అంతర్జాతీయ బాలల దినోత్సవం : జూన్ 1
〰〰〰〰〰〰〰〰👫
Hi friends,Today's International children's day--వినయ్స్ ఇన్ఫో
🌀1948వ సంవత్సరంలో ప్రపంచ సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి.
🌀 ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహరాల్ జన్మదినమైన నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
🌀 బాల్యమా.. ఏదీ నీ చిరునామా ....?!
-బాల్యం ఓ అద్భుత వరం. బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు.
🌀 ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. వారికోసం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
🌀 బాలలంటే బడి పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో... భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే ఏకైక ఆలోచనకు బలవంతంగా బద్ధులై బ్రతికే సగటు బాలుడు బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?
దీనికి అనేక కారణాలున్నాయి.
బాలల హక్కులను కాలరాస్తున్న మన పాలకుల నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణం.
🌀ఈ నేపథ్యంలో బాలల హక్కులు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిల్డ్రన్స్ డే ప్రత్యేక వ్యాసం...
🌀 మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహరాల్ జన్మదినమైన నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం... విషయం తెలిసిందే. అయితే పిల్లల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొం దించే మరో శుభదినమే ఐక్యరాజ్య సమితి పాటించే ప్రపంచ బాలల దినోత్సవం. ప్రతి ఏడాది నవంబరు 20వ తేదీని ప్రపం చ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. యూనిసెఫ్ (యునై టెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్) బాలల దినం కార్యక్రమాలను సమన్వయం చేసి నిర్వహిస్తున్నది. పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది.
ఇదే వారంలో (నవంబర్ 19) బాలల అత్యాచార నిర్మూలన దినోత్సవం (చైల్డ్ అబ్యూస్ ప్రివెన్షన్ డే) కూడా జరుపుకోవడంతో ఈ వారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
🌀 అయితే ఈ ఉత్సవాల సంగతి ఎలా ఉన్నా మనదేశంలో బాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి? విద్యా, వైద్య సేవలు చిన్నారులకు అందుతున్నాయా? అని పరిశీలించుకుంటే ఎన్నో భయంకర వాస్తవాలు వెలుగుచూస్తాయి.
🌀 భారతదేశంలో సుమారు 30 కోట్ల చిన్నారుల్లో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు. ఆర్థిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన నవభారతాన్ని నిర్మించాలంటే... నేటి బాలల అవసరాలను తీర్చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అందుకు సమయమాసన్నమైనది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఈ ఆరు దశాబ్దాల కాలంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ, చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యా చరణ విధానాలను, కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించేవిధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పిల్లల హక్కులను సంరక్షిం చే ఫలాలు ఇప్పటికీ అందరికీ అందడంలేదు.
🌀 1959 ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల ప్రకటనకు మన దేశం భాగస్వామి. అలాగే ఇండియా 1974లో పిల్లలపై జాతీయ విధానం ఆమోదించింది. పుట్టుకకు ముందు పుట్టిన తర్వాత పిల్లలకు తగిన సేవలందిస్తా మని హామీ ఇచ్చిన రాజ్యాంగ నిబంధనలు ఈ విధానం పునరుద్ఘాటించింది. పిల్లల భౌతిక, మాన సిక సామాజిక పెరుగుదలకు పూర్తిగా హామీ పలికింది.
పిల్లలు జీవనం, వారి సంరక్షణ, అభివృద్ధి పై ప్రపంచ ప్రకటనపై ఇండియా సంతకం చేసింది. ప్రపంచ సదస్సులో చేసిన వాగ్దానానికి అను గుణంగా మానవవనురుల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని మహిళా శిశుసంక్షేమ విభా గం పిల్లల కోసం జాతీయ కార్యాచరణ పథ కాన్ని రూపొందించింది.
🌀 అయితే ఇవన్నీ పకడ్భందీ అమలకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ దేశంలో బాలల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.
భారత్‌లో పిల్లల స్థితిగతులు...
〰〰〰〰〰〰〰〰〰
🔷మనదేశంలోని మిలియన్ల కొద్ది పిల్లలు... జీవనం, ఆరోగ్యం, పోషకాహారం, చదువు, రక్షిత తాగునీరు హక్కులను కోల్పోతున్నారని, 63 శాతం పిల్లలు రాత్రి ఆకలి కడుపుతో నిద్రపోతు న్నారని, 53 శాతం పిల్లలు తీవ్రమైన పోషకాహా రలోపం వల్ల బాధపడుతున్నారీ యూనిసెఫ్ 2005 నివేదికలో వెల్లడించింది.
🔷మనదేశంలో 147 మిలియన్ల పిల్లలు పూరిళ్ళల్లో నివసిస్తున్నా రు. 77 మిలియన్ల పిల్లలు కొళాయిల తాగునీరు వాడడం లేదు. 85 మిలియన్ల పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందడం లేదు. 27 మిలియన్ల పిల్లలు బరువుతక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక భయంకర చేదు వాస్తవాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది. నివేదిక ప్రకారం 33 మిలియన్ల మంది బడి ముఖం చూడలేదు.
🔷 5-14ఏళ్ళ లోపు 72 మిలియన్ల పిల్లలకు ప్రాథమిక విద్య అందుబాటులో లేదు. మగపిల్లలకే ప్రా దాన్యం ఇస్తున్నందువల్ల ఆడపిల్లలు అశ్రద్ధకు, తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. ఈ సమస్యల నివారణ కోసం భారత్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తవరూపం దాల్చడంలేదని నిర్వివాదాంశం.
🔷 వీటి నివారణలో భాగంగా బా లల హక్కుల పరిరక్షణకై కేంద్రప్రభుత్వం ఓ జాతీయ సంఘాన్ని కూడా ఏర్పా టు చేసింది. అయితే లక్ష్యసాధనలో అది అనుకున్న మేర సఫలీకృతం కాలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
🔷 దీనికి నానాటికీ పెరిగిపోతున్న బాలకార్మిక వ్యవస్థ, బాలలపై అత్యాచారాలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
బాల కార్మిక వ్యవస్థ - నిర్మూలన...
〰〰〰〰〰〰〰〰〰
🔷జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇప్పటికీ కొనసాగుతూనేవుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే వుంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్ల... దారిద్య్రం, నిరక్షరాస్యతతో కూడినది
🔷 కాబట్టి ఇంకా సమాజంలోని అన్ని వర్గా ల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ ప్రభుత్వం ముందుంచింది.
🔷 దారిద్య్రం కొనసాగుతున్నంతవరకూ, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం అసాధ్యమన్నారు. కాగా దాన్ని చట్టపరంగా నిర్మూలించడ మనేది ఆచరణ సాధ్యం కాదన్నారు.
బాలకార్మిక వ్యవస్థ- కారణాలు...
〰〰〰〰〰〰〰〰
🌀జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాల లు పనుల్లోకి నెట్టబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పిల్లలు సులువుగా దోపిడికి గురవ్వడమే.
🌀 పిల్లలు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయడానికి ప్రధాన కారణం పేద రికం.
🌀 జనాభా పెరుగుదల, చట్టాలను అమలు పరచనందు వల్ల తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి ఇష్టపడకపోవడం (పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో),
🌀 గ్రామీణ ప్రాం తాల్లోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్థకు కారణాలు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఏంచేయాలి?.....,
🌀 బాలకార్మికవ్యవస్ధ నిర్మూలనకోసం 76 బాల కార్మిక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
🌀 ఇప్పటివరకు సుమారు 1,05,000 పిల్లలను ప్రత్యేక బడులలో చేర్పించారు.
🌀 57 అతి ప్రమాదకర పరిశ్రమ ల్లో పనిచేస్తున్న బాలలు, హొటళ్ళు, ఇళ్ళల్లో పనిచేస్తున్న (9-14 సంవత్సరాల మధ్య వయస్సున్న) పిల్లలు ఈ పథకంలో చేర్పిం చబడ్డారు.
🌀 ప్రభుత్వ పథకాలైన అందరికీ విద్యావిధానం (సర్వశిక్షాభియాన్) అమలు చేయబడుచున్నది.
🌀 ఇలాంటి పథకాలు మరిన్ని ప్రవేశపెట్టి ఈ విధానాలు మరింత పటిష్టంగా అమలు చేసినప్పుడే బాలకార్మిక వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగుతుంది.
🔷2008లో అందరికీ విద్య పై యునిసెఫ్ విడు దల చేసిన ప్రపంచ పర్యవేక్షణ నివేదిక బాల కార్మిక వ్యవస్థకు పిల్లల నిరక్షరాస్యతకు మధ్య వున్న సంబంధంపై నొక్కిచెప్పింది. 100 మిలి యన్ల పిల్లలు అంటే 70 శాతం బాలకార్మికు లు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరం గంలో పనిచేస్తున్నారని అక్కడ పాఠశా లలు గానీ, సుశిక్షితులైన టీచర్లుగానీ, విద్యాపరమైన వనరులుగానీ లేవనీ వెల్లడిస్తోంది.
🔷నిరక్షరాస్యత గ్రామీణ- పట్టణ వైషమ్యంకంటే తీవ్రమైంది. ఖర్చు, కులం, సంస్కృతి మూలంగా పట్ట ణ ప్రాంతాల్లో కూడా నిరుపేద పిల్లలు స్కూళ్ళు ఉండి కూడా చదువుకోలేకపో తున్నారు.
🔷ఉచిత విద్య అందుబాటులో లేకపోవడంతో పిల్లలు లైంగిక దోపిడీ, దౌర్జన్యాలకు లోనవుతున్నారు.
🔷 తల్లిదండ్రు లు లేక ఒక బిడ్డ ఇలాంటి క్షోభకు గురి కాకూడదు. చదువుకు ప్రజారోగ్యానికి బలీయమైన సంబంధం ఉంది.
🔷పిల్లల హక్కుల ను కాపాడడం కోసం చట్టం కల్పించిన రక్షణ లను పరిశీలించి సమీక్షించడంకోసం ఆవిర్భ వించిన ఈ సంఘం చట్టాలు శక్తిమంతంగా అమలు అవడంకోసం చర్యలు సిఫార్సు చేస్తుంది.
🔷ఒక వేళ అవసరమైతే సవరణలు సూచించి ఫిర్యాదులను విచారిస్తుంది. పిల్లల చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన కేసులను సంఘం తనంతటతానే పరిశీలిస్తుంది.
🌀 ఇవన్నీ పటిష్టంగా అమలు జరి గితే బాలల హక్కులు ఆశించనంతస్థాయిలో మెరుగవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
🌀 అయితే పేపర్‌పైన ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న జాతీయం సంఘం లక్ష్యాలు ఆచ రణలోకి వచ్చేటప్పటికీ కార్యరూపం దాల్చ టంలేదు.
〰〰〰🌷🌷🌷〰〰