నగర పంచాయతీలు
11 వేల కంటే ఎక్కువ, 25 వేల కంటే తక్కువ జనాభా కలిగి ఉండి పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రాంతాన్ని నగర పంచాయతీగా మారుస్తారు.» నగర పంచాయతీలో 10 మంది ఎన్నికైన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.» నగర పంచాయతీ పరిధిలో ఉన్న MLA, MLC, MPలు సభ్యులుగా ఉంటారు.» నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.» అధ్యక్ష, ఉపాధ్యక్షులపై పదవి స్వీకరించిన రెండేళ్ల వరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు.» ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 నగర పంచాయతీలు ఉన్నాయి.నోటిఫైడ్ ఏరియా కమిటీలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి అనువుగా లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా వీటిని ఏర్పాటు చేస్తుంది. అందుకే వీటిని నోటిఫైడ్ ఏరియా కమిటీలు అంటారు.» వీటిల్లో సభ్యులందరినీ ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.టౌన్ ఏరియా కమిటీలు» చిన్న పట్టణాల్లో సెమీ మున్సిపల్‌గా వీటిని ఏర్పాటు చేస్తారు.» వీటిల్లో పూర్తిగా ఎన్నికైన లేదా పూర్తిగా నామినేట్ అయిన లేదా కొందరు నామినేట్, కొందరు ఎన్నికైన సభ్యులు ఉంటారు.» రాష్ట్ర శాసనసభ చేసే చట్టం ద్వారా ఇవి ఏర్పాటవుతాయి.కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సైనిక స్థావరాలున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.» పార్లమెంటు దీనికి సంబంధించిన చట్టాలను చేస్తుంది.» కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని మొదట 1924లో రూపొందించారు.» ఈ చట్టాన్ని 2006లో సవరించారు.» తెలంగాణలో సికింద్రాబాద్‌లోని బొల్లారంలో కంటోన్మెంట్ బోర్డు ఉంది.» ఇందులో పాక్షికంగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవి కాలం అయిదేళ్లు.» దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి.» ఆ ప్రాంత మిలటరీ కమాండింగ్ అధికారి అధ్యక్షులుగా ఉంటారు.» సభ్యులు తమలో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు.» కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు.టౌన్‌షిప్ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగస్థులకు నివాస ప్రాంతాలను ఏర్పరచి ఆ ప్రాంతాల్లో నివసించే వారికి పౌర సదుపాయాల్ని కల్పించే ఉద్దేశంతో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తారు.» వీటిని యాజమాన్యాలే ఏర్పాటు చేస్తాయి.» వీటిల్లో ఎన్నికైన సభ్యులుండరు.» హైదరాబాద్‌లో B.H.E.L టౌన్‌షిప్ ఉంది.» విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ టౌన్‌షిప్ ఉంది.పోర్టు ట్రస్టులు» పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌర సదుపాయాల్ని కల్పించే ఉద్దేశంతో పార్లమెంటు చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు.» ప్రస్తుతం దేశంలో 13 పోర్టు ట్రస్టులు ఉన్నాయి.» ఇందులో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులుంటారు.» పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.» ముంబయి, కోల్‌కత, చెన్నై, విశాఖలలో ఇవి పనిచేస్తున్నాయి
నగర పంచాయతీలు
May 15, 2016
Tags