నగరపాలక సంస్థలు»
రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్)గా ప్రకటిస్తూ శాసనసభలో చట్టం చేయడం ద్వారా ఇవి ఏర్పడ్డాయి.» 3 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి, ఆదాయం రూ. కోటి కంటే ఎక్కువగా ఉంటే వీటిని ఏర్పాటు చేయవచ్చు. జనాభా విషయంలో కొన్ని రాష్ట్రాల మధ్య వ్యత్యాసముంది.» 1950లో హైదరాబాద్ నగరానికి ఒక మున్సిపల్ కార్పొరేషన్‌ను, సికింద్రాబాద్ నగరానికి ఒక మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు.» హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 ప్రకారం 1960 ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లను విలీనం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.» దేశంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్‌ల సంఖ్య 186.» మున్సిపల్ కార్పొరేషన్ల అన్నింటికంటే పెద్దది - గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.» మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్కువగా కలిగిన రాష్ట్రాలు వరుసగా -
మహారాష్ట్ర (26), ఉత్తర్ ప్రదేశ్ (14), మధ్యప్రదేశ్ (14), ఆంధ్రప్రదేశ్ (13), తమిళనాడు (12), కర్ణాటక (11)» తెలంగాణలో 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు 1) గ్రేటర్ విశాఖపట్నం
2) కాకినాడ
3) రాజమండ్రి
4) ఏలూరు
5) గుంటూరు
6) విజయవాడ
7) ఒంగోలు
8) నెల్లూరు
9) తిరుపతి
10) కడప
11) కర్నూలు
12) అనంతపురం
13) చిత్తూరు.తెలంగాణలోని కార్పొరేషన్లు 1) గ్రేటర్ హైదరాబాద్
2) వరంగల్లు
3) కరీంనగర్
4) రామగుండం
5) ఖమ్మం
6) నిజామాబాద్» దేశంలోనే మొదటిసారిగా పర్వీన్ భాను అనే హిజ్రా కర్ణాటకలోని బళ్లారి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.» నగరపాలక పరిధిలో రిజిస్టర్ అయిన ఓటర్లు ప్రత్యక్షంగా కార్పొరేటర్లను ఎన్నుకుంటారు.» వీరి పదవీ కాలం అయిదేళ్లు.» సమావేశాలకు మేయర్ అధ్యక్షత వహిస్తారు.» నగరపాలక పరిధిలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కమిషనర్ సమావేశాల్లో పాల్గొంటారు.» నగరపాలక సంస్థకు ప్రథమ పౌరుడు మేయర్.» మేయర్ రాజకీయ అధిపతి.» మేయర్ పదవీకాలం అయిదేళ్లు.» మేయర్, డిప్యూటీ మేయర్‌లు పార్టీ ప్రాతిపదికపై పరోక్షంగా ఎన్నికవుతారు.
నగరపాలక సంస్థలు
May 15, 2016
Tags