Type Here to Get Search Results !

Vinays Info

పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు)

» పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు)

1965లో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టాన్ని రూపొందించారు. ఇది 1965, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.» 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ 1994లో మరో చట్టాన్ని చేసింది.» నగరపాలక సంస్థకు కింద, నగర పంచాయితీకి పైన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంఘాలు.» పట్టణ జనాభా 20,001 లేదా అంతకుమించితే పురపాలక సంఘాలు ఏర్పడతాయి.» ఆదాయాన్ని బట్టి పురపాలక సంఘాల్ని అయిదు గ్రేడులుగా వర్గీకరించారు.i) సెలక్షన్ గ్రేడ్:
       రూ.8 కోట్లకు మించి ఆదాయముండే పురపాలక సంఘాన్ని 'సెలక్షన్ గ్రేడ్' పురపాలక సంఘమంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 4 ఉంటే తెలంగాణాలో ఒక్కటి కూడా లేదు.
ii) స్పెషల్ గ్రేడ్:
       రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయముండే దాన్ని 'స్పెషల్ గ్రేడ్' పురపాలక సంఘమంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణాలో ఒకటి ఉన్నాయి. 
iii) ఫస్ట్ గ్రేడ్:
       రూ. 4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఆదాయముండే దాన్ని 'ఫస్ట్ గ్రేడ్' పురపాలక సంఘమంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 13, తెలంగాణలో 8 ఉన్నాయి.
iv) సెకండ్ గ్రేడ్: 
       రూ. 2 కోట్లపై నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయముండే దాన్ని 'సెకండ్ గ్రేడ్' పురపాలక సంఘమంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణాలో 15 ఉన్నాయి.v) థర్డ్ గ్రేడ్:
       రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు ఆదాయమున్న మున్సిపాలిటీని 'థర్డ్ గ్రేడ్' మున్సిపాలిటీ అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 18, తెలంగాణాలో 13 ఉన్నాయి.
» ఆంధ్రప్రదేశ్‌లో 67, తెలంగాణాలో 37 పురపాలక సంఘాలు ఉన్నాయి.» 10 లక్షల జనాభా దాటిన ప్రాంతాన్ని 'మెట్రోపాలిటన్'ప్రాంతాలుగా గుర్తిస్తారు.» జనాభాను బట్టి మున్సిపాలిటీలను మూడు గ్రేడులుగా విభజించారు.i) 6 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న పట్టణాలను 'గ్రేడ్-I మున్సిపాలిటీ' అంటారు.
ii) 3 లక్షల నుంచి 6 లక్షల లోపు ఉన్న పట్టణాలను 'గ్రేడ్-II మున్సిపాలిటీలు' అంటారు.
iii) 3 లక్షల్లో జనాభా వున్న పట్టణాలను 'గ్రేడ్-III మున్సిపాలిటీలు' అంటారు.» పురపాలక సంఘం చర్చావేదికను పురపాలక మండలి అంటారు.» పురపాలక మండలి సాధారణంగా నెలకోకసారి సమావేశమవుతుంది.» పురపాలక మండలిలో ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు ఉంటారు.» పురపాలక సంఘాన్ని ఎన్నికల కోసం వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులోని ప్రజలు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు.» ఎక్స్ అఫీషియో సభ్యులు పదవిరీత్యా సభ్యులు.» రాష్ట్ర శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆయా పురపాలక సంఘానికి చెందినవారైతే ఎక్స్ఆఫీషియో సభ్యులవుతారు. వీరికి పురపాలక మండలిలో సభ్యత్వంతో పాటు ఓటు హక్కు కూడా ఉంటుంది.» జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పదవీరిత్యా పురపాలక మండలి సభ్యులే అయినా ఓటు హక్కు ఉండదు.» పురపాలక సంఘాలపై ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు కో ఆప్ట్‌గా ఉంటారు. వీరికి కూడా ఓటు హక్కు ఉండదు. వీరు పురపాలక సంఘం ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి.» మైనారిటీ వర్గానికి చెందిన ఒకరిని సభ్యునిగా నియమిస్తారు. ఈయన పురపాలక సంఘానికి చెందిన ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి.» సభ్యులు, ఛైర్మన్‌ల పదవి కాలం అయిదేళ్లు.» పురపాలక సంఘానికి ప్రథమ పౌరుడు ఛైర్మన్.» ఛైర్మన్ పార్టీ ప్రాతిపదికపై పరోక్షంగా ఎన్నికవుతారు.

మైనారిటీ వర్గానికి చెందిన ఒకరిని సభ్యునిగా నియమిస్తారు. ఈయన పురపాలక సంఘానికి చెందిన ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి.
» సభ్యులు, ఛైర్మన్‌ల పదవి కాలం అయిదేళ్లు.
» పురపాలక సంఘానికి ప్రథమ పౌరుడు ఛైర్మన్.
» ఛైర్మన్ పార్టీ ప్రాతిపదికపై పరోక్షంగా ఎన్నికవుతారు.
» పురపాలక సంఘానికి పాలనాధికారి మున్సిపల్ కమిషనర్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section