మండల పరిషత్»
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994, మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్నే 'నూతన పంచాయతీరాజ్ చట్టం' అంటారు.» ఆంధ్రప్రదేశ్‌లో 668 మండలాలు ఉన్నాయి.» తెలంగాణలో 454 మండలాలు ఉన్నాయి.» మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్తు.» మండల పరిషత్తును సుమారు 40 వేల జనాభాతో దాదాపు 20, 30 గ్రామాలతో ఏర్పాటు చేస్తారు.» పంచాయతీరాజ్ కమిషనర్ మండల జనాభాను బట్టి ఆ మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు.» ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలో 3,500 జనాభా ఉంటుంది.» ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి MPTC సభ్యుడిని ఆ ప్రాదేశిక నియోజకవర్గ ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.» మండల పరిషత్‌లో కనిష్ఠంగా ఏడుగురు, గరిష్ఠంగా 23 మంది MPTC సభ్యులుంటారు.» MPTC సభ్యులు ఒకరిని అధ్యక్షుడిగా (ఛైర్మన్), ఒకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్ ఛైర్మన్), కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఒక మైనారిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు.» మండల పరిషత్ కాలపరిమితి అయిదేళ్లు.» మండల అధ్యక్షుడు, సభ్యుల కాలపరిమితి అయిదేళ్లు.» ఏదైనా కారణాల వల్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, సభ్యుల స్థానాలు ఖాళీ అయితే తిరిగి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించి భర్తీ చేయాలి.» శాసనమండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు.» మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యుడు తమ రాజీనామా లేఖను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపాలి.» మండల పరిషత్తులో 6 రకాల సభ్యులుంటారు.
i) మండలంలోని ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రజలు ఎన్నుకున్న సభ్యులు (MPTC)
ii) ఆ మండల పరిధికి చెందిన అసెంబ్లీ సభ్యుడు (MLA)
iii) ఆ మండల పరిధికి చెందిన విధాన పరిషత్ సభ్యుడు
iv) మండల పరిధిలో ఉన్న లోక్‌సభ సభ్యుడు
v) ఆ మండల పరిధిలోని రాజ్యసభ సభ్యుడు
vi) మైనారిటీ వర్గం నుంచి కో-ఆప్ట్ చేసుకున్న సభ్యుడొకరుశాశ్వత ఆహ్వానితులుగా
i) జిల్లా కలెక్టర్
ii) ఆ మండల పరిషత్ పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్‌లు
iii) మండల పరిషత్ పరిధి నుంచి జిల్లా పరిషత్‌కు ఎన్నికైన సభ్యుడు
iv) జిల్లా పరిషత్ ఛైర్మన్
v) వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు» శాశ్వత ఆహ్వానితులు మండల పరిషత్ సమావేశాలకు హాజరుకావచ్చు కానీ ఓటింగ్‌లో పాల్గొనకూడదు.» మండల పరిషత్‌కు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని సమావేశాలకు ఆహ్వానించవచ్చు.» ప్రత్యేక ఆహ్వానితులకు కూడా ఓటు హక్కు ఉండదు.
మండల పరిషత్
May 15, 2016
Tags