Type Here to Get Search Results !

Vinays Info

ఇండియన్ కరెన్సీ కి సంబంధించిన మీకు తెలియని విషయాలు.!

ఇండియన్ కరెన్సీ కి సంబంధించిన మీకు తెలియని విషయాలు.! ఖచ్చితంగా ప్రతి ఇండియన్ తెల్సుకోవాలి...
ప్రపంచం మొత్తాన్ని పచ్చనోటు పరుగులు పెట్టిస్తోంది. ఏదైనా నాతోనే అంటూ సవాల్ చేస్తోంది. అయితే ప్రతిదేశ కరెన్సీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని పుట్టుక, చలామణి వెనుక ఓక్కో దేశానికి ఒక్కో స్టోరీ ఉంటుంది. మనదేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలున్నాయ్.. పాక్ తో మన కరెన్సీ సంబంధం, డాలర్ కన్నా ది బెటర్ స్టేజ్ లో ఉన్న మన రూపాయి గతం ఇలా అన్నింట్లో స్పెషాలిటీ ఉంది మన కరెన్సీకి.
మన కరెన్సీ ప్రత్యేకతలు:
1. 5000 మరియు 10,000 రూపాయల నోట్లు మనదేశంలో 1954 నుండి 1978 మధ్య కాలంలో వినియోగంలో ఉండేవి.
2.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్ దేశం, భారత నోట్లపై పాకిస్థాన్ స్టాంప్ ముద్రించుకొని, ఆ నోట్లనే ఉపయోగించేవారు.
3. 500 మరియు 1000 నోట్లు నేపాల్ లో నిషేధించబడ్డాయి.
4. ఒకానొక సమయంలో 5 రూపాయల నాణేలను, బంగ్లాదేశ్ కు దొంగతనంగా రవాణా చేస్తూ క్షవరం చేసుకునే కత్తెరల తయారీకి వాడేవారట.
5. 10 రూపాయల నాణెం నమూనా చేయడానికి అయ్యే ఖర్చు రూ.6.10 పైసలు
6. ఒక నాణెం ఎక్కడ, ఎప్పుడు ముద్రించబడింది అనే విషయాన్ని కొన్ని గుర్తుల ద్వారా తెలుసుకోవచ్చు.
7. 1917 లో డాలర్ కన్నా మన రూపాయికే విలువ ఎక్కువ. అప్పుడు 1 రూపాయి 13 డాలర్లతో సమానం.
8. చాలావరకు నోట్లపై మనదేశానికి సంబంధించిన వాటినే ముద్రిస్తారు. ఒక్క రూ.20 నోటుపైనే అండమాన్ దీవుల ఆకారం ముద్రింపబడి ఉంటుంది.
9. మీ దగ్గర ఉన్న నోటు చినిగిపోయి ఉంటే, ఆ నోటును బ్యాంక్ లో ఇస్తే కొత్త నోటును బ్యాంక్ అధికారులు తిరిగి ఇస్తారు.
10. సున్నా నోట్లను నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అవినీతికి వ్యతిరేకంగా ముద్రిస్తున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section