏర్పాటు చేస్తారు.
» కనీసం నెలకు ఒకసారి సమావేశాన్ని జరపాలి.
» చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల లోపల మరో సమావేశం జరపనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సీఈవోపై క్రమశిక్షణా చర్య తీసుకుంటుంది.
» జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు సంబంధించిన రికార్డుల్ని భద్రపరచి, ఆ సమావేశాలకు సంబంధించిన తీర్మానాల్ని సీఈవో అమలు చేస్తాడు.
» జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సీఈవో పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది.
» రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేయడంతోపాటు, అమలుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించి వాటి ప్రతులను ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు సీఈవో పంపిస్తారు.
» ఛైర్మన్ మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఏదైనా కారణంతో 90 రోజుల్లోగా లేదా, 90 రోజుల తర్వాత 30 రోజుల్లోగా సమావేశాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ఛైర్మన్ తన పదవిని కోల్పోతాడు. పదవి కోల్పోయిన తర్వాత ఏడాది వరకు ఛైర్మన్‌గా ఎన్నిక కావడానికి అనర్హుడవుతాడు.
పట్టణ స్థానిక ప్రభుత్వాలు
» ఒక పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా తమను తాము పరిపాలించుకోవడమే పట్టణ స్థానిక ప్రభుత్వం.
» క్రీ.పూ.4వ శతాబ్దంలో మౌర్యుల కాలంలో మెగస్తనీస్ అనే గ్రీస్ దేశ పర్యాటకుడు భారత్‌లో పర్యటించి 'ఇండికా' అనే గ్రంథాన్ని రచించాడు. దీనిలో పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి పేర్కొన్నాడు.
» అక్బర్‌కు వజీరుగా అబుల్ ఫజల్ ఉండేవాడు. అతడు 'అయిన్-ఇ-అక్బరీ' అనే తన గ్రంథంలో భారత్‌లోని పట్టణ స్థానిక ప్రభుత్వాలను గురించి పేర్కొన్నాడు.
» దేశంలో మొదటిసారిగా 1688 సెప్టెంబర్ 29న మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటైంది.
» 1726లో బొంబాయి, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు.
» 1989లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పట్టణ, నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం 65వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ ఆ బిల్లును చర్చిస్తున్న సమయంలోనే సభ రద్దు కావటంతో బిల్లు కూడా రద్త్ధెంది.
» 1992లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం పట్టణ, నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 74వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదించింది. 20 ఏప్రిల్ 1993న రాష్ట్రపతి ఆమోదం ఈ బిల్లుకు లభించి చట్టమైంది.
» 1993, జూన్1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చింది.
» దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థ - దిల్లీ (1964)
» 1985లో మొదటిసారిగా కేంద్రం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది.
» 74వ రాజ్యాంగ సవరణ ద్వారా IX(A) భాగాన్ని & XIIవ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో కొత్తగా చేర్చారు.
» IX (A) భాగంలో 243P నుంచి 243ZG వరకు మొత్తం 18 ప్రకరణల్ని పొందుపరిచారు.
» 18 అధికార విధులను XIIవ షెడ్యూల్‌లో పొందుపరిచారు.
» మున్సిపాలిటీ వార్డుల సంఖ్య కనిష్ఠంగా 23, గరిష్ఠంగా 50 ఉండాలి.
» మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డుల సంఖ్య కనిష్ఠంగా 50, గరిష్ఠంగా 100 ఉండాలి.
» మెట్రోపాలిటన్ సిటీలో వార్డుల సంఖ్య కనిష్ఠంగా 100, గరిష్ఠంగా 200 ఉండాలి.
» మున్సిపాలిటీ సమావేశం జరిగిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు మున్సిపాలిటీ కొనసాగుతుంది.
» మున్సిపాలిటీ పదవీకాలం ముగిసిన లేదా రద్దయిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
XIIవ షెడ్యూలులోని 18 అంశాలు:

       1) నగర, పట్టణ ప్రణాళికల రూపకల్పన
       2) భూముల క్రమబద్ధీకరణ, భవనాల నిర్మాణం
       3) ఆర్థిక, సామాజికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం
       4) రోడ్లు, వంతెనల నిర్మాణం
       5) పారిశ్రామిక, మానవ వనరుల కోసం నీటి సరఫరా
       6) ప్రజారోగ్యం, పారిశుద్ధ్య కార్యకలాపాల నిర్వహణ
       7) అగ్నిమాపక సేవలు
       8) పట్టణ పర్యావరణ రక్షణ ఏర్పాట్లు
       9) బలహీనవర్గాలు, వికలాంగులు, మానసిక వికలాంగుల ప్రయోజనాలకై రక్షణ చర్యలు
       10) మురికివాడల పరిశుభ్రత/ నిర్మూలన
       11) పట్టణ పేదరిక నిర్మూలన
       12) పార్కులు, తోటల ఏర్పాటు, పర్యవేక్షణ
       13) సాంస్కృతిక విద్యాభివృద్ధి కార్యక్రమాలు
       14) శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ 
       15) జంతు సంరక్షణ, జీవహింస నివారణ
       16) జనన, మరణ నమోదు
       17) పట్టణ మౌలిక సదుపాయాల ఏర్పాటు
       18) జంతు కళేబరాల నిర్వహణ

పట్టణ స్థానిక ప్రభుత్వాలు మొత్తం 8 రకాలు
       1) నగరపాలక సంస్థలు
       2) పురపాలక సంస్థలు
       3) నగర పంచాయతీలు
       4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు
       5) టౌన్ ఏరియా కమిటీలు
       6) కంటోన్మెంటు బోర్డు
       7) టౌన్‌షిప్
       8) పోర్టు ట్రస్టు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section