ఆఫ్రికా ఖండం
1. ఆఫ్రికా ఖండానికి తూర్పున లేని నైసర్గిక స్వరూపం?
1) హిందూ మహాసముద్రం 2) ఎర్ర సముద్రం
3) ఆసియా ఖండం 4) అట్లాంటిక్ మహాసముద్రం
2. భూమధ్యరేఖా ప్రాంతపు అడవులు దట్టంగా ఉన్న దేశం?
1) అల్జీరియా 2) లిబియా 3) ఈజిప్టు 4) ఉగాండా
3. ఆఫ్రికాలో ఇరుకైన తీరమైదానం సగటు ఎత్తు ఎంత?
1) 10 మీ. 2) 200 మీ.
3) 1000 మీ. 4) ఏదీకాదు
4. ఆఫ్రికాఖండంలో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన పీఠభూమి ఎత్తు ఎంత?
1) 200 మీ. 2) 500 మీ. - 1000 మీ.
3) 200-1000 మీ. 4) ఏదీకాదు
5. ఆఫ్రికాలో ఉత్తరాన ఏ పర్వతాలు ఉన్నాయి?
1) అట్లాస్ 2) ఆండీస్ 3) యూరల్ 4) ఆరావళి
6. అట్లాస్ పర్వతాలకు దక్షిణంగా ఉన్న ఎడారి?
1) కలహారి ఎడారి 2) సహారా ఎడారి
3) థార్ ఎడారి 4) అబిసీనియా ఎడారి
7. ఆఫ్రికాకు దక్షిణంగా ఉన్న ఎడారి?
1) కలహారి ఎడారి 2) సహారా ఎడారి
3) థార్ ఎడారి 4) అబిసీనియా ఎడారి
8. ప్రపంచంలో పొడవైన నది?
1) నైలు నది 2) కాంగో నది 3) నైగర్ 4) ఏంజిల్
9. భూమధ్యరేఖను రెండుసార్లు దాటుతున్న నది?
1) నైలు నది 2) కాంగో నది
3) నైగర్ 4) జాంబేజి నది
10. ప్రపంచంలో లోతైన నది?
1) నైలు నది 2) కాంగో నది 3) నైగర్ 4) జాంబేజి
11. కిందివాటిలో మధ్యదరా సమువూదంలో కలిసేది?
1) నైలు నది 2) జాంబేజి 3) కాంగో 4) నైగర్
12. కిందివాటిలో ఏ రెండు నదులు అట్లాంటిక్ మహాసమువూదంలో కలుస్తున్నాయి?
1) కాంగో, నైలు 2) నైలు, నైజర్
3) జాంబేజి, నైలు 4) కాంగో, నైగర్
13. ఏ నది హిందూమహాసమువూదంలో కలుస్తుంది?
1) జాంబేజి 2) వోల్టా 3) నైగర్ 4) దాల్
14. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ అనే మూడు అక్షాంశాలు ఏ ఖండం గుండా పోతున్నాయి?
1) ఆస్ట్రేలియా 2) ఆఫ్రికా
3) ఉత్తర అమెరికా 4) దక్షిణ అమెరికా
15. భూమధ్యరేఖా ప్రాంతంలో ఏ అడవులు ఉన్నాయి?
1) సతత 2) సవన్నా 3) ముళ్ల 4) పైవన్నీ
16. సవన్నా రకపు గడ్డి భూముల్లో ఎంత వర్షపాతం ఉంటుంది?
1) అత్యధిక 2) మధ్యస్థాయి
3) అత్యల్ప 4) ఏదీకాదు
17. అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాల్లో ఏ అడవులు ఉన్నాయి?
1) భూమధ్యరేఖా 2) సవన్నా
3) ముళ్లజాతి 4) పైవన్నీ
18. కింది వాటిలో అత్యధిక వర్షపాతం లేని దేశం?
1) ఘనా 2) గినియా 3) ఉగాండా 4) సూడాన్
19. కింది వాటిలో అత్యల్ప వర్షపాతం గల దేశం?
1) పశ్చిమ సహారా 2) నమీబియా తీర ప్రాంతం
3) దక్షిణావూఫికా 4) పైవన్నీ
20. భూమధ్యరేఖ కింది వాటిలో ఏ దేశం గుండా పోదు?
1) కాంగో 2) ఉగాండా 3) కెన్యా 4) లిబియా
21. ఆఫ్రికాలో కర్కటరేఖ పోయే దేశం?
1) లిబియా 2) ఈజిప్టు 3) అల్జీరియా 4) పైవన్నీ
22. కలహారి ఎడారి ఏ దేశంలో విస్తరించి లేదు?
1) నమీబియా 2) జింబాబ్వే
3) దక్షిణాఫ్రికా 4) అల్జీరియా
23. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఏ భాగాన విస్తరించి ఉంది?
1) తూర్పు 2) ఉత్తరం 3) పడమర 4) దక్షిణం
24. సహారా ఎడారి ఏ దేశంలో విస్తరించి లేదు?
1) మొరాకో 2) స్వాజీలాండ్
3) అల్జీరియా 4) ఈజిప్టు
25. ఆఫ్రికా నుంచి ఇండియాకు ఏ మార్గం ద్వారా ప్రయాణిస్తారు?
1) తూర్పు 2) ఈశాన్యం 3) దక్షిణ 4) పడమర
26. ఆఫ్రికా నుంచి ఇండియాకు రావాలంటే ఏ సమువూదాన్ని దాటాలి?
1) అట్లాంటిక్ 2) హిందూ
3) మధ్యదరా 4) ఎర్ర సముద్రం
29. ఆఫ్రికా నుంచి అట్లాంటిక్ మహాసమువూదాన్ని దాటుతూ యూరప్ వెళ్లడానికి ఏ దీవుల్లో ఆగేవారు?
1) సెయింట్ లారెన్స్ 2) సెయింట్ మధీర
3) అజోర్స్ 4) 2, 3
30. వాస్కోడిగామా ఆఫ్రికా మీదుగా ఇండియా చేరడానికి ఆఫ్రికాలో ఎక్కడకు చేరాడు?
1) కెన్నడి 2) టారిలోనియా
3) గుడ్‌హోప్ అగ్రం 4) ఎర్ర సముద్రం
31. సవన్నా గడ్డి భూముల్లోని ముఖ్య వృక్ష సంపద?
1) ఎడారి 2) పర్వతీయ
3) సతత హరిత అడవి 4) ఏదీకాదు
32. ఆఫ్రికాలో కర్కట రేఖకు ఉత్తరాన, మకర రేఖకు దక్షిణాన వ్యాపించి ఉన్న శీతోష్ణస్థితి?
1) ఉష్ణమండలం 2) అతిశీతల
3) సమశీతోష్ణ 4) ఏదీకాదు
33. ఆఫ్రికాలో పోర్చుగల్ వలసరాజ్యం?
1) లైబీరియా 2) మొజాంబిక్
3) కామెరూన్ 4) కాంగో
34. ఆఫ్రికా దేశాలైన ఈజిప్టు, సూడాన్ ఏ దేశ వలస రాజ్యాలు?
1) ఇటలీ 2) స్పెయిన్ 3) బ్రిటన్ 4) పోర్చుగల్
35. ప్రపంచంలో అతిపెద్ద వజ్రపుగని?
1) పన్నా 2) కాల్‌గుర్లీ 3) కూల్‌గార్లీ 4) కింబర్లీ
36. నైజీరియా జోస్ పీఠభూమిలో లభించే ఖనిజం?
1) బంగారం 2) తగరం
3) ముడి చమురు 4) బొగ్గు
37. ఆఫ్రికాలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం?
1) కిలిమంజారో 2) వెసూవియస్
3) అట్లాసు 4) రాకీ
38. ఆఫ్రికా నుంచి వచ్చిన బానిసలందరినీ స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా ఎప్పుడు ప్రకటించారు?
1) 1850 2) 1860 3) 1870 4) 1880